భారతి (పరిశోధన కేంద్రం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతి పరిశోధనా కేంద్రం
—  అంటార్కిటిక్ పరిశోధన కేంద్రం  —
అంటార్కిటికాలో భారతి కేంద్రం స్థానం
అంటార్కిటికాలో భారతి కేంద్రం స్థానం
భారతి పరిశోధనా కేంద్రం
అంటార్కిటికాలో భారతి కేంద్రం స్థానం
దేశం  India
అంటార్కిటికాలో స్థానం లార్స్‌మాన్ హిల్స్
ప్రిడ్జ్ బే
నిర్వాహకులు జాతీయ ధ్రువ, మహాసముద్ర పరిశోధన కేంద్రం
స్థాపన 2012 మార్చి 18 (2012-03-18)
జనాభా
 - మొత్తం
  • 47
  • వేసవిలో: 72 వరకు
రకం ఏడాది పొడుగునా
కాలావధి వార్షిక
స్థితి పనిచేస్త్జోంది
వెబ్‌సైటు National Centre for Antarctic and Ocean Research
Bharati Heliport
సంగ్రహం
విమానాశ్రయ రకంPrivate
యజమాని/కార్యనిర్వాహకుడుNational Centre for Polar and Ocean Research
ప్రదేశంBharati Station
Larsemann Hills
అక్షాంశరేఖాంశాలు69°24′24″S 76°11′36″E / 69.406744°S 76.193330°E / -69.406744; 76.193330
పటం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
Concrete

భారతి, భారతదేశం నెలకొల్పిన శాశ్వత అంటార్కిటిక్ పరిశోధనా కేంద్రం. ఇది భారతదేశపు మూడవ అంటార్కిటిక్ పరిశోధనా కేంద్రం. ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న రెండు పరిశోధనా కేంద్రాలలో ఇది ఒకటి కాగా రెండోది మైత్రి. దేశపు మొట్టమొదటి పరిశోధనా కేంద్రం, దక్షిణ గంగోత్రిని ప్రస్తుతం సరఫరా స్థావరంగా ఉపయోగిస్తున్నారు. ఈ నిర్మాణం కోసం భారతదేశం లార్సెమాన్ హిల్స్ పక్కన 69°S, 76°E వద్ద ఒక ప్రాంతాన్ని గుర్తించింది. ఈ పరిశోధనా కేంద్రాన్ని ఇంకా అధికారికంగా ప్రారంభించనప్పటికీ, 2012 మార్చి 18 నుండి ప్రయోగాత్మకంగా పనిచేస్తోంది. [2] [3] ఇది పూర్తయిన తరువాత, అంటార్కిటిక్ సర్కిల్‌లో బహుళ స్టేషన్‌లను కలిగి ఉన్న తొమ్మిది దేశాలలో భారతదేశం ఒకటిగా మారింది. సముద్ర శాస్త్ర అధ్యయనాలు, ఖండాంతర విచ్ఛిన్నం దృగ్విషయంపై దృష్టి పెట్టడం భారతి పరిశోధన స్థావర ఉద్దేశాలు. ఇది భారత ఉపఖండపు భౌగోళిక చరిత్రపై ప్రస్తుత అవగాహనను మెరుగుపరచే పరిశోధలను సులభతరం చేస్తుంది.

సౌకర్యాలు[మార్చు]

నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) స్టేషను నిర్మాణ ప్రాజెక్టును ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) కు రూ. 230 కోట్లకు కాంట్రాక్టుకు ఇచ్చింది. [4] 2,162 చ.మీ. విస్తీర్ణమున్న స్టేషన్ భవనాన్ని 127 రోజుల్లో నిర్మించారు. [5] స్టేషనులో మొత్తం 72 మంది సిబ్బంది ఉండవచ్చు. వీరిలో 47 మంది ప్రధాన భవనంలో ఏడాది పొడవునా ఉండే వీలుండగా, మరో 25 మంది వేసవిలో షెల్టర్లలో ఉండవచ్చు. ప్రధాన స్టేషన్ భవనానికి సరిపడేలా ఒక ఇంధన క్షేత్రం, సముద్రపు నీటి పంపు, వేసవి శిబిరం ఉన్నాయి. [6]

ప్రాజెక్టు పని చేయడం మొదలైన తర్వాత, హై-స్పీడ్ శాటిలైట్ ముడి డేటాను ప్రాసెస్ చేయడం కోసం ఎప్పటి కప్పుడు భారతి స్టేషన్ నుండి హైదరాబాద్‌లోని NRSC కి పంపిస్తారు.

2007 లో ECIL, అంటార్కిటికాలోని రెండవ భారతీయ పరిశోధనా కేంద్రం మైత్రికి, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCPOR) కూ మధ్య కమ్యూనికేషన్ లింకును కూడా ఏర్పాటు చేసింది. భారతి స్టేషన్‌లో శాస్త్రవేత్తలు టెక్టోనిక్స్, జియోలాజికల్ స్ట్రక్చర్‌లపై పరిశోధనలు చేపడతారు. [7] స్టేషను నిర్మాణంలో షిప్పింగ్ కంటైనర్‌లను ఉపయోగించిన మొదటి దేశం భారతదేశం. అందువల్ల రికార్డు సమయంలో అతి తక్కువ ఖర్చుతో ఈ స్థావర నిర్మాణం సాధ్యమైంది. [8]

ఆవిష్కరణలు, విజయాలు[మార్చు]

2017 జనవరిలో అంటార్కిటిక్‌కు 36వ భారతీయ యాత్రలో ఉన్న శాస్త్రవేత్తలలో ఒకరైన ఫెలిక్స్ బాస్ట్, భారతి పరిశోధనా కేంద్రానికి సమీపంలోని లార్సెమన్ హిల్స్‌లో కొత్త నాచు జాతిని కనుగొన్నాడు. దానికి బ్రయుమ్ భారతియెన్సిస్ అని పేరు పెట్టాడు. [9]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Antarctic Facilities". COMNAP. Archived from the original on 1 January 2011. Retrieved 13 August 2018.
  2. Abhai Mishra & Bhagwati Prasad. "Inauguration of India's new Antarctic Station 'Bharati'". Stamps of India. Archived from the original on 15 September 2012. Retrieved 11 September 2016.
  3. Paul Fernandes (26 June 2012). "India's station in Antarctic operational". The Times of India. Delhi, India. Archived from the original on 25 July 2013. Retrieved 11 September 2016.
  4. "Bharti to be 3rd Indian station in Antarctica | Chennai News - Times of India". The Times of India.
  5. "NCPOR Significant Achievements". National Centre for Polar and Ocean Research. National Centre for Polar and Ocean Research. Retrieved 2022-05-26.
  6. "Bharati Research Station". National Centre for Polar and Ocean Research. National Centre for Polar and Ocean Research. Retrieved 2022-05-26.
  7. Mallikarjun, Y. (2 May 2012). "State of the art Bharati station to come up soon". The Hindu. Chennai, India. Retrieved 6 May 2012.
  8. Gendall, John (2020-01-06). "The Coolest Architecture on Earth Is in Antarctica". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2020-09-14.
  9. "India discovers new plant species in Antarctica". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2021-07-08. Retrieved 2021-07-08.