పిచ్చుక

వికీపీడియా నుండి

పిచ్చుక
ఇంటి పిచ్చుక
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: పక్షులు
వర్గము: పేసరీఫార్మిస్
కుటుంబము: పేసరిడే
ఇల్లిగర్, 1811
ప్రజాతి
పేసర్
పెట్రోనియా
కార్పోస్పిజా
మాంటిఫ్రిగిల్లా

పిచ్చుక (Sparrow) ఒక చిన్న పక్షి.

నిజమైన పిచ్చుకలు పేసరిఫార్మిస్ క్రమంలో పేసరిడే కుటుంబానికి చెందిన చిన్న పక్షులు. ఇవి సాధారణం చిన్నగా బొద్దుగా గోధుమ-ఊదా రంగులో ఉండి చిన్న తోకతో పొట్టిగా ఉండే బలమైన ముక్కు కలిగివుంటాయి. వివిధ జాతుల మధ్య భేదాలు అల్పంగా ఉంటాయి. పిచ్చుకలు ముఖ్యంగా గింజలను తింటాయి, కొన్ని చిన్న చిన్న క్రిమి కీటకాలను కూడా తింటాయి. గల్స్ లేదా కొండ పిచ్చుకలు పట్టణాలలో నివసించి ఏదైనా తింటాయి. ఇవి Chestnut Sparrow (Passer eminibey) 11.4 సె.మీ. (4.5 అంగుళాలు) మరియు 13.4 గ్రా., నుండి Parrot-billed Sparrow (Passer gongonensis), at 18 సె.మీ. (7 అంగుళాలు) మరియు 42 గ్రా. (1.5 oz) మధ్యలో ఉంటాయి. పిచ్చుకలు శరీర నిర్మాణంలో ఇతర గింజలను తినే పక్షుల లాగే ఉండి, పృష్ఠ బాహ్య ఈకలు అవశేషాలుగా మారతాయి, నాలుకలో ఒక ఎముక అధికంగా ఉంటుంది.[1]

ఈ నిజమైన ప్రాచీన పిచ్చుకలు యూరప్, ఆఫ్రికా మరియు ఆసియాలో విస్తరించాయి. ఆస్ట్రేలియా మరియు అమెరికా ఖండాలలో విస్తరించి, పట్టణాలలో బాగా స్థిరపడ్డాయి. అమెరికా పిచ్చుకలు లేదా ఆధునిక పిచ్చుకలు వీనికి కొన్ని పోలికలున్నా, చాలా భిన్నమైనవి. ఇవి ఎంబరిజిడే కుటుంబానికి చెందినవి. ఇలాగే హెడ్జ్ పిచ్చుక లేదా డన్నక్ (Prunella modularis) కూడా అసలు పిచ్చుకలకు సంబంధించినది కాదు.

జీవనశైలిలో పెనువేగంగా వచ్చిన మార్పే 'పిచ్చుకపై బ్రహ్మాస్త్రం'గా పరిణమించింది. పిచ్చుక జాతి అంతరించనుంది. శరవేగంగా పట్టణీకరణ, అంతరిస్తున్న పచ్చదనం, రసాయనాలతో పళ్లు, ఆహార ధాన్యాల ఉత్పత్తి. పిచ్చుకలు అంతరించిపోవడానికి కారణాలు. సెల్యూలర్ టవర్లు నుంచి వెలువడే అయస్కాంత తరంగాలు ఆ జాతికి ముప్పుగా పరిణమించాయి. కృత్రిమమైన పిచ్చుకగూళ్లను ఏర్పాటు చేయడం ద్వారా పిచ్చుక జాతిని కొంతవరకు సంరక్షించవచ్చని శాస్త్రవేత్తల సలహా.[2]

నిజమైన పిచ్చుకలో ఇంచుమించు 35 జాతులున్నాయి. ఈ దిగువన పేర్కొన్నవి పూర్తి జాబితా.

[మార్చు] వర్గీకరణ ప్రకారం జాతుల జాబితా

కళాకారుడు గీసిన పిచ్చుక చిత్రం.

[మార్చు] మూలాలు

  1. Bledsoe, A.H. & Payne, R.B. (1991). in Forshaw, Joseph: Encyclopaedia of Animals: Birds. London: Merehurst Press, 222. ISBN 1-85391-186-0. 
  2. [1]

[మార్చు] బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు