Jump to content

వంట నూనె

వికీపీడియా నుండి
(వంటనూనెలలో ఆరోగ్యానికి ఏది మంచిది? నుండి దారిమార్పు చెందింది)
ఆలివ్ నూనె

వంట నూనెలు, కొవ్వులు వృక్ష, జంతు సంబంధిత ఉత్పత్తులు. ఇవి నీటిలో కరగవు. ఇవి సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉంటాయి. నూనెలను/కొవ్వులను కొవ్వు ఆమ్లముల గ్లిసెరొల్ ఇస్టరులు (Glycerol esters of fatty acids) అంటారు. లేదా 'triglycerides'లేదా 'Triacylglycerols' అంటారు.

నూనెలు, క్రొవ్వులు

[మార్చు]
ఇటాలియన్ ఆలివ్ నూనె
సూర్యకాంతం పువ్వు నూనె

వంటకాల తయారీకి ఒక్కొక్కరు ఒక్కో తరహ నూనెలు వాడుతుంతారు. ప్రాంతాన్నిబట్టి, కుటుంబ అలవాటునుబట్టి వాడే నూనెలు మారుతాయి . ఒక్కొక్క నూనెకు ఒక్కొ ప్రత్యేకత ఉంది. ఆరోగ్యానికి మంచి, చెడు చేస్తాయి. నూనెలు, కొవ్వులు వృక్ష, జంతు సంబంధిత ఉత్పత్తులు. ఇవి నీటిలో కరగవు. నూనెలను/కొవ్వులను ఫ్యాటి ఆమ్లముల గ్లిసెరొల్ ఎస్టరులు (Glycerol esters of fatty acids) అంటారు. లేదా 'triglyceredes'లేదా 'Triacylglycerols' అంటారు. సాధారణ పరిసర ఉష్ణోగ్రత వద్ద ఘన (solid) లేదా అర్దఘన (semi solid) రూపములో వున్నచో కొవ్వులని (fats, ద్రవరూపంలో వున్నచో నూనెలని (oils) అనిఅంటారు. మూడుఫ్యాటి ఆమ్లముల ఆణువులు, ఒక గ్లిసెరొల్ అణువు సంయోగం చెందటం వలన ఒక నూనె/కొవ్వు అణువు (Triglyceride molecule), మూడు నీటి అణూవులు ఏర్పడును. కొవ్వుఆమ్లాలు, గ్లిసెరొల్‌ సంయోగంచెంది, నూనెగా ఎర్పడటం.మిశ్రమ ట్రైగ్లిసెరైడ్

కొవ్వులలో సంతృప్త ఫ్యాటి ఆమ్లాలు ఎక్కువ వుండటం మూలాన అవి ఘన రూపంలో వుంటాయి. నూనెలలో అసంతృప్త ఫ్యాటి ఆమ్లాలు ఎక్కువ శాతంలో వుండును. మనం వాడే వంటనూనెలలో సంతృప్త (సాచురెటెడ్), అసంతృప్త ఫ్యాటి అమ్లములు వివిధ రేషియోలలో వుండును. ఆరోగ్యరీత్యా అసంతృప్త ఫ్యాటి ఆమ్లాలు వున్న నూనెలను ఉపయోగించడం మంచిది. మిరిస్టిక్, లారిక్, పామిటిక్, స్టియరిక్ ఆసిడ్ లు సంతృప్త ఫ్యాటిఆసిడ్లు. ఒలిక్, లినొలిక్, లినొలెనిక్ ఆసిడ్లు అసంతృప్త ఫ్యాటి ఆమ్లములు. ఒలిక్ ఆసిడ్ లో ఒక ద్విబంధము, లినొలిక్ ఆసిడ్ లో రెండు ద్విబంధాలు, లినొలెనిక్ ఆసిడ్ లో మూడు ద్విబంధాలు వుండును. ఒకటికన్న ఎక్కువ ద్విబంధాలున్న ఫ్యాటి ఆమ్లములను పాలి అన్‌సాచురెటెడ్ ఫ్యాటి ఆసిడ్లు (ప్యూఫా) అంటారు.

