నువ్వుల నూనె

వికీపీడియా నుండి
దక్షిణ కొరియాలో నువ్వుల నూనెను తయారుచేస్తున్న యంత్రం.

నువ్వుల నూనె (Sesame oil or gingelly oil or til oil) నూనె గింజలైన నువ్వులు నుండి తయారౌతుంది. నువ్వులు శాస్త్రీయ నామం : సెసమమ్ ఇండికమ్ (sesamum indicum L) ఇది పెడాలియేసి (Pedaliacae) కుటుంబంలో సెసమమ్ (Sesamum) ప్రజాతికి చెందినది. నువ్వులను సంస్కృతంలో 'తిల '(Til) అందురు. తిల నుండి వచ్చినది కావడం వలన 'తైలం' అయినది. నూనె ఆనే పేరు మూల ద్రావిడంలోని 'ఎన్న', 'ఎన్నై' నుండి తెలుగులో నూనె గా మారింది. కన్నడలో నూనెను 'ఎణ్ణె' అందురు.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

సింధు లోయ నాగరికత (hindu valley civilization) కాలం నాటికి అప్పటి ప్రజలు నువ్వుల నూనెను వాడేవారు. మానవుడు మొదటగా నువ్వుల నుండె నూనెను తీసి వాడటం ప్రారంబించినట్లు తెలుస్తున్నది. వేదాలలో కూడ నువ్వుల ప్రస్తావన వున్నది. నువ్వుల నుండి గానుగ ద్వారా నూనెను తీయువారు తిలకల వాళ్లు గా పిలవబడి కాలక్రమేన తెలికల వాళ్ళు గా మారారు. తెలికల కులానికి చెందిన వారు గానుగల ద్వారా నూనెను తీయటం తమ వృత్తిగా అక్కడక్కడ గ్రామాలలో వున్నారు. క్రీ. పూ. 600 నాటికి సింథులోయ నుండి మెసొపొటొమియా కు వ్యాప్తిచెందినది. సింథులోయ ప్రాంతం నుండే నువ్వులు మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందినది.

White sesame seeds, mostly unshelled.

[మార్చు] Composition

Sesame oil is composed of the following fatty acids:[1]

Fatty acid Nomenclature Minimum Maximum
Palmitic C16:0 7.0 % 12.0 %
Palmitoleic C16:1 trace 0.5 %
Stearic C18:0 3.5 % 6.0 %
Oleic C18:1 35.0 % 50.0 %
Linoleic C18:2 35.0 % 50.0 %
Linolenic C18:3 trace 1.0 %
Eicosenoic C20:1 trace 1.0 %


[మార్చు] నువ్వులనూనె భౌతిక ధర్మాలు

సాంద్రత 0.915-0.919
వక్రీభవనసూచిక(400C) 1.4645-1.4665
సపొనిఫెకెసన్ విలువ 188-193
ఐయోడిన్ విలువ 103-120
అన్‌సపొనిఫియబుల్‌ పధార్ధం 1.5-2.0%
బెల్లియరు టర్బిడిటి (గరిష్టం) 220C

[మార్చు] ఉపయోగాలు

నువ్వులనూనెను కేవలం వంటనూనెగానే కాకుండ దేహ మర్ధన తైలంగా, ఆయూర్వేద మందులలో, కాస్మాటిక్స్‌తరారిలో వాడెదరు. పసిబిడ్దకు (నెలల పిల్లలు) మొదట నువ్వుల నూనెతో మర్ధన ఛెసి ఆ తరువాత స్నానం చెయ్య డం ఇప్పటికి గామాలలో చూడ వచ్చును. ఆంతేకాదు, ప్రసవానంతరం,15-20 రోజుల వరకు బాలింతరాలికి నువ్వుల నూనె, నువ్వులతో చేసిన పథార్దంలు ఆహరంగా యిచ్చెవారు. పుస్కర సమయంలో, కర్మక్రియలలో, గ్రహ దోష నివారణ పూజలు చేసినప్పుడు బ్రహ్మణులకు నువ్వులను దానంగా యిస్తారు. దేవాలయాలలో, ముఖ్యంగా శనేస్వర ఆలయంలో నువ్వులనూనెతో దీపారాధన చెయ్యడం ఆచారం.

నువ్వులనూనెలో సెసమొల్ (sesamol), మరియు సెసమిన్ (sesamin) వున్నాయు. సెసమిల్ "రక్త వత్తిడి" (Blood pressure)ని తగ్గించును. వనస్పతి (డాల్డా)లో తప్పని సరిగా 10% వరకు నువ్వుల నూనెను ఉపయోగించాలని ప్రభుత్వ నూనెల-వనస్పతి శాఖ-కల్తి నిరోధక విభాగం నిభందన వున్నది. నువ్వుల నూనెను ఎదైన నూనెలో కల్తి చేసిన బౌవడిన్ టెస్ట్‌ (Baudouin test) ద్వారా గుర్తించవచ్చును.వనస్పతిని నెయ్యిలో కల్తి చేసిన ,ఈ బౌడిన్ టెస్ట్‌వలన గుర్తించవచ్చును.

[మార్చు] పోషక విలువలు

Oil, sesame, salad or cooking
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 880 kcal   3700 kJ
పిండిపదార్థాలు     0.00 g
కొవ్వు పదార్థాలు 100.00 g
- సంతృప్త  14.200 g
- ఏకసంతృప్త  39.700 g  
- బహుసంతృప్త  41.700 g  
మాంసకృత్తులు 0.00 g
విటమిన్ సి  0.0 mg 0%
విటమిన్ ఇ  1.40 mg 9%
విటమిన్ కె  13.6 μg 13%
కాల్షియమ్  0 mg 0%
ఇనుము  0.00 mg 0%
మెగ్నీషియమ్  0 mg 0% 
భాస్వరం  0 mg 0%
పొటాషియం  0 mg   0%
సోడియం  0 mg 0%
శాతములు, అమెరికా వయోజనులకు
సూచించబడిన వాటికి సాపేక్షంగా
Source: USDA పోషక విలువల డేటాబేసు

[మార్చు] ఉత్పత్తి

ప్రపంచంలో 65 దేశలు నువ్వులను పండిస్తున్నాయి. సంవత్సరముకు 30-40 లక్షల టన్నుల నువ్వులు ఉత్పత్తి కాగా, అందులో భారతదేశం వాటా 6-8 లక్షల టన్నులు (20%). ప్రపంచం మొత్తం మీద 7.5 మిలి యన్‌ హెక్టరు లలో నువ్వుల పంట సాగు అవ్వుతున్నది. భారయదేశంలో 1.7 మిలియన్‌ హెక్టరులలో సాగు అగుచున్నది. ప్రపంచంలో నువ్వులను అథికంగా పండించు యితర దేశలు, చైనా (20%), మయన్మారు (17%), సుడాన్ (5.5%), ఉగాండా (5.0%), నిగెరియ, పాకిస్తాన్, బంగ్లాదేశ్. భారత దేశం నుండి సంత్సరంకు 2.5-3.0 లక్షల టన్నుల నువ్వులు ఎగుమతి అవ్వుచున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1.6 లక్షల హెక్టరులలో నువ్వుల పంట సాగులో వున్నది.

[మార్చు] మూలాలు

  1. Fatty acids found in sesame oil. Essential oils. తీసుకొన్న తేదీ: 2006-10-07.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు