దేవరకొండ వెంకట సుబ్బారావు

వికీపీడియా నుండి
దేవరకొండ వెంకట సుబ్బారావు
D.V.Subbarao.JPG
డి.వి.సుబ్బారావు
జన్మ నామం దేవరకొండ వెంకట సుబ్బారావు
జననం 1894
మరణం 1960
ఇతర పేర్లు డి.వి.సుబ్బారావు
ప్రాముఖ్యత తెలుగు రంగస్థల నటులు

డి.వి.సుబ్బారావు గా ప్రసిద్ధిచెందిన తెలుగు రంగస్థల నటుని పూర్తి పేరు దేవరకొండ వెంకట సుబ్బారావు (1894 - 1960).

వీరు హైస్కూలు విద్య తర్వాత కొంతకాలం గుమస్తాగా పనిచేసి, 14 ఏళ్ళ వయసునుండే భువన రంజనీ థియేటర్ లో చేరి వారి నాటకాలలో పాత్రలు పోషించారు. తర్వాత నల్లూరి బ్రహ్మానందం నడుపుతున్న ఇండియన్ డ్రమెటిక్ కంపెనీలో 1910 సంవత్సరంలో చేరారు. అనతికాలంలో ఆ సంస్థకు అధిపతిగా దానిని క్రమశిక్షణ కలిగిన నాటక సమాజంగా తీర్చిదిద్దారు. వీరు నాటక ప్రదర్శనం ఒక సమిష్టి కృషిగా, సమయ పాలనతో, ఎలాంటి లోపం లేకుండా నిర్వహించారు. నాటక రచయితగా పింగళి నాగేంద్రరావు ను నియమించి వారిచే ఎన్నో ఉత్తమ నాటకాలను రచించి ప్రదర్శించారు. సుమారు 36 సంవత్సరాలకు పైగా పనిచేసి 34 నాటకాలను ప్రదర్శించారు. వానిలో గులేబకావళి, గయోపాఖ్యానం, గోపీచంద్, బొబ్బిలి, రసపుత్ర విజయం, లవకుశ, చంద్రహాస, కృష్ణలీల, సత్య హరిశ్చంద్ర, నా రాజు, వింధ్యరాణి, మరో ప్రపంచం, చిత్ర నళీయం, చిత్రాంతి ముఖ్యమైనవి.

మూలాలు [మార్చు]

  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.