బీడు భూమి
ప్రపంచ జనాభాలో భారతదేశపు వాటా 16 శాతం కాని, ప్రపంచంలో ఉన్న భూమిలో 2 శాతం వాటా మాత్రమే భారతదేశంలో ఉంది. అందుకని, భారతదేశంలో, భూమి మీద ఒత్తిడి, చాలా, చాలా ఎక్కువ. అందుకే, వ్యవసాయ భూములు, తొందరగా నిస్సారమై, బీడు భూములుగా మారుతున్నాయి. ఈ బీడు భూముల సమస్య, బ్రిటిష్ వారికాలంనుంచి ఉంది. బ్రిటిష్ వారి కాలంలో, జమీందార్ల కాలంలో, వారి చూపు ఎంతసేపూ, వ్యవసాయం మీద పొందే ఆదాయం మీదనే ఉండేది కానీ, వ్యవసాయభూములను అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉండేది కాదు. పన్నులు కట్టలేని బీద రైతులు వ్యవసాయం వదిలేసి, కూలీలుగా మారిపోయే వారు. ఫలితంగా, వ్యవసాయ భూములు బీడు వారి పోయాయి. సర్ ఆర్ధర్ కాటన్ వంటి ఇంజనీర్లు, బ్రిటిష్ ప్రభుత్వ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు (మద్రాసు) రాష్ట్రాలలో నీటి పారుదల సౌకర్యాలను కల్పించినా అవి వేళ్ళమీద లెక్కపెట్టతగినవి. బ్రిటిష్ వారి ఆదాయం తగ్గిపోవటం వలన, ఆదాయంపెంచుకునే దిశలో ఏర్పాటుచేసినటువంటి నీటి పారుదల సౌకర్యాలు మాత్రమే గాని, భారతదేశంలో వ్యవసాయం చేసే రైతులకు మేలుచేసే ఉద్దేశం ఏమాత్రం లేదు.ఒక లెక్క ప్రకారం, భారతదేశంలో బీడు భూమి 68,35 మిలియన్ హెక్టార్ల భూమి (1992 నాటికి) (2011 నాటికి 228.3 మిలియన్హెక్టార్ల భూమి) . మరొక లెక్క ప్రకారం భారతదేశపు మొత్తం భూమి 328.2 హెక్టార్లు అయితే అందులో మెట్ట, బీడు భూముల వాటా 69 శాతం. ఈ మొత్తం మెట్ట, బీడు భూములలో 50% భూములను (అటవీ ప్రాంతం కాకుండా), సరియైన నీటిపారుదల సౌకర్యం కల్పిస్తే, ఇవి బంగారం పండే భూములుగా మారతాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా గత 50 సంవత్సరాలుగా ఈ బీడు భూములను నిర్లక్ష్యం చేసారు. వాటి అభివృద్ధికోసం భారత ప్రభుత్వం 1992 జూలైలో, 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ వేస్ట్‌లేండ్ డెవలప్‌మెంట్' అనే శాఖను, 'మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్' (గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ) లో ఏర్పాటుచేసింది. తదనంతరం డిపార్ట్‌మెంట్ ఆఫ్ వేస్ట్‌లేండ్ డెవలప్‌మెంట్' పేరును, 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేండ్ రిసోర్సెస్' గా మార్చి, ఆ శాఖ లక్ష్యాలను మరింత విశాలం చేసింది.
