లక్ష్మీ సెహగల్
కెప్టెన్ లక్ష్మీ సెహగల్ (జ: అక్టోబర్ 24, 1914) ప్రముఖ సంఘసేవకురాలు మరియు రాజ్యసభ సభ్యురాలు. ఈమె భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన తొలి మహిళ.
ఈమె తండ్రి స్వామినాథన్ మద్రాసులో ప్రముఖ న్యాయవాది. తల్లి ఎ.వి.అమ్ము కుట్టి సామాజిక సేవా కార్యకర్త. చిన్నతనంలోనే సెహగల్ విదేశీ వస్తు బహిష్కరణ, మధ్యనిషేధం వంటి జాతీయ పోరాటాలలో పాల్గొన్నారు. మద్రాసు వైద్య కళాశాలలో ఎం.బి.,బి.ఎస్. పూర్తయిన తరువాత సింగపూర్ వెళ్ళి, అక్కడ వైద్యశాల స్థాపించి, స్థానికంగా ఉన్న భారతీయ కార్మికులకు సేవలందించారు. అక్కడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలకు ప్రభావితురాలై స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆధ్వర్యంలోని ఝాన్సీ రెజిమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు.
లక్ష్మీ సెహగల్ 1947లో లాహోర్ కు చెందిన కర్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్ ను వివాహం చేసుకొని కాన్పూరులో స్థిరపడ్డారు.
స్వాతంత్రానంతరం ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఉమెన్స్ అసోషియేషన్ (ఐద్వా) ఉపాధ్యక్షురాలిగా వివిధ స్థాయిలలో సమాజ సేవకు అంకితమయ్యారు.
1998లో ఈమెకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రదానం చేయబడినది.