తవుడు నూనె
Block quote
|
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
తవుడు నూనె (Rice Bran oil) ఒక రకమైన నూనె. ఆహర యోగ్య తైలం. ఎకబిజదళ తరగతికి చెందిన వరి మొక్క. కుటుంబం పోయేసి (poaceae). ఈ మొక్క శాస్త్రీయనామం ఒరైజా సాటివా (oryza sativa), యిది ఆసియా రకం. ఆఫ్రికా రకం పేరు ఒరైజా గ్లాబెర్రిమ. దీనిని ఎకవార్షీకంగా సాగుచేయుదురు.
తవుడు, వడ్లలను (Paddy), బియ్యం మిల్లులో (Rice Mill) బియ్యం ఉత్పత్తి కై ఆడించినప్పుఫు, 'తవుడు' లేదా 'తౌడు' ఉప ఉత్పత్తి గా ఏర్పడును. తౌడును 'చిట్టు', 'పారూ' అని కూడా ఆంటారు. తౌడును సాధారణంగా పశువులకు దాణాగా (మేత), కుడితిలో కలిపి యివ్వడం జరుగుతుంది. అటువంటి తవుడు నుండి నూనె అనగానే కొద్దిగా ఆశ్ఛర్యం అన్పిస్తుంది. గత 30-35 ఏళ్ళగా భారత దేశంలో తవుడు నుంచి నూనెను "సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ (Solvent extraction) పద్ధతి ద్వారా తవుడు నూనెను ఉత్పత్తి చేయుచున్నారు. కాని మొదట 15 సంవత్సరాలు ఉత్పత్తి అయ్యిన తవుడు నూనె, ఎక్కువ శాతంలో F.F.A. (Free fatty Acids)ను కలిగి వుండటం వలన, ఆ నూనెను ఎక్కువగా, కేవలం సబ్బులు, ఫ్యాటిఆమ్లాల తయారిలో మాత్రమే వినియోగించెవారు. ఎక్కువ శాతంలో F.F.A. (40-80 %) వుండటం వలన ఈ నూనెను 'రిపైన్' చెయ్యుటకు అనుకూలం కానందున కేవలం సబ్బులు, ఫ్యాటి ఆసిడ్‌లు, గ్రీజ్ వంట్ వాటి ఉత్పత్తికి మాత్రమే తవుడు నూనెను వాడెవారు. కాలక్రమేన ఆయిల్ ఇండ్రస్టిలో,ఆయిల్ ప్రాసెంగ్ విధానంలో వచ్చిన మార్పుల వలన తక్కువ శాతం ఫ్రీ ఫ్యాటి ఆసిడ్ వున్న(5-20%) తవుడు నూనెను ఉత్పత్తి చేయ్యడం సాధ్యం అయ్యినది. అలాగే 'ఫిజికల్ రిఫైనింగ్' పద్దతిలో, స్టీమ్ డిస్టిలెసన్ ద్వారా తవుడు నూనెలోని ఫ్రీఫ్యాటి ఆసిడులను తొలగించడం వలన, రిఫైనింగ్ లాస్ తగ్గడం వలన తవుడు నూనె నుండి వంటనూనెను (Cooking oil) ఉత్పతి చెయ్యడం మొదలైంది. ప్రస్తుతం తౌడు నూనె మార్కెట్‌లో వివిధ బ్రాండ్‌ల పేరుమీద లభిస్తున్నది. ఉదాహరణకు: రైస్ రిచ్, రసోల, తండుల్, చె వంటి పేర్లతో లభిస్తున్నది. కీ.శ.2008-2009 లో 8.5 లక్షల టన్నుల తవుడు నూనె ఉత్పత్తి కాగా అందులో,ఆందులో 8.2 లక్షల టన్నుల తవుడు నూనెను 'ఏడిబుల్ గ్రెడ్ (Edible grade) నూనెగా ఉత్పత్తి అయ్యింది. తవుడు నూనెను సాల్వెంట్ విధానంలో ఉత్పత్తి చెయ్యడం వలన, 10-20% వరకు ఫ్రీ ఫ్యాటి ఆసిడ్స్ (F.F.A.), గమ్స్(Gums)2-2.5%, వ్యాక్స్(Waxes)2-3% కలిగి వుండటం వలన తవుడు నూనె ను నేరుగా వంట నూనెగా ఉపయో గించడం వీలుకాదు. ఈ విధంగా ఎఫ్.ఎఫ్.ఏ., గమ్స్, వ్యాక్స్,కలిగి వున్న తౌడు నూనెను క్రూడ్ లేదా రా రైస్‌బ్రాన్ ఆయిల్ అంటారు. అందుచే ఈ నూనెను రిఫైనరిలో 'రిఫైన్' (Refine) చేసి, రిఫైండ్ తవుడు నూనెగా మార్చి మార్కెటింగ్ చెయుదురు.
