భూ మధ్యస్థ కక్ష్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మూస:Comparison satellite navigation orbits

To-scale diagram of low, medium and high earth orbits

భూమి చుట్టూ ఉన్న రోదసిలో భూ లఘు కక్ష్య (2000కి.మీ ఎత్తు)కీ భూ స్థిర కక్ష్య(35,786 కి.మీ ఎత్తు)కి మధ్య గల ప్రాంతాన్ని భూ మధ్యస్థ కక్ష్య (ఇంగ్లీషు: Medium Earth orbit)గా వ్యవహరిస్తారు.[1] దిశానిర్దేశనం, సమాచార వ్యవస్థ, రోదసీ పర్యావరణ శాస్త్రాలకి ఈ ప్రాంతం ఎక్కువగా ఉపయోగపడుతోంది.[1] ఈ కక్ష్యలోని సర్వసాధారణ ఎత్తు 20200 కి.మీ (12 గంటల భ్రమణ కాలం). గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ (Global Positioning System) ఈ కక్ష్యలోనే ఉన్నది. ఈ ప్రాంతంలో గ్లోనాస్ (GLONASS -19,100 కి.మీ ఎత్తు) మరియు గెలీలియో ( Galileo 23,222 కి.మీ ) ఉపగ్రహ కూటమి వంటివి కూడా ఉన్నాయి. ఉత్తర, దక్షిణ ధృవాలకి అందుబాటులో ఉండవలసిన ఉపగ్రహాలు కూడా భూ.మ.క లోకే ప్రక్షేపించబడతాయి.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

భూ లఘు కక్ష్య

రిఫరెన్సులు[మార్చు]

  1. 1.0 1.1 "Definitions of geocentric orbits from the Goddard Space Flight Center". User support guide: platforms. NASA Goddard Space Flight Center. సంగ్రహించిన తేదీ 2012-07-08. 
  2. Satellite Basics: Solution Benefits