మనం వాడే వంటనూనెలలో సంతృప్త (సాచురెటెడ్), అసంతృప్త (అన్‌సాచురెటెడ్) ఫ్యాటి అమ్లములు వివిధ రేషియోలలో వుండును. ఆరోగ్యరీత్యా అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వున్న నూనెలను ఉపయోగించడం మంచిది. మిరిస్టిక్, లారిక్, పామిటిక్, స్టియరిక్ కొవ్వు ఆమ్లాలు సంతృప్త ఫ్యాటిఆసిడ్లు. ఒలిక్, లినొలిక్, లినొలెనిక్ ఆసిడ్లు అసంతృప్త కొవ్వు ఆమ్లములు. ఒలిక్ ఆమ్లంలో ఒక ద్విబంధము, లినొలిక్ ఆమ్లంలో రెండు ద్విబంధాలు, లినొలెనిక్ ఆమ్లంలో మూడు ద్విబంధాలు వుండును. ఒకటికన్న ఎక్కువ ద్విబంధాలున్న కొవ్వు ఆమ్లములను బహుళద్విబంధ కొవ్వు ఆమ్లాలు (ప్యూఫా) అంటారు.

వంటనూనెలలో రకాలు

[మార్చు]

కొబ్బరి నూనె

[మార్చు]

కొబ్బరి నూనె (Coconut oil) : కొబ్బరి నూనెను కొబ్బరి కాయలోని కొబ్బరి నుండి (కాయలోని గట్టి పెంకు లోపల వుండే మెత్తటి తెల్లని పదార్థం నుండి సంగ్రహిస్తారు. కొబ్బరి చెట్టు ( 'కొకొస్‌న్యుసిఫెర') లారెసియె కుటుంబానికి చెందినది. చెట్టు నిటారుగా ఎటువంటి కొమ్మలు లేకుండగా వుండును. కొబ్బరి మట్టలు (పత్రకాలు) 5-8 అడుగుల పొడవు వుండును. కొబ్బరి ఎక్కువగా తీరప్రాంతాలలో విరివిగా పెరుగును. ఆంధ్ర ప్రదేశ్‌లో పక్షిమ గోదావరి లోని అమలాపురం, ఎదురులంక లలో ఎక్కువ ఉంది. దేశిరకము దాదాపు 30 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. సంకర రకాలు 15 అడుగుల ఎత్తు వరకు పెరుగును. కొబ్బరినూనెను కేరళలలో వంటనూనెగా కూడా ఉపయోగిస్తారు. కాని కొబ్బరినూనెను ఎక్కువగా సబ్బుల తయారి, కేశ సంవర్ధిని (Hair oil) గా, ఔషధ తయారిలలో వాడదరు. కొబ్బరినూనెలో సంతృప్త ఫ్యాటి ఆమ్లాలు అధిక మొత్తంలో ఉన్నాయి. అందుచే తక్కువ ఉక్ష్ణోగ్రత గల శీతకాలములో కొబ్బరినూనె గడ్డకట్టును.

కొబ్బరినూనెలోని ఫ్యాటిఆమ్లాల శాతము

సంతృప్త ఆమ్లాలు
ఫ్యాటి ఆమ్లము శాతము
లారిక్ ఆసిడ్ (C12:0) 47.5%
మిరిస్ట్‌క్‌ ఆసిడ్ (C14:0) 18.1%
పామిటిక్ ఆసిడ్ (C16:0) 8.8%
కాప్రిలిక్ ఆసిడ్ (C8:0) 7.8%
కాప్రిక్ ఆసిడ్ (C10:0) 6.7%
కాప్రోయిక్ ఆసిడ్ (C6:0) 0.5%
స్టియరిక్ ఆసిడ్ (C18:0) 2.6%
ఆసంతృప్త ఫ్యాటి ఆమ్లాలు
ఒలిక్ ఆసిడ్ (C18:1) 6.2%
లినొలిక్ ఆసిడ్ (C18:2) 1.6%

కొబ్బరినూనె భౌతిక, రసాయనిక ధర్మాలు

సమ్మేళనాలు మితి
సాంద్రత (300C/300C) 0.915-0.920
వక్రీభవన సూచిక (400C) 1.448-1.449
ఐయోడిన్‌విలువ 7.5-10
సపోనిఫికెసను విలువ, కనీసం 250
అన్‌సపోనిఫియబుల్‌మేటరు 0.8-1.0
పొలెన్‌స్కి విలువ, కనీష్టం 13.0
తేమ, ఇతరమలినాలు 0.1-0.25%

