రామణ్ లాంబా

వికీపీడియా నుండి

1960 జనవరి 2ఉత్తర ప్రదేశ్ లో జన్మించిన రామణ్ లాంబా (Raman Lamba) భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. బంగ్లాదేశ్ లోని ఢాకా లో బంగబంధు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ బంతి బలంగా తగలడంతో గాయపడి 1998 ఫిబ్రవరి 23 న మరణించాడు. అప్పటికి అతని వయస్సు 38 సంవత్సరాలు మాత్రమే.

లాంబా భారత్ తరఫున 4 టెస్టులు ఆడి 102 పరుగులు చేసినాడు. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 53 పరుగులు. 32 వన్డే మ్యాచ్‌లు ఆడి 27 పరుగుల సగటుతో 783 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకము 6 అర్థ శతకాలు కలవు.