భారతదేశంలో భూమి వివరాలు
[మార్చు]భూమి | మిలియన్ హెక్టార్లు (మి.హె). |
---|---|
మొత్తం భారతదేశపు భూమి | 329 |
రికార్డులు ఉన్న భూమి | 304 |
సాగుకి పనికి వచ్చే భూమి | 264 |
పంటలు వేసిన భూమి | 142 |
అటవీ భూమి | 67 |
గ్రామాలలో నిస్సారమైన భూమి | 35 |
నిస్సారమైన భూమి (రైతుల భూమి) | 20 |
బీడు భూముల వివరాలు / విభజన (వర్గీకరణ)
[మార్చు]విభజన (వర్గీకరణ) | ప్రాంతం (స్క్వేర్ కిలోమీటర్లలో) |
---|---|
మంచు కప్పబడిన ప్రాంతం / మంచుఖండాలు (గ్లేసియర్స్) | 55788.49 |
వట్టి రాతి నేలలు / రాతి పొరలున్న నేలలు | 64584.77 |
ఇసుక పర్రలు / తీర ప్రాంతాలు | 50021.65 |
ఉప్పునీటి కయ్యలు / క్క్షారమృత్తికలు (ఆమ్లాలతో నిండిన నేలలు) | 20477.38 |
గల్లీడ్ / రేవినస్ భూములు (Gullied/or ravinous land) | 20553.35 |
మెట్టభూములు (పొదలతో / పొదలు లేకుండా) Upland with or without scrub | 194014.29 |
నీటి చెలమలు, చిత్తడి నేలలు Water logged & Marshy | 16568.45 |
నిట్టనిలువు పర్వత ప్రాంతాలుSteep sloping area | 7656.29 |
గిరిజనులు చేసే పోడు వ్యవసాయ భూమి Shifting cultivation land | 35142.20 |
గనులు తవ్వకం/ పరిశ్రమల చెత్త వలన ఏర్పడిన బీడుభూములు Mining/Industrial Wastelands | 1252.13 |
నిస్సారమైన భూములు Degraded/pastures/grazing land | 25978.91 |
సాగుచేయని భూములు / నిస్సారమైన అటవీ భూములు Under utilised/degraded notified forest land | 140652.31 |
మొక్కలు పెంచుతున్న నిస్సారమైన భూమి Degraded land under plantation crop | 5828.09 |
మొత్తం భూమి Grand Total: | 638518.31 |
నేషనల్ వేస్ట్‌లేండ్ డెవలప్‌మెంట్ బోర్డ్
[మార్చు]- అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ 1985 సంవత్సరంలో నేషనల్ వేస్ట్‌లేండ్ డెవలప్‌మెంట్ బోర్డ్ ని ఏర్పాటు చేసింది. ఈ బోర్డ్ ఏర్పాటు చేయటంలోని ముఖ్య ఉద్దేశం నిస్సారవంతమౌతున్న భూములను కాపాడటం, వాతావరణ సమతుల్యాన్ని కాపాడటం, పశువుల మేత, వంటచెరకుకు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ ను తీర్చటం. 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో, లక్ష్యాన్ని చేరటానికి, నేషనల్ వేస్ట్‌లేండ్ బోర్డ్, మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. 1992 లో, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ) అజమాయిషీలో నేష నల్ వేస్ట్‌లేండ్ డెవలప్‌మెంట్ బోర్డ్ ని ఉంచారు. 1992 ఆగస్టులో ఈ బోర్డ్ కి అటవీ ప్రాంతం కాని బీడు భూములను, ప్రతీ దశలోను, స్థానిక ప్రజల సహకారంతో, అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ఈ బోర్డ్‌ని పునర్మించారు. దీనినే సమగ్ర బీడు భూముల అభివృద్ధి కార్యక్రమంగా (ఇంటిగ్రేటెడ్ వేస్ట్‌లేండ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) రూపొందించారు. సౌకర్యాలను కల్పించటమే ప్రభుత్వ పాత్ర. నిజమైన పాలకులు, పరిపాలకులు అక్కడి స్థానిక ప్రజలు. వారి బాధ్యత బీడు భూములను, నిస్సారవంతమైన భూములను వ్యవసాయానికి పనికి వచ్చే విధంగా సారవంతం చేయటం,. ఈ సమయంలో అక్కడి ప్రజల బీదరికం, వెనుకబాటుతనం, స్త్రీపురుష సమానత్వం కూడా లెక్కలోకి తీసుకోవటం.
సమగ్ర బీడు భూముల అభివృద్ధి కార్యక్రమం (ఇంటిగ్రేటెడ్ వేస్ట్‌లేండ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) (IWDP)
[మార్చు]సమస్యలు.
[మార్చు]- భారతదేశంలోని వాతావరణ సమతుల్యత పాడు కావటానికి ఈ క్రింది కారణాలు కొన్ని:-
- భూమి మీద ఒత్తిడి పెరిగిపోవటం, సరియైన పెట్టుబడులు పెట్టకపోవటం, సరియైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, జననాల రేటు ఎక్కువగా ఉండటం, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అతి పేదరికం. దేశంలో దొరికే ప్రకృతి సంపదను విచ్చలవిడిగా, అదుపులేకుండా వాడటం, ఉమ్మడి సంపదను అనుభవించే సాంప్రదాయక పద్ధతులు అంతరించటం, కొత్త పద్ధతులు ఆ ఖాళీని నింపకపోవటం. భూమిని దిర్వినియోగం చేయటం.
దుష్పలితాలు'
[మార్చు]- భూమి కోత, భూమి నిస్సారమై పోవటం, సహజ వనరులు తగ్గిపోవటం., ఉత్పత్తి తగ్గిపోవటం, భూగర్బంలో ఉన్న నీరు తగ్గిపోవటం, తాగునీరు కొరత. జీవజాతులు అంతరించిపోవటం. బీడు భూములు విస్తీర్ణం పెరగటం.
- వాస్తవానికి భూములు బీడుభూములు గా, మధ్య రకం బీడుభూములుగా మారిపోతుండడానికి శాస్తజ్ఞ్రులు చెబుతున్న కారణాలు. సరైన నీటి పథకాలు లేని కారణంగా కొంత ప్రాంతం పనికిరానిదిగా తయారవుతుంది,
తీర ప్రాంతాల్లో ఉప్పునీటి కయ్యలు ఏర్పడటం అటువంటి ఉప్పునీటి కయ్యలు సాగుకు పనికిరాని విధంగా మారడం, తరచూ సంభవిస్తున్న కరవు కాటకాల కారణంగా మరికొంత భూమి బీడు భూమిగా మారుతున్నది., గనులు తవ్వకాలు, పరిశ్రమల నుంచి బయట పడుతున్న కాలుష్యం భూముల పాలిట శాపంగా మారి, బీడు భూములుగా మారుతున్నాయి. వ్యర్ధ పదార్ధాల కారణంగా మరి కొంత భూమి బీడుగా మారుతోంది. ఇంత భూమి, బీడు భూమిగా మారటంవలన దేశంలో ఉన్న 485 మిలియన్ల పశు సంపదకు పశుగ్రాసం దొరకటంలేదు .
- కేంద్ర పర్యావరణ శాఖ తన నాలుగో వార్షిక నివేదికలో చెప్పిన విషయాలను గమనింఛండి. రాజస్థాన్‌లోనే మూడోవంతు భూభాగం బీడుగా కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలోని 12 జిల్లాలు బీళ్లుగా మారుతున్నట్టు గుర్తించారు. ఇక్కడ థార్ ఎడారి కారణంగా బీడు భూములు తయారవుతున్నాయంటే నమ్మవచ్చును. కానీ మంచు ఎక్కువగా కురిసే జమ్మూ కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహుల్ పిత్లి ప్రాంతంలోనూ 15.2 మిలియన్ హెక్టార్ల భూమి మధ్య రకం బీడుగా మారిపోయింది. గుజరాత్, దక్షిణ పంజాబ్, హర్యానాల్లో ఎక్కువ భూమి పనికిరానిదిగా మారింది. మహారాష్ట్ర, కర్నాటక, రాష్ట్రాలలోనూ, 60 వేల కోట్ల రూపాయలకు పైగా జలయజ్ఞం కోసం ఖర్చు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కొంత భూమి, బీడు భూమిగా మారింది.
- కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఐక్య రాజ్య సమితికి అందించిన నివేదికలో పొందుపరచిన కొన్ని విషయాలు గమనించండి. భారతదేశంలో భూములు బీడు వారడానికి అనేక కారణాలను గుర్తిస్తున్నారు. మిగతా దేశాలకు ఈ కారణాలే బీడు భూములు కావటానికి కారణాలు అవుతాయి. దాదాపు 71 శాతం భూమిలో సారం లేకపోవడమే సమస్య. నీటి సమస్య కారణంగా బీడు వారుతున్న భూమి 26.21 మిలియన్ హెక్టార్లు. గాలి కారణంగా పశ్చిమ ప్రాంతంలో (ముఖ్యంగా థార్ ఎడారి ప్రాంతం - విస్తరిస్తున్న థార్ ఎడారి) బీడు వారుతున్న భూమి కూడా 17.7 మిలియన్ హెక్టార్లు. అన్నింటికన్నా ఎక్కువగా 2.29 కోట్ల హెక్టార్ల భూమి అనేక రకాల కారణాలతో బీడుగా, మెట్టగా మారిపోతుంది.
- ఆంధ్ర రాష్ట్రంలో 49.64 లక్షల హెక్టార్ల భూమి పరిస్థితి అసలు బాగా లేదు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 62 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి బీడు భూములను సాగుభూమిగా మార్చేందుకు పెద్దఎత్తున జలయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. అయితే నీటి సమస్య, గాలి సమస్య, రాతి భూములతో పెద్ద మొత్తంలోనే భూమి బీడుగా, ఎందుకూ పనికిరాని విధంగా ఉంది. నీటి కోత, నీరు లేకపోవడం వంటి సమస్యలతో 20 లక్షల హెక్టార్ల భూమి బీడుగా కనిపిస్తుంది. పచ్చదనం కోల్పోయిన కారణంగా 25 లక్షల హెక్టార్లు బీడుగా మారింది. ఉప్పునీటితో చౌడుదేరిపోయి 1.3 లక్షల హెక్టార్ల భూమి వినియోగానికి దూరంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి కొలతలు
[మార్చు]- ఒక హెక్టారుకి 2 ఎకరాల 47 సెంట్లు
- ఒక హెక్టారుకి 10000 చదరపు మీటర్లు.
- ఒక ఎకరానికి 0.405 హెక్టార్లు.
- ఒక ఎకరానికి 4046.8564224 చదరపు మీటర్లు (4046.82 చ.మీ కొందరు)
- ఒక ఎకరానిక్ 43,560 చదరపు అడుగులు
- ఒక ఎకరానికి 100 సెంట్లు = 4840 చదరపు గజాలు (4800 చ.గ. కొందరు)
- ఒక సెంటుకి 435.6 చదరపు అడుగులు.
- ఒక సెంటుకి 40.5 చదరపు మీటర్లు
- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఒక ఎకరానికి, 100 సెంట్లు. సెంటుకి 48.4 గజములు (48 గజములు). అంటే 4840 (4800) గజములు ఒక ఎకరం. ఇక్కడ స్థలాన్ని గజం, కుంచం, అడ్డెడు, సెంటు, ఎకరంగా కొలుస్తారు. కుంచం అంటే 10 సెంట్లు (484 (480) గజములు. సెంటుకి 48.4 (48) గజములు). మెట్రిక్ కొలమానం 1956 లో మనదేశంలో ప్రవేశ పెట్టారు. అంతకు ముందు కొలతలు కుంచం (కుంచెడు), అడ్డ (అడ్డెడు), పదాలు వాడుకలో ఉండేవి. బహుశా, కుంచెడు విత్తనాలు జల్లటానికి (విత్తటానికి) సరిపోయే నేలను కుంచెడు (10 సెంట్లు) గా లెక్కపెట్టేవారు అనుకుంటాను, కుంచం (10 సెంట్లు) ఇప్పటికీ వాడుకలో ఉంది. అడ్డెడు (5 సెంట్లు) పదం వాడుకలో నుంచి తొలగిపోయి అర కుంచం (అడ్డెడు పదం బదులుగా) లేదంటే 5 సెంట్లు వాడుకలోకి వచ్చింది.
.
- గూడూరు, తిరుపతి, నెల్లూరు ప్రాంతంలో భూమిని అంకణాలు గా కొలుస్తారు. తమిళనాడు లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈ అంకణాల వాడుక ఉంది.
- ఒక ఎకరానికి 100 సెంట్లు / 0.405 హెక్టార్స్ / 605 అంకణములు.
- ఒక సెంటుకి 6.05 అంకణములు / 48 చదరపు గజములు.
- ఒక అంకణము = 8 చదరపు గజములు / 72 చదరపు అడుగులు (6.7 m2) నెల్లూరు జిల్లాలోని కొలతలు. (తిరుపతిలో అంకణం అంటే 36 చదరపు అడుగులు మాత్రమే (3.3 m2) ).
- ఒక చదరపు అడుగు = 9 చదరపు గజములు.
- ఒంగోలు ప్రాంతంలో నిర్మాణ సంబంధిత భూమిని గది అంటారు. 72 చదరపు అడుగుల భూమిని ఒక గది అంటారు. వ్యవసాయ సంబంధిత భూమిని ఎకరాలుగా కొలుస్తారు.
ఆధారాలు
[మార్చు]- డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేండ్ రిసోర్సెస్
- అంకణం
- ఆంధ్రభూమి దినపత్రిక 2011 జూలై 10
- ఫ్లై ఏష్ యూనిట్ - మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