సూర్యకాంతం పువ్వు నూనె

[మార్చు]

సూర్యకాంతం పువ్వు నూనె (Sunflower oil) :దీనినే పొద్దుతిరుగుడుపువ్వు నూనె అనికూడా అంటారు.బహూబంధఅసంతృప్త ఫ్యాటిఆమ్లాలను (PUFA:poly unsaturared fatty acids) ఎక్కువ శాతములోకలిగివున్నది.వంటనూనెగా ఉపయోగిస్తారు.రిపైండ్‌నూనె పారదర్శకంగా వుండును.

నూనెలోని కొవ్వుఆమ్లాలశాతం

ఫ్యాటిఆమ్లము శాతం
పామిటిక్‌ఆసిడ్ 4-9%
ఒలిక్‌ఆసిడ్ 10-14%
లినొలిక్‌ఆసిడ్ 48-74%

భౌతికథర్మాలు

సపొనిఫికెసను విలువ 188-194
ఐయోడిన్ విలువ 120-145
అన్‌సపొనిఫియబుల్‌మేటరు 1.5-2.0

సన్‌ప్లవర్‌ ఆయిల్‌లో లిసిధిన్, తొకొపెరొల్స్, వ్యాక్స్్‌ కూడా అధిక మొత్తములో ఉన్నాయి. గింజల నుండి నూనెను ఎక్స్పెల్లరుల ద్వారా, సాల్వెంట్ విధానం ద్వారా సంగ్రహిస్తారు.

ఆరోగ్య విషయాలు

[మార్చు]

వంట నూనెలతో సర్వరోగాలు

[మార్చు]

నూనెలోఅధికశాతంలో ట్రాన్స్ ఫ్యాట్ ఆమ్లాలున్నట్లు సీ.ఎస్.ఈ. అధ్యయనంలో వెల్లడయ్యింది. ట్రాన్స్‌ఫ్యాట్ ఆమ్లాలు రక్తంలో ఆరోగ్యకరమైన కొవ్వును తగ్గించడం వల్ల హృద్రోగాలు పెరిగే ప్రమాదముంది. డయాబెటిస్, అల్జీమర్స్, మహిళల్లో సంతాన సమస్యలు, రొమ్ము కేన్సర్ లాంటి రోగాలు రావడానికి కూడా అవకాశముంది. కానీ వంట నూనెలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలనే ఉద్దేశంతో కంపెనీలు వాటి స్థాయిని తగ్గించడం లేదు. దాదాపు అన్ని కంపెనీల వనస్పతిలోనూ హానికారక ట్రాన్స్‌ఫ్యాట్లు నిర్దేశిత ప్రమాణం 2 శాతం కంటే 12 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఆవనూనెలో ఇది ఒక శాతం కంటే తక్కువగా ఉండడంతో పాటు అవసరమైన శాతంలో ఒమెగా 3, 6, 9 లాంటి మంచి కొవ్వు పదార్థాలు ఉన్నాయని తేలింది. నూనెలలో సంతృప్త, అసంతృప్త ఫ్యాటి అమ్లములు వుండును. అసంతృప్త ఫ్యాటి ఆమ్లములు ద్విబంధం కలిగి వుండును. అసంతృప్త ఫ్యాటి ఆసిడ్ల ద్విబంధాలు సిస్ లేదా ట్రాన్స్ అమరిక కలిగి వుండును. మనం వాడే వంట నూనెలలోని అసంతృప్త ఫ్యాటి ఆసిడ్ లు ఏక్కువగా సిస్ అమరిక కలిగి వుండును. అయితే నూనెను పలుమారులు వాతావరణ ఉక్ష్ణోగ్రతలో వేడచెయ్యడం వలన సిస్ అమరిక ట్రాన్స్ అమరికగా మారుతుంది. అలాగే నూనెలను వనస్పతిగా తయారు చెయ్యునప్పుడు, ఒకటి కన్న ఎక్కువ ద్విబంధాలున్న అసంతృప్త ఫ్యాటి అసిడ్ లు ట్రాన్స్ ఫ్యాటి అసిడ్ లుగా మారును.[1]

రక్తపోటుకు 'నూనెల' కళ్లెం!

