దోర్జీ ఖండూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దోర్జీ ఖండు
దోర్జీ ఖండూ


పదవీ కాలం
2007 ఏప్రిల్ 9 – 2011 ఏప్రిల్ 30
ముందు గెగాంగ్ ఆపాంగ్

వ్యక్తిగత వివరాలు

జననం 1955 మార్చి 19
ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్ భారతదేశం
మరణం 2011 ఏప్రిల్ 30
తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ
సంతానం ఫెమా ఖాండూ
వృత్తి రాజకీయ నాయకుడు

దోర్జీ ఖండూ (19 మార్చి 1955 - 30 ఏప్రిల్ 2011) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అరుణాచల్ ప్రదేశ్ మాజీముఖ్యమంత్రి. అతను 2009 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో గెలుపొంది రెండవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

దోర్జీ ఖండూ భారతదేశంలోని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీలోని తవాంగ్లో జన్మించాడు. [1]

దోర్జీ ఖండూకు నలుగురు భార్యలు, ఐదుగురు కుమారులు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు ఇతనిది బౌద్ధమతం.ఇతని పెద్ద కుమారుడు, . పెమా ఖండూ, ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

దోర్జీ ఖండూ ఇండియన్ ఆర్మీలో ఏడేళ్లపాటు పనిచేశారు. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో చేసిన సేవలకు గాను అతనికి బంగారు పతకం లభించింది.

మార్చి 1990లో, అతను థింగ్బు-ముక్తో నియోజకవర్గం నుండి అరుణాచల్ ప్రదేశ్ మొదటి శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. [2] మార్చి 1995లో, అతను అదే నియోజకవర్గం నుండి రెండవసారి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రెండవ శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు. [2] అతను 21 మార్చి 1995 నుండి సహకార శాఖ మంత్రి నియమించబడ్డాడు. [2]

  • 21 సెప్టెంబర్ 1996, అతను పశుసంవర్ధక పశువైద్యం, డెయిరీ డెవలప్‌మెంట్ మంత్రి అయ్యాడు.
  • 1998, అతను 1998-2006 మధ్య విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు.
  • అక్టోబర్ 1999న, అతను అరుణాచల్ ప్రదేశ్ యొక్క మూడవ శాసనసభకు ఎన్నికయ్యాడు. అతను 15 అక్టోబర్ 2002 నుండి 27 జూలై 2003 వరకు గనులు, రిలీఫ్ పునరావాస మంత్రిగా ఉన్నారు.
  • 28 జూలై 2003, ఆర్థిక శాఖ మంత్రి అయ్యాడు.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి[మార్చు]

9 ఏప్రిల్ 2007న, అతను గెగాంగ్ అపాంగ్ రాజీనామా చేసిన తర్వాత అతని స్థానంలో రాష్ట్రానికి ఆరవ ముఖ్యమంత్రి అయ్యాడు. [3] [4] మళ్లీ 2009లో, అతను అదే నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు 2019 అక్టోబర్ 25న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు [3] [5]

హెలికాప్టర్ ప్రమాదంలో మృతి[మార్చు]

2011 ఏప్రిల్ 30న, తవాంగ్ నుండి ఇటానగర్‌కు విహారయాత్రకు వెళ్లిన ఖండూ మరో నలుగురు వ్యక్తులతో వెళ్తున్న హెలికాప్టర్ అదృశ్యమైంది. [6]

4 మే 2011న, ఉదయం 11 గంటల సమయంలో, కూలిపోయిన హెలికాప్టర్ అవశేషాలను స్థానికులు కనుగొన్నారు.

మే 5 ఉదయం దోర్జీ ఖండూ మరణ వార్తను భారత హోం మంత్రి పి చిదంబరం ధృవీకరించారు. [7] అంతకుముందు విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ఎం కృష్ణ మాట్లాడుతూ, దోర్జీ ఖండూ మరణం తనను తీవ్రంగా బాధిస్తున్నదని అన్నారు. [8]

ముఖ్యమంత్రి అంత్యక్రియలు తవాంగ్ జిల్లాలోని ఆయన స్వగ్రామమైన గ్యాంగ్‌ఖార్‌లో మోన్పా బౌద్ధ మత ఆచారాల ప్రకారం జరిగాయి. [9] ఇతని మంత్రి వర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జర్బోమ్ గామ్లిన్ ముఖ్యమంత్రి అయ్యాడు, అదే సంవత్సరం అక్టోబర్ 31న రాజీనామా చేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తరువాత హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ముఖ్యమంత్రి ఇతనే.

మూలాలు[మార్చు]

  1. "Dorjee Khandu to be new Arunachal CM". The Hindu. 9 April 2007. Retrieved 5 May 2011.
  2. 2.0 2.1 2.2 "Dorjee Khandu sworn in as Arunachal CM" (in ఇంగ్లీష్). Hindustan Times. 25 October 2009. Retrieved 19 February 2021.
  3. 3.0 3.1 "Factfile: Dorjee Khandu" (in ఇంగ్లీష్). Hindustan Times. 4 May 2011. Retrieved 19 February 2021.
  4. "Khandu Dorjee becomes Arunachal Chief Minister". Hindustan Times. India. 9 April 2007. Archived from the original on 28 December 2007. Retrieved 25 October 2009.
  5. "Dorjee Khandu sworn in as chief minister of Arunachal". The Times of India. India. 25 October 2009. Retrieved 25 October 2009.
  6. Talukdar, Sushanta (30 April 2011). "Arunachal Pradesh CM's helicopter goes missing". The Hindu. Paris. Retrieved 2 May 2011.
  7. "Arunachal CM Dorjee's body recovered: Chidambaram". Hindustan Times. 5 May 2011. Archived from the original on 8 May 2011. Retrieved 5 May 2011.
  8. "Arunachal CM Dorjee Khandu killed in chopper crash". The Times of India. 4 May 2011. Archived from the original on 5 November 2012. Retrieved 5 May 2011.
  9. "Last rites of Khandu at Gyangkhar village". The Hindu. 2011-05-05. Retrieved 2011-05-05.

బాహ్య లంకెలు[మార్చు]

అంతకు ముందువారు
జిగాంగ్ అపాంగ్
అరుణాచల ప్రదేశ్ ముఖ్యమంత్రి
April 2007–2011
తరువాత వారు
జార్బం గామ్లిన్