రి-భోయ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Ri Bhoi District జిల్లా
RiBhoi
Meghalaya జిల్లాలు
Meghalaya రాష్ట్రంలో Ri Bhoi District యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Meghalaya
ముఖ్యపట్టణం Nongpoh
ప్రభుత్వం
 • శాసనసభ నియోజకవర్గాలు 7
Area
 • మొత్తం 2,378
జనాభా (2001)
 • మొత్తం 192
 • జనసాంద్రత [[
జనగణాంకాలు
 • అక్షరాస్యత 51%
ప్రధాన రహదారులు NH-40
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

మేఘాలయ రాష్ట్ర జిల్లాలలో రి-భోయి జిల్లా ఒకటి. జిల్లావైశాల్యం 2,378 జిల్లా ప్రధానకార్యాలయాలు నాంగ్పో వద్ద ఉన్నాయి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 192,795 2011 గణాంకాలను అనుసరించి మేఘాలయ రాష్ట్ర జిల్లాలలో సౌత్ గారో హిల్స్ జిల్లా తరువాత అత్యల్ప జనసాంధ్రత కలిగిన జిల్లాగా గురించబడింది. [1]

చరిత్ర[మార్చు]

ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లా లో ఉపవిభాగంగా ఉన్న రి-భోయి 1992 జూన్ 4 నుండి పూర్తిస్థాయి జిల్లాగా మార్చబడింది.

భౌగోళికం[మార్చు]

రి-భోయి జిల్లా 90°55’15 నుండి 91°16’ అక్షాంశ మరియు రేఖాంశాల మద్య ఉపస్థితమై ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో కామరూప్ జిల్లా , తూర్పు సరిహద్దులో జెంతీ హిల్స్ జిల్లా మరియు అస్సాం రాష్ట్రానికి చెందిన కర్బి ఆంగ్లాంగ్ మరియు పడమర సరిహద్దులో వెస్ట్ కాశీ హిల్స్ జిల్లా ఉన్నాయి. పథర్‌ఖ్మా వద్ద సి మరియు డీ బ్లాకులు ఒక అడ్మింస్టేట్ యూనిట్ ఉన్నాయి. జిల్లాలోని గ్రామాల సంఖ్య 561. రి-భోయి జిల్లా వైశాల్యం 2,448 చ.కి.మీ. రాష్ట్ర రాజధానికి షిల్లాంగ్ కు 53 కి.మీల దూరంలో ఉంది. జిల్లా భౌగోళికంగా కఠిననశిలామయమై క్రమపద్దతిలో లేని ఎగుడు దిగుడు మైదానాలతో నిండి ఉంటుంది. ఉత్తరదిశగా ఏటవాలుగా సాగుతున్న భూభాగం క్రమంగా బ్రహ్మపుత్ర నదీ లోయలతో కలిసి పోతుంది. జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో ముఖ్యమైనవి ఉంత్రూ, ఉంసియాంగ్, ఉంరన్ మరియు ఉమియం ముఖ్యమైనవి. జిల్లా ప్రధానకార్యాలం " నాంగ్పో " లో ఉంది.

ఆర్ధికం[మార్చు]

2006 లో పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రి-భోయి జిల్లా ఒకటి అని గుర్తిచింది. [2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న 3 మేఘాలయ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

విభాగాలు[మార్చు]

నిర్వహణా విభాగాలు[మార్చు]

రి-భోయి జిల్లా 3 బ్లాకులుగా విభజించబడింది.[3]

పేరు ప్రధానకార్యాలయం జనసంఖ్య ప్రాంతం
జిరంగ్ వసినూన్
Ri-Bhoi Subdivisions Jirang.png
ఉమ్లింగ్ నాంగ్పొ
Ri-Bhoi Subdivisions Umling.png
ఉంస్నింగ్ ఉంస్నింగ్
Ri-Bhoi Subdivisions Umsning.png

ప్రయాణవసతులు[మార్చు]

రి-భోయ్ జిల్లా రవాణా మరియు సమాచార వసతులు తక్కువగా ఉన్నాయి. జోరాబాదు నుండి షిల్లాంగ్ వరకు సాగే జాతీయరహదారి 37 ఈ జిల్లాగుండా సాగిపోతూ ఉంది.

గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 258,380,[1]
ఇది దాదాపు... [4]
అమెరికాలోని జనసంఖ్యకు
640 భారతదేశ జిల్లాలలో 580 వస్థానంలో ఉంది [1]
1చ.కి.మీ జనసాంద్రత 109 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 34.02%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 951 : 1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాశ్యత శాతం 77.22%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

భాషలు[మార్చు]

రి-భోయి జిల్లాలో అత్యధికులకు తెలిసిన భాష భోయీ భాష. జిల్లాలో కర్యూ భాష ప్రధానమైనదిగా భావించబడుతుంది. అంతే కాక జిల్లాలో అమ్రి, టిబెటో-బర్మన్ భాషలను 1,25,000 మంది ప్రజలు మాట్లాడుతున్నారు. [5]

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

1981 లో రి-భోయి జిల్లా " నాంగ్‌ఖిల్లెం " వన్యమృగ అభయారణ్యానికి " పుట్టినిల్లైంది. జిల్లా వైశాల్యం 29చ.కి.మీ.[6]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme". National Institute of Rural Development. Retrieved September 27, 2011. 
  3. The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India (2011) (in English) (PDF). Meghalaya Administrative Divisions (Map). http://censusindia.gov.in/2011census/maps/administrative_maps/MEGHALAYA.pdf. Retrieved 2011-09-29.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. "Vanuatu 224,564 July 2011 est." 
  5. M. Paul Lewis, ed. (2009). "Amri Karbi: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. 
  6. Indian Ministry of Forests and Environment. "Protected areas: Meghalaya". Retrieved September 25, 2011. 

వెలుపలి లింకులు[మార్చు]


"http://te.wikipedia.org/w/index.php?title=రి-భోయ్&oldid=1206110" నుండి వెలికితీశారు