మనోజ్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనోజ్ కుమార్
2012లో మనోజ్ కుమార్
జననం
హరికృష్ణ గోస్వామి

(1937-07-24) 1937 జూలై 24 (వయసు 86)
అబోటాబాద్, వాయవ్య సరిహద్దు ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుత ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుభరత్ కుమార్
వృత్తి
  • నటుడు
  • చిత్ర దర్శకుడు
  • చిత్ర నిర్మాత
  • స్క్రీన్ రైటర్
  • గీత రచయిత
  • ఎడిటర్
  • రాజకీయవేత్త
క్రియాశీల సంవత్సరాలు1957–1999
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిశశి గోస్వామి
పిల్లలు2; కునాల్ గోస్వామి, విశాల్ గోస్వామి
బంధువులుమనీష్ ఆర్ గోస్వామి (సోదరుడు)
సన్మానాలు
  • పద్మశ్రీ (1992)
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (2015)

హరిక్రిష్ణ గోస్వామి (జననం 1937 జులై 24) తన స్క్రీన్ నేమ్ మనోజ్ కుమార్ తో సుపరిచితుడు. హిందీ సినిమా నటుడు, చిత్రనిర్మాత, స్క్రీన్ రైటర్, గీత రచయిత. దేశభక్తి ఇతివృత్తాలతో సినిమాలు తీయడంలో, నటించడంలో ఆయనకు పేరుంది. దీంతో ఆయనకు భరత్ కుమార్ అనే మారుపేరు పెట్టారు. అతను వివిధ విభాగాలలో ఒక జాతీయ చలనచిత్ర పురస్కారం, ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నాడు.

ఆయన 60, 70 దశకాల్లో క్రాంతి, వో కౌన్ థి, పురబ్ ఔర్ పశ్చిమ్, రోటీ కపుడా ఔర్ మక్కాన్ లాంటి చిత్రాలతో ప్రఖ్యాతి చెందాడు. 2015 సంవత్సారినకి గాను ఆయన అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నాడు. 1992లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.