రాగులు

వికీపీడియా నుండి
రాగులు
మిశ్రమవర్ణాలలో ఉండే రాగులు.
మిశ్రమవర్ణాలలో ఉండే రాగులు.
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: లిలియాప్సిడా
వర్గము: పోయేల్స్
కుటుంబము: పోయేసి
ఉపకుటుంబము: క్లోరియాయిడియే
ప్రజాతి: ఎల్యుసీన్
జాతి: ఇ. కొరకానా
ద్వినామము
ఎల్యుసీన్ కొరకానా
L.

రాగి (Finger Millet) (ఎల్యూసీన్ కొరకానా, అమ్హరిక్ లో తోకూసో) ని ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని వ్యవహరిస్తారు. రాగి వార్షిక ధాన్యపు పంట. దీనిని ముఖ్యంగా ఆఫ్రికా మరియు ఆసియాలోని మెట్టప్రాంతాలలో పండిస్తారు. రాగి స్వస్థలము ఇథియోపియాలోని ఎత్తుప్రదేశాలు అయితే నాలుగువేల సంవత్సరాలకు పూర్వము భారతదేశములో ప్రవేశపెట్టబడినది[1]. ఇది ఎత్తు ప్రాంతాల యొక్క వాతావరణానికి సులువుగా అలవడే పంట. హిమాలయాల పర్వతసానువుల్లో 2300 మీటర్ల ఎత్తువరకు రాగిని పండిస్తారు.

విషయ సూచిక

[మార్చు] సాగుచేసే విధానం

రాగులను సాధారణంగా వేరుశెనగ, కంది మరియు మినుము వంటి పప్పుదినుసులతో పాటు అంతర పంటగా సాగుచేస్తారు. రాగి సాగు యొక్క గణాంకాలు ఇతర చిరుధాన్యాలతో ముఖ్యంగా జొన్నలతో కలిపివేసి గందరగోళం ఏర్పడినా ప్రపంచవ్యాప్తముగా రాగిని దాదాపు 38 లక్షల హెక్టార్లలో సాగుచేస్తున్నారని అంచనా.

[మార్చు] నిలువ

కోతకోసిన తర్వాత ఈ ధాన్యము చాలా బాగా నిలువవుంటాయి. కీటకాలు, చీడపీడల సమస్య చాలా తక్కువ. ఎక్కువ కాలము నిలువవుండగల ఈ సామర్ధ్యమే రాగిని నిరుపేద వ్యవసాయ సముదాయాలకు రిస్కు నివారించే ప్రణాళికలో భాగం చేస్తుంది.

[మార్చు] పోషక విలువలు

ప్రపంచములో పెండలం, కూర అరటి, మిల్లు బియ్యం లేదా జొన్న ప్రధాన ఆహారముగా ఉపయోగించే కోట్లాది పేదప్రజల ఆహారములలో లోపించిన మిథియోనైన్ అమీనో ఆమ్లం రాగిలో పుష్కలంగా ఉండటం దీనికి ప్రాధాన్యాన్నిస్తుంది. రాగులను దంచి కేకులు, పుడ్డింగులు, పారిట్జులు వండవచ్చు.

[మార్చు] మూలాలు

  1. A.C. D'Andrea, D.E. Lyons, Mitiku Haile, E.A. Butler, "Ethnoarchaeological Approaches to the Study of Prehistoric Agriculture in the Ethiopian Highlands" in Van der Veen, ed., The Exploitation of Plant Resources in Ancient Africa. Kluwer Academic: Plenum Publishers, New York, 1999.


[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=రాగులు&oldid=694275" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు