మునిమాణిక్యం నరసింహారావు

వికీపీడియా నుండి

మునిమాణిక్యం నరసింహారావు ఇరవైయ్యవ శతాబ్దం మొదటి పాదంలో ఒక కథకుడిగా రూపుదిద్దుకున్నారు. కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు, దాంపత్య జీవితంలోని సౌందర్యం ఈయన కథలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఈయన సృష్టించిన కాంతం తెలుగు సాహిత్యంలోనే పెద్ద పీట వేసుకుని కూర్చుంది.

జీవిత కాలం: 1898 - 1972. జన్మస్థలం: తెనాలి తాలూకా, సంగం జాగర్లమూడి. తల్లిదండ్రులు: వెంకాయమ్మ, సూర్యనారాయణ.

రచనలు [మార్చు]

  • అప్పులు చేయడం - తీర్చడం - అప్పు చేసిన మొత్తమును తిరిగి ఇచ్చేవాడు అధముడు. కాలం గడిపేవాడు మధ్యముడు. తెచ్చిన మరుక్షణములో ఆవిషయం సులువుగా మరవగలిగినవాడు ఉత్తముడు.
  • గృహప్రవేశం
  • మాణిక్య వచనావళి
  • స్తుతి - ఆత్మ స్తుతి



మూలాలు [మార్చు]

  • అక్కిరాజు రమాపతిరావు రాసిన ప్రతిభామూర్తులు, విజ్ఞాన దీపిక ప్రచురణ, 1991

బయటి లింకులు [మార్చు]