విషయ సూచిక |
[మార్చు] తవుడు ఉత్పత్తి, రకాలు
వరిధాన్యం (Paddy)ను రైస్ మిల్లింగ్ చేసినప్పుడు, బియ్యంతో పాటు ఊక (Husk) 25%, నూకలు (Broken rice) 3-5%, మరియు తౌడు 6-8% ఉప్ ఉత్పత్తులు (By Products) ఏర్పడును. బియ్యపు గింజ పై సన్నని పొరలా (Thin membrane), బ్రౌన్ రంగులో, ఆవరించి వుండును. బ్రౌన్‌రంగును తొలగించి,బియ్యంను తెల్లగా చెయ్యుటకై పాలిష్(polish)చేసినప్పుడు పాలిష్‌గా తవుడు ఉత్పత్తి అగును.తవుడు మంచి ఫోషక విలువలున్న పధార్దం లను కలిగి వున్నది.తవుడులో 15-24% వరకు నూనె,14-16% వరకు మాంసకృత్తులను(Proteins)వున్నాయి.ఇంకను పాలిసాక్రైడ్స్,ఫైబరు వున్నాయి.తవుడులో ఇంత పోషక విలువలుండటం వలననే డాక్టరులు దంపుడు బియాన్ని(hand pounded rice)ఆహరంగా తీసుకొమని చెప్తారు.కొన్ని దేశాలలో దంపుడు బియ్యాన్ని ప్యాకెట్‌లో నింపి అమ్ముచున్నారు.2008-2009 లో భారత దేశంలో,140 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తికాగా,మిల్లింగ్‌చెయ్యగా 100 మిలియన్‌టన్నుల బియ్యం,80 లక్షల టన్నుల తవుడుఊత్పత్తి అయ్యింది.అందులో 35 లక్షల తవుడును నేరుగా పశువుల దాణాగా వాడగా,45 లక్షలటన్నుల తవుడు నుండి తౌడు నూనెను ఉత్పత్తి చెయ్యడం జరిగినది.బియ్యంను రెండు రకములుగా ఉత్పత్తి చెయ్యుదురు.ఒకట్ పచ్చి బియ్యం(Raw Rice),రెండు ఉప్పుడు బియ్యం(Boiled Rice).ధాన్యం ను కళ్ళంలో ఎండబెట్టి,తేమను తొలగించి,నేరుగా రైస్‌మిల్‌లో మిల్లింగ్‌చేయగా వచ్చిన బియ్యాన్ని పచ్చిబియ్యమని,తవుడును పచ్చితవుడు(Raw Rice Bran)అందురు.ధాన్యంను స్టీమ్‌ద్వారా ఉడికించి(steam boiled),మిల్లింగ్ చెయ్యగా వచ్చిన బియ్యాన్ని ఉప్పుడు బియ్యం(Boiled Rice),అలా వచ్చిన తవుడును ఉప్పుడు తవుడు(Boiled Bran)అంటారు.
