Jump to content

బిద్రీ కళ

వికీపీడియా నుండి
ఈ వ్యాసం
భౌగోళిక గుర్తింపు (GI)
జాబితాలో భాగం

బిద్రీ కళ
బిద్రీ కళ
నవాబుల కాలపు , హుక్కా
వివరణబిద్రీ అనేది ఒక లోహ కళ. ఇది నల్లని వస్తువులపై బంగారు, వెండి తీగల అల్లిక ద్వారా చేసే కళ.
రకంహస్తకళ
ప్రాంతంబీహార్ , ఆంధ్ర ప్రదేశ్
దేశంభారత దేశం

భౌగోళిక గుర్తింపు భౌగోళిక గుర్తింపు

బిద్రీ అనేది ఒక లోహ కళ. ఇది నల్లని వస్తువులపై బంగారు, వెండి తీగల అల్లిక ద్వారా చేసే కళ. ఇది ప్రధానంగా బీహార్ లో ప్రారంభమైనా తరువాత ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్ కు విస్తరించింది. ఈ కళకు భారతదేశం భౌగోళిక గుర్తింపు లభించింది.[1]

చరిత్ర

[మార్చు]

మొదట ఈ కళ ఫర్షియా నుండి బహమనీ సుల్తానుల ద్వారా 14 వ శతాబ్దంలో బీహారుకు చేరింది.[2] బీహార్ పలు ప్రాంతాలలో అనేక మంది ఈ కళా కారులు వలసలు రావడం ద్వారా బీహార్ లో ఈ కళను చేసే వారు అధికంగా ఉండేవారు.[3] వారు హైదరాబాద్ నవాబుల వద్దకు ఈ వస్తువులు అమ్మకమునకు తీసుకురావడం చేసేవారు. అలా మొదలైన వారి అమ్మకాలు అధికంగా ఉండటం వలన క్రమముగా హైదరాబాద్ చుట్టుప్రక్కల పలు ప్రాంతాలలో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకోవడ ద్వారా ఈ కళ హైదరాబాద్ లో ఎక్కువగా అభివృద్ధి చెందింది

1850 నాటి ఒక బిద్రీ కళా వస్తువు V&A Museum

తయారీ విధానం

[మార్చు]

బిద్రీ కళ ప్రధానంగా అలంకరణకు వాడు వస్తువులపై ఉంటుంది. కుందెలు, బొత్తములు, కుండలు, పాత్రలు వంటి వాటిపై చేస్తారు. వీటి తయారీకి కావలసిన ఒక రకమైన మట్టి ఎక్కువగా బీహార్ పరిశర ప్రాంతాలలో దొరుకుతుంది. కాపర్, జింక్ మిశ్రమంతో చేసిన లోహం మీద వెండి లేదా బంగారు తీగలను చొప్పిస్తూవీటిని చేస్తారు. ద్రవరూపంగ ఉందే ఈ మిశ్రమాన్ని కావలసిన ఆకారంలోకి వచ్చేలా అచ్చులలో పోస్తూ చల్లార్చుతారు.తరువాత అవి నలుపు రంగుకు మారేలా కాపర్ సల్ఫేట్ పూత పూస్తారు. దానిమీద కావలసిన డిజైన్లు గీస్తారు. సన్నని సూదులతో డిజైన్ వెంబడి రంధ్రాలు చేస్తూ వాటి గుండా సన్నని వెండి తీగలను చొప్పిస్తూ అవి ఊడకుండా చిన్నగా సుత్తితో కొడుతూ గట్టిగా అతుక్కొనేలా చేస్తారు. ఆపై మళ్ళీ మొత్తంగా ఆ వస్తువులను సానబెడతారు.అప్పుడు నల్లని పొర ఊడిపోయి తెల్లని డిజైన్ మెరుస్తూ కనిపిస్తుంది.తరువాత ఆ కళాఖండము నల్లగా మెరిసేందుకు బీదర్ ప్రాంతాలలో దొరికే ఒకవిదమైన మట్టిని వాడుతారు. అమ్మొనియం క్లోరైడ్, కాపర్ సల్ఫేట్, నైట్రేట్ సోడియం, క్లోరైడ్, పొటాషియం నైట్రేట్ ల మిశ్రమంతో ఈ మట్టిని కలిపి ఆ వస్తువులకు మొత్తంగా పూసి వాటిని వేడి చేస్తారు. ఆ మిశ్రమం వెండి, బంగారు తీగలను తప్ప మిగిలిన బాగాన్ని అంతటినీ నల్లగా మారుస్తుంది.

అధికంగా ఉత్పత్తి చేసే ప్రదేశాలు

[మార్చు]
  • బీహార్ రాష్ట్రంలోని పూర్నియా
  • పాట్నా
  • కర్ణాటక లోని బీదర్
  • ఉత్తరప్రదేశ్ లోని లక్నో వంటి ప్రదేశాలద్వారా ఉత్పత్తి జరుగుతున్నది.

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Innovative designs help revive Bidriware". The Hindu. 26 March 2008. Retrieved 6 March 2015.
  2. "Proving their mettle in metal craft". timesofindia. January 2, 2012. Archived from the original on 2013-05-08. Retrieved January 2, 2012.
  3. "Karnataka tableau to feature Bidriware". The Hindu. 11 January 2011. Retrieved 6 March 2015.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బిద్రీ_కళ&oldid=4352441" నుండి వెలికితీశారు