దేవరాజ్ గోవిందరాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవరాజ్ గోవిందరాజ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
దేవరాజ్ దేవేంద్రరాజ్ గోవిందరాజ్
పుట్టిన తేదీ (1947-01-02) 1947 జనవరి 2 (వయసు 77)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి బ్యాటింగ్
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1964-65 to 1974-75హైదరాబాదు క్రికెట్ జట్టు
1966-67 to 1971-72స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రికెట్ జట్టు
1966-67 to 1970-71సౌత్ జోన్ క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ లిస్ట్ ఏ
మ్యాచ్‌లు 93 3
చేసిన పరుగులు 1202 0
బ్యాటింగు సగటు 13.50
100లు/50లు 0/5 0/0
అత్యధిక స్కోరు 72 0*
వేసిన బంతులు 10,087 150
వికెట్లు 190 3
బౌలింగు సగటు 27.66 21.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 2 n/a
అత్యుత్తమ బౌలింగు 6/38 2/14
క్యాచ్‌లు/స్టంపింగులు 36/– 0
మూలం: క్రిక్ ఇన్ఫో, 2014 మార్చి 7

దేవరాజ్ దేవేంద్రరాజ్ గోవిందరాజ్ (జననం 2 జనవరి 1947) తెలంగాణకు చెందిన భారత మాజీ ఫాస్ట్ బౌలర్. 1964-65 నుండి 1974-75 వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లలో ఆడాడు. 1970-71లో వెస్టిండీస్, 1971లో ఇంగ్లాండ్‌ దేశాలలో పర్యటించాడు, కానీ అక్కడ టెస్ట్ క్రికెట్ ఆడలేదు.

జీవిత విషయాలు[మార్చు]

దేవరాజ్ 1947, జనవరి 2న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు.

క్రీడారంగం[మార్చు]

1964-65లో జరిగిన రంజీ ట్రోఫీలో హైదరాబాదు క్రికెట్ జట్టు తరపున దేవరాజ్ తన కెరీర్‌ను ప్రారంభించాడు. బౌలింగ్, బ్యాటింగ్ చేసేవాడు. 1966-67లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మొయిన్-ఉద్-దౌలా గోల్డ్ కప్ టోర్నమెంట్‌ లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన దేవరాజ్ 59 పరుగులు చేయడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటిసారి కప్ ను గెలుచుకుంది.[1]

1967-68లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో పర్యటించడానికి భారత క్రికెట్ జట్టు ఎంపిక కోసం నిర్వహించిన శిక్షణా శిబిరానికి హాజరయ్యాడు. అయితే దానిలో దేవరాజ్ కంటే ముందుగానే ఉమేష్ కులకర్ణి, రమాకాంత్ దేశాయ్ ఎంపికయ్యారు.[2] భారతదేశంలో 1967-68లో జరిగిన దేశవాళీ క్రికెట్‌లో 26.95 సగటుతో 23 వికెట్లు తీసుకున్నాడు.[3] స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనల్ మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసినపుడు, మొయిన్-ఉద్-డౌలా గోల్డ్ కప్ టోర్నమెంట్‌ను గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.[4] 1968 ఫిబ్రవరిలో ఇండియన్ XI జట్టు తరపున టూరింగ్ ఇంటర్నేషనల్ XI జట్టుతో ఆడిన దేవరాజ్ రెండుసార్లు ఖలీద్ ఇబాదుల్లా వికెట్, ఒకసారి కెన్ సుటిల్ వికెట్ ను తీసుకున్నాడు.

1968-69లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున సిలోన్ పర్యటనలో పాల్గొన్నాడు. సిలోన్ బోర్డ్ ప్రెసిడెంట్ అండర్ -27s XI తో జరిగిన మ్యాచ్‌లో దేవరాజ్ ఇన్నింగ్స్ విజయంలో తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ గణాంకాలు (రెండో ఇన్నింగ్స్‌లో 38 కి 6), మ్యాచ్ ఫిగర్స్ (70 కి 11) సాధించాడు.[5] రెండు నెలల తరువాత రంజీ ట్రోఫీలో హైదరాబాదు - ఆంధ్రా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 5-21, 5-75 తీసి హైదరాబాదు విజయంలో కీలక పాత్ర పోషించాడు.[6]

భారతదేశం తరపున[మార్చు]

1970-71 భారతీయ సీజన్‌లో 29.00 సగటుతో 24 వికెట్లు తీసిన తరువాత దులీప్ ట్రోఫిలో ఈస్ట్ జోన్ క్రికెట్ జట్టు తరపున 114 పరుగులకు 5 వికెట్లు తీయడంతో వెస్టిండీస్, ఇంగ్లాండ్ పర్యటనలకు ఎంపికయ్యాడు. జట్టులో ఉన్న ఏకైక ఫాస్ట్ బౌలర్ అయినప్పటికీ, దేవరాజ్ కు ఈ పర్యటనలో టెస్టులు ఆడే అవకాశం రాలేదు, సెలెక్టర్లు మీడియం-పేస్ ఆల్ రౌండర్లైన ఏకనాథ్ సోల్కర్, సయ్యద్ అబిద్ అలీ లను తీసుకున్నారు, ఎక్కువ వికెట్లు తీయడానికి ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లపై ఆధారపడ్డారు. వెస్టిండీస్‌లో ఐదు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 91.5 ఓవర్లలో 37.60 సగటుతో 10 వికెట్లు తీసుకున్నాడు.[7] ఇంగ్లాండ్‌లో 16 మ్యాచ్‌లు ఆడి, 61.27 సగటుతో 11 వికెట్లు తీసుకున్నాడు.[8]

1971-72లో రక్షణ నిధికి సహాయంగా జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ఎలెవన్ తరఫున రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుతో ఆడాడు, కానీ ఆ మ్యాచ్ లో వికెట్లు తీయలేదు.[9] 27 సంవత్సరాల వయస్సులో ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి తప్పుకోవడానికి ముందు మరికొన్ని సీజన్లలో ఆడాడు.

ఇతర వివరాలు[మార్చు]

క్రికెట్ ఆడుతున్న రోజుల్లో భారతీయ స్టేట్ బ్యాంకు లో పనిచేశాడు. తరువాత కొంతకాలం లండన్‌లో బస్సులు నడిపాడు, ఇటీవల క్రికెట్ కోచ్‌గా ఉన్నాడు.[10]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]