ఎస్టరిఫికెసన్: కొవ్వుఆమ్లాలు అల్కహలులతో సంయోగం చెందు రసాయనిక చర్యను ఎస్టరిఫికెసను అందురు.సంయోగంచెందు అల్కహలులు ఒకే హైడ్రొక్షిల్(OH)సమూహన్ని కలిగివున్న ఇథైల్,మిథైల్ వంటి మోనో హైడ్రొక్షిల్ అల్కహల్‌లు కావచ్చును.లేదా రెండు అంతకుమించి హైడ్రొక్షిల్‌సమూహలున్నవి కావచ్చును(గ్లిసెరొల్‌మూడుహైడ్రొక్షిల్ సమూహలను కల్గివున్నది).కొవ్వుఆమ్లాలను మిథైల్,లేదా ఇథైల్ అల్కహల్‌తో ఎస్టరిఫికెసను చెయ్యడం వలన ఎర్పడునవి అల్కహల్‌ఇస్టరులు.కొందరు ఈ చర్యను 'అల్కహలిసిస్'అంటారు.గ్లిసెరొల్‌తో కొవ్వుఆమ్లాలు సంయోగం చెందగా ఎర్పడునవికొవ్వుఆమ్లాల'గ్లిసెరైడ్‌ఈస్టరులు. శాకనూనెలనుండి'బయోడిజెల్'నుకొవ్వుఆమ్లాలను అల్కహల్‌తో సంయోగపరచి ఉత్పత్తి చేయుదురు.మూడు అణువుల ఫ్యాటి ఆసిడ్‌లు,ఒక అణువు గ్లిసెరొల్ సంయోగం వలన,ఒక నూనె ఆణువు,మూడు నీటి అణువులు ఏర్పడును.ఈ విధంగా గ్లిసెరొల్ మరియు కొవ్వుఆమ్లాలు సంయోగచెంది నూనెగా ఎర్పడటాన్ని ఎస్టరిఫికెసను(esterification)అందురు.ఆందుచే నూనెలను ట్రై గ్లిసెరైడ్‌లు(Triglycerides) లేదా కొవ్వుఆమ్లాల గ్లిసెరైడ్ ఎస్టరులందురు.
హైడ్రొలిసిస్
ఎస్టరిఫికెసనుకు వ్యతిరేక చర్య 'హైడ్రొలిసిస్(hydrolysis),హైడ్రొలిసిస్ వలన నూనెలు కొవ్వుఆమ్లాలు,మరియు గ్లిసెరొల్ గా విడగొట్టబడును.తవుడులో 'లీపెస్' (Lipase)అనే ఎంజైమ్‌వున్నది.ఈ లిపెస్ పచ్చితవుడులో చాలా క్రీయాశీలం గా వుండి 'హైడ్రొలిసిస్'(hydrolysis)చర్య ద్వారా నూనెను తిరిగి ఫ్యాటి ఆమ్లాలుగా,గ్లిసెరిన్‌గా విడగొట్టును.ఈ స్ధితిలో ఫ్యాటిఆసిడ్‌లు నూనెలో స్వేఛ్ఛగా(free)వుండటం వలన వీటిని ఫ్రీఫ్యాటిఆసిడ్స్(Free Fatty Acids,F.F.A.)ఆంటారు.అందుచే పచ్చి తవుడును మిల్లింగ్ అయ్యినవెంటనే 24 గంటల లోపు సాల్వెంట్‌ఎక్స్‌ట్రాక్షన్ ప్లాంట్‌లో ప్రాసెస్ చేసి నూనెను ఉత్ప్త్తి చేసిన తక్కువ ఎఫ్.ఎఫ్,ఎ. వున్న ఆయిల్‌ను ఉత్పత్తి అగును.24 గంటలు దాటినచో పచ్చితవుడు లోఎఫ్,.ఎఫ్.ఎ. (F.F.A.)శాతం 25-45% వరకు పెరిగిపొవడం వలన ఆయిల్‌ను రిఫైన్‌చెసిన రిఫైనింగ్‌లాస్ ఎక్కువ వచ్చును,మరొయు ఆయిల్ కలర్‌కూడా ఎక్కువగా వుండును.బాయిల్డ్‌బ్రాన్‌లో ఎఫ్.ఎఫ్.ఎ.ఆంతత్వరగా పెరగదు. బాయిల్డ్ రైస్‌ను స్టీమ్‌కుకింగ్‌చెయ్యడం వలన,తవుడులోని 'లిపెస్'ఎంజైమ్ డిఆక్టివేట్‌అవ్వడం వలన,ఎఫ్.ఎఫ్.ఎ. త్వరగా పెరగదు.ఫ్రెష్‌బాయిల్డ్‌బ్రాన్‌నుండి 5% కన్న తక్కువ ఎఫ్.ఎఫ్.ఎ.వున్న ఆయిల్‌ను ఉత్పత్తి చెయ్యవచ్చును.వంటకు ఉపయోగించు నూనెలో F.F.A.శాతం 0.25% మించి వుండరాదు.ఎఫ్.ఎఫ్.ఎ. 1% మించి వుండినచో ,ఆయిల్‌ను వేడిచేసినప్పుడు తక్కువ ఉష్ణోగ్రత వద్దనే నూనెనుండి పొగ(smoke)రావడం ప్రారంభం అవుతుంది,మరియు ఎఫ్.ఎఫ్.ఎ. కారణముగా నూనెకు చేదు(Bitter)రుచి వచ్చును.అందుచే సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్‌ద్వారా ఉత్పత్తి చేసిన తవుడు నూనెను తప్పనిసరిగా రిఫైనింగ్‌చేసిన తరువాత మాత్రమే వంట నూనె గా వినియోగించవలెను.ఆయిల్ రిఫైనింగ్‌అనగా ఆయిల్‌లోని ఎ.ఎఫ్.ఎ.ను,గమ్స్,వ్యాక్సులను తొలగించి,ఆయిల్ కలరును తగ్గించడం.ఆంధ్ర ప్రదేశ్‌లో తవుడునుండి నూనెను సంగ్రహించు సాల్వెంట్‌ప్లాంట్‌లు 45 వరకు వున్నాయి.అలాగే తవుడు నూనెను రిఫైన్‌చెయ్యు రిపైనరిలు 20 వరకు వున్నాయి.రైస్‌మిల్‌యొక్క ప్రాసెసింగ్‌డిజైన్‌ను బట్టి ,తవుడులో నూనెశాతం 8-25% వరకు వుండును.హల్లర్‌రైస్‌మిల్(Huller mill)లోని తవుడులో 6-8% వరకు,షెల్లర్‌మిల్(Sheller mill)తవుడులో 16-20% వరకు,మోడరన్ రబ్బరు షెల్లర్‌మిల్‌తవుడులో 20-25% వరకు నూనె వుండును.తవుడు సాధారణంగా గోధుమరంగు(Brown)లో వుండును.మాములుగా నూనె గింజలనుండి ఆయిల్‌ను రోటరి మిల్,ఎక్స్ పెల్లరుల ద్వారా తీయుదురు.కాని తవుడు నూనెను కేవలం సాల్వెంట్‌ఎక్స్‌ట్రాక్షన్ ద్వారానే సాధ్యం.ఎధైన ఘన,లేదా ద్రవపధార్దంను తనలో కరగించుకొను లక్షణం వున్న ద్రవంను'ద్రావణి'(Solvent).అన్ని ఆయిల్స్ హైడ్రొకార్బన్‌సాల్వెంట్స్ అయిన బెంజీన్,అసిటొన్,క్లోరోపారం,మరియు హెక్సెన్(Hexane)లో అతి సులభం గా కరుగును.హెక్సెన్‌ను సాల్వెంట్ గా ఉపయోగించి, తవుడు నుండి ఆయిల్‌ను ఎక్స్‌ట్రాక్ట్‌చెయ్యుదురు.