[మార్చు]

నువ్వులనూనె, తవుడునూనె కలిపి వాడితే అధిక రక్తపోటు తగ్గుతున్నట్టు మనదేశంలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అధిక రక్తపోటు బాధితులకు పక్షవాతం, గుండెజబ్బు ముప్పు ఎక్కువన్నది తెలిసిందే. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజువారీ ఆహారంలో భాగంగా సుమారు 40 గ్రాముల మేరకు నువ్వులనూనె, తవుడునూనె కలిపి తీసుకుంటే.. రక్తపోటు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ తగ్గుదల రక్తపోటు తగ్గటానికి వేసుకునే మందులతో (క్యాల్షియం ఛానెల్‌ బ్లాకర్స్) సమానంగా ఉండటం గమనార్హం. కేవలం మందులు వేసుకునేవారితో పోలిస్తే.. మందులతో పాటు నూనెల మిశ్రమాన్ని వాడినవారిలో రక్తపోటు రెండు రెట్లు తగ్గటం విశేషం. ఈ నూనెల మిశ్రమంతో చెడ్డ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్) తగ్గటంతో పాటు మంచి (హెచ్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ పెరుగుతోందనీ పరిశోధకులు చెబుతున్నారు. నువ్వుల నూనె రక్తపోటుపై గణనీయమైన ప్రభావం చూపుతుందని, ఇది కూడా క్యాల్షియం ఛానెల్‌ బ్లాకర్‌ మందుల్లా ప్రభావం చూపుతుందని గతంలో తేలిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ దేవరాజన్‌ శంకర్‌ పేర్కొంటున్నారు. అయితే దీనికి తవుడు నూనె కూడా తోడైతే మరింత మంచి ఫలితం కనబడుతోంది. నువ్వులనూనెలోని సీసమిన్‌, సీసమోల్‌, సీసమోలిన్‌.. తవుడునూనెలోని ఓరీజనోల్‌ అనే యాంటీఆక్సిడెంట్లు ఇందుకు దోహదం చేస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ రెండు నూనెలూ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (మంచి కొవ్వులు) కలిగున్నాయంటున్నారు.

వంటనూనెలలో ఆరోగ్యానికి ఏది మంచిది?

[మార్చు]

అన్ని నూనెలూ ఆరోగ్యానికి హాని చేస్తాయి.. కొవ్వు పెంచేస్తాయి.. వంటి భావనలు చాలామందిలో పేరుకుపోయాయి. నిజానికి ఇది పూర్తిగా వాస్తవం కాదు . నూనెల నుంచి లభించే అన్ని రకాల కొవ్వుపదార్థాలు అనారోగ్యం కలిగించవు. వాటిల్లో ఉపయోగపడేవీ ఉంటాయి. ఆ వివరాలు తెలుసుకుని, పరిమితంగా వాడితే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.

ఉపయోగాలు

శరీర పనితీరు బాగుండాలంటే విటమిన్లు, ఖనిజాలు ఎలా తప్పనిసరో కొవ్వుల వాడకం కూడా అంతే ప్రధానం. ముఖ్యంగా ఎ, డి, ఇ, కె వంటి కీలక విటమిన్లు శరీరానికి నేరుగా అందాలంటే కొవ్వులని ఆహారంలో తప్పక తీసుకోవాలి. ఇవి మనం తినే పప్పుల నుంచీ, తృణధాన్యాల నుంచీ కొంతవరకు అందితే.. మరికొంత వంటల్లో వాడే నూనెల నుంచి అందుతాయి. ఇంకొంత శాతం శరీరమే స్వయంగా విడుదల చేస్తుంది.కొవ్వుల నుంచి ప్రధానంగా విటమిన్‌ ఎ, డి, ఇ, కె వంటి విటమిన్లు లభిస్తాయి. వీటితో పాటు వాటికుండే రంగు, రుచి, వాసన, ఇతర పోషకాల కారణంగా నూనెలు ప్రత్యేకతలను సంతరించుకొంటాయి. ముఖ్యంగా వాటిలోని ఫ్యాటీ యాసిడ్ల మేళవింపు, మోతాదు కారణంగానే నూనెలు ఎంత వరకు ఆరోగ్యప్రదం అన్న విషయం తెలుస్తుంది. ఈ ఫ్యాటీ యాసిడ్లు మూడు రకాలుంటాయి. ఒకటి శాచురేటెడ్‌ అయితే తక్కినవి అన్‌శాచురేటెడ్‌ రకాలు. అన్‌శాచురేటెడ్ లో మోనో అన్‌శాచురేటెడ్‌ (మూఫా-MUFA), పాలీ అన్‌శాచురేటెడ్‌ (పూఫా-PUFA) ఉంటాయి. శాచురేటెడ్‌ కొవ్వులు సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద ఘన రూపంలో ఉంటాయి. వాస్తవానికి శరీరం ఎప్పటికప్పుడు కావాల్సినంత శాచురేటెడ్‌ కొవ్వులని ఉత్పత్తి చేసుకొంటుంది. అయినా శాచురేటెడ్‌ కొవ్వులని బయట నుంచి అదనంగా వాడటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అలాని పూర్తిగా దూరంగా ఉండటం కూడా మంచిది కాదు. ఎందుకంటే శరీర పనితీరుకు ఈ కొవ్వులు తప్పనిసరిగా అవసరం అవుతాయి. ఇక మోనో అన్‌శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వులని కలిపి అన్‌శాచురేటెడ్‌ కొవ్వులుగా వ్యవహరిస్తారు. మోనో అన్‌శాచురేటెడ్‌ అంటే, ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటాయి. రిఫ్రిజిరేటర్‌లో పెట్టగానే ఘనరూపంలోకి వస్తాయి. ఆరోగ్యపరంగా కూరలు, వేపుళ్లలో ఉపయోగించడానికి మోనో అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు చక్కగా ఉపయోగపడతాయి. వేరుసెనగ, నువ్వులు, కనోలా, ఆలివ్‌ నూనెలు ఈ కోవకు చెందుతాయి. ఆలివ్‌ నూనె తప్ప తక్కినవి అధిక ఉష్ణోగ్రతలకు గురిచేసినా కూడా వీటిల్లో పెద్దగా మార్పు ఉండకపోవడం విశేషం. పూఫా అధికంగా ఉండే నూనెలు శరీరానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తంలోని చక్కెర స్థాయిలని నియంత్రిస్తాయి. రెండవ రకం మధుమేహం సమస్యని నియంత్రిస్తాయి. గుండెజబ్బులు, రొమ్ముక్యాన్సర్ రాకుండా అడ్డుకొంటాయి. సోయాబీన్‌ నూనె, సన్‌ఫ్లవర్‌ నూనెల్లో ఈ పూఫా అధికంగా లభ్యమవుతుంది.

కొలెస్ట్రాల్

శరీర పనితీరు చురుగ్గా ఉండటానికి, పాడయిన శరీర కణాలు కోలుకోవడానికి కొలెస్ట్రాల్‌ కొంతమేరకు అవసరమే. ఇది తగినంతగా లేకపోతే కుంగి పోవడం, నిరాశలోకి కూరుకుపోవడం, ఊపిరితిత్తుల సమస్యలు, కొన్నిసార్లు క్యాన్సర్ల బారినపడటం కూడా జరుగుతుంది. కొలెస్ట్రాల్‌ని సాధారణంగా గుడ్లు, మాంసం, ఇతర పాల ఉత్పత్తులన నుంచి పొందితే.. శరీరంలోని కాలేయం నుంచి కూడా కొంతవరకు అందుతుంది. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలుంటాయి. ఒకటిలో డెన్సిటీ లిపో ప్రొటీన్స్‌ ఉండే (ఎల్‌డీఎల్‌) రకం. ఇది చెడు కొలెస్ట్రాల్‌. శాచురేటెడ్‌ ఫ్యాట్లు అధికంగా ఉండే ఆహారం తినేవారిలో ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ అధికంగా చేరుకొంటుంది. ఇవి గుండె జబ్బులు రావడానికి కారణం అవుతాయి. మరొకరకం కొవ్వు హెచ్‌డీఎల్‌.. దీన్నే హైడెన్సిటీ లిపోప్రొటీన్స్‌ అని కూడా అంటారు. ఇవి మంచి రకం కొవ్వులు.

