రాజమండ్రి లోకసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం రూపురేఖలు బాగా మారిపోయాయి. పునర్వ్యవస్థీకరణకు పూర్వమున్న బూరుగుపూడి, కడియం, రామచంద్రాపురం ఆలమూరు సెగ్మెంట్లు తొలిగిపోయి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అదనంగా రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు వచ్చిచేరాయి. దీనితో జిల్లాకు చెందిన 4 సెగ్మెంట్లు మరియు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 3 సెగ్మెంట్లతో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ నియోజకవర్గంలో భాగమయ్యాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]

  • 2001 లెక్కల ప్రకారం జనాభా: 17,87,158 [1]
  • ఓటర్ల సంఖ్య: 11,77, 031.
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 20.11% మరియు 0.77%.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మొదటి 1952-57 కానేటి మోహనరావు
నల్లా రెడ్డి నాయుడు
భారతీయ కమ్యూనిస్టు పార్టీ
రెండవ 1957-62 డి.ఎస్.రాజు భారత జాతీయ కాంగ్రెసు
మూడవ 1962-67 డి.ఎస్.రాజు భారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ 1967-71 డి.ఎస్.రాజు భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 ఎస్.బి.పి.పట్టాభి రామారావు భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 ఎస్.బి.పి.పట్టాభి రామారావు భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 ఎస్.బి.పి.పట్టాభి రామారావు భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ 1984-89 చుండ్రు శ్రీహరిరావు తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 జూలూరి జమున భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 కె.వి.ఆర్. చౌదరి తెలుగుదేశం పార్టీ
పదకొండవ 1996-98 చిట్టూరి రవీంద్ర భారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ 1998-99 గిరజాల వెంకటస్వామి నాయుడు భారతీయ జనతా పార్టీ
పదమూడవ 1999-04 ఎస్.బి.పి.బి.కె.సత్యనారాయణరావు భారతీయ జనతా పార్టీ
పద్నాలుగవ 2004-ప్రస్తుతం ఉండవల్లి అరుణ కుమార్ భారత జాతీయ కాంగ్రెసు

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున మురళీమోహన్ పోటిచేస్తున్నాడు. [2] కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోటీలో ఉన్నాడు. [3]

మూలాలు[మార్చు]

  1. సాక్షి దినపత్రిక
  2. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009