తవుడులో వుండు పోషక పదార్థముల పట్టిక
| పోషక పదార్థాలు | హల్లరు తవుడు | పచ్చితవుడు | బాయిల్డ్‌తవుడు |
|---|---|---|---|
| తేమ % | 9-10 | 8-9 | 8-9 |
| నూనె% | 5-8 | 16-20 | 20-24 |
| ప్రోటిను% | 7-8 | 13-14 | 14-15 |
| సాండ్/సిలికా% | 12-14 | 5-8-7 | 6-7 |
| పీచు పదార్థం% | 18-20 | 9-10 | 9-11 |
[మార్చు] తవుడు నుండి అయిల్‌ను సంగ్రహించడం
తవుడునుండి ఆయిల్‌ను హెక్సెన్‌ను సాల్వెంట్‌గా ఉపయోగించి తీయుటను 'సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్' (solvent extraction) అంటారు. హెక్సెన్ అల్కెన్ గ్రూప్‌నకు చెందిన ద్రవ హైడ్రొకార్బన్. హెక్సెన్ తక్కువ బాయిలింగ్ పాయింట్ కలిగి వుండటం, టాక్సిన్స్ (విష కారకాలు) లేకపోవడం, విస్తారం గా లభించడం వలన వలన సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ ప్లాంట్‌లలో హెక్సెన్‌నే సాల్వెంట్‌గా వాడెదరు. తవుడు పౌడరు గా వుండటం వలన నేరుగా ఆయిల్‌ను ఎక్స్‌ట్రాక్ట్ చెయ్యుటకు కుదరదు. అందుచే తవుడును మొదటగా గుళికలుగా (Pellets) తయారు చేసి, ఆ తరువాత ఈ పిల్లెట్స్‌ను ఏక్స్‌ట్రాక్టరుకు పంపి, అక్కడ హెక్సెనును స్ప్రే చేసి తవుడు నుండి నూనెను తీయుదురు.
తవుడును గుళికకలుగా మార్చు యంత్రంను పెల్లెటైజరు (Pelletiser) లేదా కూబర్ మెచిన్ (cuber machine) అనెదరు. పెల్లెటైజరు లో సాధారణంగా కాస్ట్‌ఐరన్ (cast iron)తో చేసిన డై ప్లేట్ (Die plate) మరియు, రోలరులు వుండును.డై ప్లెట్‌కు 6-8 వ్యాసం(Diameter)వున్న రంధ్రాలుండును.డై ప్లేట్ మందం 55-60 మి.మీ. వుండును.ఈ డై ప్లెట్‌మీద 4-6 రోలరులు బిగించబడి వుండును.వీటి డయా 280 మి.మీ.లు వుండి, వెడల్పు 100-160 మి.మీ వరకు పెల్లెటైజర్ ఉత్పత్తి సామార్ద్యంను బట్టి వుండును. డై ప్లేట్‌డయా కూడా మెషిన్ కెపాసిటిని బట్టి 600-840 మి.మీ. వుండును. పెల్లెటైజరుకు తవుడును పంపించె ముందు, తవుడును టెంపరింగ్ కన్వెయరు (Temparing conveyer)లో ఒపన్‌స్టీమ్ ద్వారా కుకింగ్ చెయ్యుదురు. ఒపన్‌స్టీమ్ ద్వారా తవుడును కుకింగ్ చెయ్యడం వలన తవుడులోని తేమ (Moisture) శాతం 15% వరకు పెరగడం వలన పెల్లెట్స్ సుభంగా ఏర్పడుతాయి. పెల్లెటైజెర్ తిరుగునప్పుడు, డై ప్లెట్‌తో పాటు రోలరులు తిరుగును. డై ప్లేట్ భ్రమణ వేగం (Revolution) 90-100/నిమిషానికి వుండును. కుకింగ్ అయ్యిన తవుడు పెల్లెటైజెర్ డై ప్లెట్ మీద పడినప్పుడు,రోలరులు తవుడును అధిక వత్తిడితో డై ప్లెట్ మీద నొక్కడం/వత్తడం వలన, తవుడు పెల్లెట్‌లగా మారి డై ప్లెట్ రంధ్రాల నుండి బయటకు వచ్చును. పెల్లెటైజరు నుండి తయారు అయ్యివచ్చు పెల్లెట్‌ల ఉష్ణోగ్రత 80-85 డిగ్రీలి/సెంటిగ్రెడ్ వుండును. డై ప్లెటుకు దిగువన ఒక కట్టరును బిగించి, పెల్లెట్స్‌ను కావలసిన సైజుకు కత్తరించడం జరుగును. బ్రాన్‌పెల్లెట్స్‌ను సాల్వెంట్ ప్లాంట్‌కు పంపెముందు, పెల్లెట్స్ ఉష్ణోగ్రతను, మరియు పెల్లెట్స్ యొక్క మాయిచ్చర్‌ను తగ్గించవలసి వున్నది. అందుచే పెల్లెట్‌లను పెల్లెట్ కూలర్ (pellet cooler) అనే యంత్రపరికరంకు పంపించి, పెల్లెట్‌ల ఉష్ణోగ్రతను 45-50 సెంటిగ్రెడ్ డిగ్రీల వరకు కూల్‌చెయ్యుదురు.పెల్లెట్‌కూలరులో పెల్లెట్స్ వెళ్లునప్పుడు, ఎయిరు బ్లొవర్ (Air Blower) ద్వారా చల్లని గాలిని ప్రసరింప చెయ్యడం వలన పెల్లెట్స్ చల్లబడును. అంతియేకాదు, పెల్లెట్స్ యొక్క తేమ శాతం కూడా 12% వరకు వచ్చును. పెల్లెట్‌కూలరులో చల్లబరచిన పెల్లెట్స్ ఒక కన్వెయెర్ (conveyer)ద్వారా సాల్వెంట్‌ప్లాంట్‌కు వెళ్ళును.
సాల్వెంట్ ప్లాంట్‌లో ఎక్స్‌ట్రాక్టరులో బ్రాన్ పెల్లెట్స్ మీద హెక్సెనును కంటిన్యుయస్‌గా స్ప్రే చెయ్యడం వలన తవుడు పెల్లెట్స్‌లోని ఆయిల్ హెక్సెనులో కరిగి తవుడు నుండి, వేరుపడును. ఎక్సూట్రాక్టరులో తవుడు పెల్లెట్స్ ఫీడింగ్ హపరు నుండి, డిచార్జి హపరుకు చేరు లోపల తవుడులోని ఆయిల్ మొత్తం హెక్సెనులో లో కరగి పోవును. ఇప్పుడు ఆయిల్లేని (Deoiled) తవుడు పెల్లెట్‌లో 30-35% వరకు సాల్వెంట్ వుండును. ఈ ఆయిల్డ్ బ్రాన్‌ను డిసాల్వెంటింగ్ టోస్టరుకు పంపి, జాకెట్ స్టీమ్‌హేటింగ్ చేసి, హెక్సెను వేపరులను తొలగించడం జరుగును. ఆ తరువాత డిఆయిల్డ్ బ్రాన్‌ను గది ఉష్ణోగ్రతకు చల్లార్చి, బ్యాగ్‌లలో ఫిల్లింగ్ చెయ్యుదురు.
తవుడునూనె మరియు హెక్సెను మిశ్రమంను 'మిసెల్లా' (Micella) అంటారు. ఈ మిసెల్లాను వ్యాక్యుంలో వున్న డిస్టిలెసను (Distillation) సెక్షనులో ఆయిల్ మరియు హెక్సెనుగా వేరు చేయుదురు. డిస్టిలెసను సెక్షనులో హీటరులు, ఎవపరెటరులు అనే వెస్సల్స్ వుండును. హీటరులలో మిసెల్లను జాకెట్ స్టీంద్వారా 80-110 సెంటిగ్రెడ్ దిగ్రీల వరకు వేడి చేసి, ఎవపరెటరులకు పంపెదరు. హెక్సెను బాయిలింగ్ పాయింట్, ఆయిల్ బాయిలింగ్ పాయింట్ కన్న బాగా తక్కువ కావడం వలన, వేపరు రూపంలో హెక్సెను ఆయిల్ నుండి వేరు పడును (హెక్సెను బాయిలింగ్ పయింట్:68-72 సెంటిగ్రెడ్, ఆయిల్ బాయిలింగ్ పాయింట్: 350-400 సెంటిగ్రెడ్). వేపరు రూపంలోని హెక్సెనును కండెన్సరులకు (condensers) పంపి, చల్లబరచి, ద్రవంగా మార్చి, తిరిగి ఎక్స్ట్రాక్షనులో వినియోగిస్తారు.
[మార్చు] తవుడునూనె
తవుడు నూనెలో వుండు సంతృప్త (saturated), అసంతృప్త(unsaturated) ఫ్యాటి ఆమ్లాలు సమతుల్యంగా వుండటం, తక్కువ కొలెస్టరు ఫ్యాక్టరు కలిగి వుండటం, ఒరైజనొల్‌ను కలిగి వుండటం వలన తవుడు నూనెను "Friend of heart" అనికూడా అందురు. రెఫైండ్ రైస్ బ్రాన్ ఆయిల్‌లో వ్యాక్స్ 2.0% వరకు వుండటం వలన, మిగతా అయిల్స్ కన్న కలరు కొద్దిగా ఎక్కువగా వున్నట్లు కన్పించును. సాల్వెంట్ ప్లాంట్ ద్వారా తీసిననూనె లో ఫ్రీ ఫ్యాటి అమ్లాలు మరియు యితర మలినాలు వుండటం వలన చూచుటకు చిక్కగా కన్పించును. మూడినూనె పసుపు. ఎరుపురంగు కలయికలో వుండును, రిపైండు చేసిన నూనె లేతపసుపు రంగులో వుండును.
ముడి నూనె, మరియు రిపైండు తవుడు నూనె భౌతిక రసాయనిక ధర్మాల పట్టిక
| నూనె స్వభావము | ముడి తవుడు నూనె | రిపైండ్‌తవుడునూనె |
|---|---|---|
| తేమ% | 0.5-1.0% | 0.1-0.15% |
| సాంద్రత(15/150C) | 0.913-0.920 | 0.913-0.920 |
| వక్రీభవనసూచిక | 1.4672 | 1.4672 |
| ఐయోడిన్ విలువ | 95-100 | 95-104 |
| సపొనిఫికెసన్‌విలువ | 187 | 187 |
| అన్సపొనిఫియబుల్ పదార్థం | 4.5-5.5 | 1.8-2.5 |
| ఫ్రీకొవ్వుఆమ్లాలు | 5-15% | 0.15-0.2% |
| ఒరైజనోల్ | 2.0 | 1.5-1.8 |
| టొకొపెరొల్ | 0.15 | 0.05 |
| కలరు(టింటోమీటరు) | 20Y+2.8R | 10Y+1.0R |
నూనెలో నున్న కొవ్వుఆమ్లాలు
| Fatty acid | Percentage |
|---|---|
| pamitic | 15.0% |
| Stearic | 1.9% |
| Oleic | 42.5% |
| Linoleic | 39.1% |
| Linolenic | 1.1% |
| Arachidic | 0.5% |
| Behenic | 0.2% |
| Rice bran analysis | |
|---|---|
| Typical Analysis | |
| Dry matter | 90 % |
| Crude Protein | 13.0 % |
| Fat | 13.0 % |
| Crude fiber | 13.0 % |
| Neutral Detergent Fiber | 29.7 % |
| Acid Detergent Fiber | 16.2 % |
| Calcium | 1.00 % |
| Phosphorus | 1.54 % |
| Total Digestible Nutrients | 68.0 % |
| Net energy | 70.0 Mcal/100 lbs. |
[మార్చు] మూలాలు
- 1. SEA publication ,'Handbook on Rice Bran processing'
- 2. A.E.Bailey's 'fat&oils'