ట్రాన్స్‌ఫ్యాట్లతో.. అప్రమత్తం

నూనెలను రుచికోసం కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో రసాయనిక చర్యలకు గురిచేసి ట్రాన్స్‌ ఫ్యాట్లుగా లేదా హైడ్రోజినేటెడ్‌ నూనెలుగా మారుస్తారు. బేకరీ, ప్యాక్‌ చేసిన పదార్థాల్లో.. రెస్టారెంట్లలో వీటిని ఉపయోగిస్తారు. సలాడ్‌ డ్రెస్సింగుల్లోనూ వాడతారు. ఇవి తక్కిన వాటితో పోలిస్తే చౌకగా ఉంటాయి. వనస్పతి ఈ కోవకి చెందినదే! ఇవి శరీరానికి హాని చేస్తాయి.

మేలు నూనెల గుర్తింపు విధానం

వంట నూనెల్లో.. ఇతరత్రా వంటకు పనికిరాని నూనెలని కలపడం ద్వారా వాటిని కల్తీకి గురిచేస్తారు. ఉదాహరణకి ఆముదం, ఆర్గీమోన్‌, మినరల్‌ నూనెలని వంటకు వాడే నూనెల్లో కలపడం ద్వారా కలుషితం చేసే వీలుంది. కొన్ని సందర్భాల్లో కాటన్‌సీడ్‌, పామోలీన్‌ వంటి చౌక నూనెలనూ ఇందుకు ఉపయోగిస్తారు. నూనెలు బాగా ముదురు రంగులో కనిపించినా, ముక్కవాసన వచ్చినట్టున్నా.. అప్పడాలు వంటివి వేయించిన వెంటనే రుచిలో తేడాగా ఉన్నా అది వాడేసిన నూనెగా గుర్తించాలి. ఒకసారి వాడిన నూనెలని మరోసారి మరిగిస్తే అవి అనేక అనారోగ్యాలకి దారి తీస్తాయి. ఒకసారి వాడిన నూనెని, వాడని దానితో కలపకూడదు. దానివల్ల తాజా నూనె కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. నూనెలని చల్లని, పొడి ప్రదేశాల్లో, సరైన మూత పెట్టి నిల్వ చెయ్యాలి. రిఫ్రిజిరేటర్‌లో పెట్టి తీస్తే గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత వాడాలి.

సమాచారంతో అవగాహన;

నూనెల్లో మూఫా, పూఫాల మేళవింపు ఎలా ఉందో చూసుకొని కొనుక్కొంటే ఆరోగ్యప్రదం. నూనెలో భారలోహాలు, హానిచేసే సూక్ష్మక్రిములు, ఇతరత్రా కలుషితాలు లేవని నిర్థారించుకోవాలి. నూనె ప్యాకెట్‌ని కొన్నాక దానిపై ఏం రాసి ఉందని చదివితే.. ఉత్పత్తి పేరు, తయారైన స్థలం, సమయం, అందులోని పోషకాల వివరాలు, కాల వ్యవధి తెలుస్తాయి. నూనెలో సింథటిక్‌ యాంటీ ఆక్సిడెంట్లని కలిపి ఉంటే వాటి వివరాలు పొందు పరచాలని నిబంధనలు తెలియజేస్తున్నాయి. నూనెలపై 'ఫ్రీ ఫ్రమ్‌ ఆర్గీమోన్‌ ఆయిల్‌ ఆర్‌ ట్రాన్స్‌ ఫ్యాట్స్‌' అని రాసి ఉండటం తప్పనిసరి. ఎందుకంటే ట్రాన్స్‌ఫ్యాట్లు, ఆర్గీమోన్‌ నూనెలు అనేవి ఆరోగ్యానికి చేటు చేస్తాయి. అందుకే మీరు కొనే నూనెలో అవి లేవని నిర్ధారించుకోవాలి.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-12-23. Retrieved 2011-08-26.
  • The Johns Hopkins Textbook of Dyslipidemia / 1. D. Paul Nicholls, MD, DSc, FRCP; 2. Ian S. Young, MD, FRCP, FRCPath

యితర లింకులు

[మార్చు]