వాడుకరి చర్చ:K.Venkataramana/పాత చర్చ 12

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
     పాత చర్చ 12   
All Pages:  ... (up to 100)


వై వీ సుబ్బారెడ్డి

నమస్కారం అండి. మీరు వై వీ సుబ్బారెడ్డి గారి religion వివరాలతో క్రిస్టియన్ గా చెప్పారు. మీకు ఈ వివరాల మూలాలు చెప్పగలరా? అదే ఇంగ్లీషు వికీ లో అయితే హిందువు గా ఉంది. అందుకు వివరాలు అడుగుతున్నారు. ధన్యవాదములు. Vnssarma (చర్చ) 02:13, 7 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Vnssarma గారూ వై.వి.సుబ్బారెడ్డి మతానికి సంబంధించి సరియైన మూలాలు ప్రస్తుతం లభ్యమగుటలేదు. అందువలన ఆ వాక్యాలను ప్రస్తుతం వ్యాసం నుండి తొలగించితిని.--కె.వెంకటరమణచర్చ 05:18, 7 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Don't interrupt my wikes

మీరు ఎందుకు నా వ్యాసాలను తొలగిస్తున్నారు. నేను ఏమి తపు వ్యాసాలు రాయటం లేదు నా అభిరుచికి తగట్టు నేను వ్యాసం రాస్తున్న. మీరు అన్నారు కదా టైటిల్ కి వ్యాసానికి సంబంధం లేదని, అది తప్పు నేను కష్ట పడి కొంత సమాచారాన్ని సేకరించి నా పరిజ్ఞానం ప్రకారం వ్యాసాలు రాస్తున్నాను. టైటిల్ ఎందుకు అలా నా పేరు పెడుతున్నాను అంటే నా పేజి అని తెలియాలి యని. Kittu c (చర్చ) 12:11, 12 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Kittu c గారూ మీరు ఏదైనా ఆంగ్లవ్యాసం అనువదించాలని భావిస్తే మీ ప్రయోగశాల పేజీలో వాడుకరి:Kittu c/ప్రయోగశాల లో రాయండి. పూర్తి అయిన పిదప వికీపీడియా లో సరైన శీర్షికతో వ్యాసం సృష్టించండి. మీరు మీపేరుతో Yashwanth Chinthapatla " అనే శీర్షికతో వ్యాసం రాస్తున్నారు. వ్యాసంలో వేరొక అంశాలుంటున్నాయి. మీరు మీ పేరుతో వేరొక నటి వ్యాసాన్ని సృష్టిస్తున్నారు. అందువలన తొలగించితిని. మీ పేజీ అని తెలియాలంటే మీ ప్రయోగశాల పేజీలో వ్యాసాన్ని తయారుచేయండి.--కె.వెంకటరమణచర్చ 12:23, 12 జూన్


సోమంచి వాసుదేవరావు పేరుతో చర్చ

వెంకట రమణ గారు,
మీరు నేను రాసిన సోమంచి వాసుదేవరావు అనే వ్యాసానికి ఉపయోగకరమయిన లింకులను చేర్చారు. దాని వలన వ్యాసం మరింత మెరుగుపడింది. మీ దగ్గర ఈ కవి గురించి ఏదైనా అదనపు సమాచారం ఉంటే చేర్చండి. నా దగ్గ్గర కొన్ని అసలు ప్రతులతో పాటు కొంత సమాచారం ఉంది. వీలు వీలువెంబడి ప్రచురిస్తాను. పరీశీలించగలరు. మాలాంటి కొత్తవారికి మీ మార్గదర్శనం అవసరం. ధన్యవాదాలు Newafrican (చర్చ) 06:42, 14 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నాగ భట్టు వ్యాసం తొలగింపు గురించి

వెంకటరమణ గారూ నాగభట్టు వ్యాసం గురించి నా దగ్గర ఇంకా సమాచారం ఉంది. వ్రాస్తాను. వ్యాసం తొలగించవద్దు అండి. నేను ఆ సమాచారం విజేత బుక్ లో చూసాను మూలం ఆ పుస్తకం పేరు,పేజీ నెంబరు మూలంగా పెట్టవచ్చా.. Ch Maheswara Raju (చర్చ) 15:57, 1 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

బిరుదురాజు శేషాద్రి రాజు

వెంకట రమణ గారూ బిరుదురాజు శేషాద్రి రాజు, వ్యాసం కి మూలాలు ఇచ్చాను. ఒక సారి చూడండి.. నేను వ్రాసిన కొన్ని వ్యాసాలకు మూలాలు ఇవ్వలేదు అండి. వాటికి మూలం ఇచ్చి మీరు పెట్టిన మూసలను తొలగించవచ్చా అండి. ధన్యవాదములు. Ch Maheswara Raju (చర్చ) 09:09, 4 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Ch Maheswara Raju గారూ,బిరుదురాజు శేషాద్రి రాజు వ్యాసంలోని నిర్వహణ మూసను తొలగించాను. వికీకరించాను. మీరు రాసిన వ్యాసాలను సరైన రీతిలో వర్గీకరించండి. సరైన మూలాలను (అంతర్జాల, పుస్తక వంటివి) చేర్చండి. --కె.వెంకటరమణచర్చ 09:29, 4 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సరే వెంకట రమణ గారూ. మూలాలు ఇచ్చిన తరువాత మూసలను తొలగించండి. ధన్యవాదములు. Ch Maheswara Raju (చర్చ) 10:03, 4 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

బులుసు సాంబమూర్తి గారి గూర్చి ఆంగ్లములో ఉన్న ప్రతికి లింకును అమర్చుట

ఆర్యా మీరు చేసిన సవరింపుకు కారణము నాకు అర్థము కాకయున్నది. నేను వికిపీడియాకి క్రొత్తగా వచ్చిన వాడను. దయ చేసి వివరము తెలుపగలరు.ధన్యోస్మి --11:44, 9 July 2019‎ Gotamiputta

నిర్వహణ గుర్తింపు

చురుకైన నిర్వాహకులు
వికీనిర్వహణలో ఆరుసంవత్సరాలకు పైగా నిరంతరాయంగా భాగం పంచుకుంటున్నందులకు అభివందనలు.-- అర్జున (చర్చ) 04:34, 3 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీ నిర్వహణకు గుర్తింపు పతకాన్నందించిన అర్జున గారికి ధన్యవాదాలు.--కె.వెంకటరమణచర్చ 15:17, 3 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Project Tiger 2.0

Sorry for writing this message in English - feel free to help us translating it

టెంపుల్ వ్యాసానికి సమాచార పెట్టె కూర్పు గురించి

వెంకటరమణ గారూ నమస్తే.

నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్ వ్యాసానికి సమాచారపెట్టె కూర్పు చేయవలసిందిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 14:48, 13 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ, నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్ వ్యాసానికి సమాచారపెట్టెను చేర్చితిని.--కె.వెంకటరమణచర్చ 15:30, 13 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు వెంకటరమణ గారూ..--యర్రా రామారావు (చర్చ) 15:33, 13 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Add my village in Wikipedia

Hi sir my name is satheesh Kumar I am from ChinnaYarasala Harijanawada in kadapa district, Andhrapradesh I want to add my village in Wikipedia article please help me sir write a one article my village please sir I am submitting References please sir ChinnaYarasala Harijanawada (చర్చ) 08:49, 6 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

రెస్పెలెండెట్ క్వెట్జల్ మూలాలు గురించి

వెంకట రమణ గారూ రెస్పెలెండెట్ క్వెట్జల్ వాస్యం కి మూలాలు ఇచ్చాను. మీరు పరిశీలించి మూసను తొలిగించండి. అలాగే నేను కొన్ని వ్యాసాలకు మూలాలు ఇవ్వలేదు వాటికి కూడ మూలాలు ఇచ్చి అక్షరదోషం ఏమైనా ఉంటే సవరిస్తాను. ధన్యవాదములు. Ch Maheswara Raju (చర్చ) 13:26, 28 నవంబర్ 2019 (UTC)

మూస తొలగించడమైనది.--కె.వెంకటరమణచర్చ

అమ్మ ఒడి పథకం గురించి

వెంకట రమణ గారు అమ్మ ఒడి పథకం వాస్యం కి మూలాలు ఇచ్చాను. మీరు పరిశీలించి మూసను తొలిగించండి. Ch Maheswara Raju (చర్చ) 07:13, 4 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మూస తొలగించడమైనది.--కె.వెంకటరమణచర్చ

వెంకట రమణ గారు అమలాపురం గడియార స్తంభం సెంటర్ మూలాలు ఇచ్చాను. మీరు పరిశీలించి మూసను తొలిగించండి. Ch Maheswara Raju (చర్చ) 10:49, 10 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలు చేర్చినందున మూస తొలగించడమైనది.--కె.వెంకటరమణచర్చ

నాగులపల్లి సీతారామయ్య వ్యాసం అనువదించుట గురించి

వెంకటరమణ గారూ సీతారామయ్య స్వాతంత్ర్య సమరయోధుడు అని తెలుస్తుంది.దీనిని పూర్తిగా ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించి,సరియైన మూలాల లంకెను చేర్చగలరు.--యర్రా రామారావు (చర్చ) 15:51, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ వ్యాసాన్ని విస్తరిస్తాను.--కె.వెంకటరమణచర్చ 16:39, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీ అనువదించడమైనది.--కె.వెంకటరమణచర్చ 14:28, 20 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Request

Hello.

Can you remove the private Turkish airline AtlasGlobal - in case it is present - in the జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం article? The airline went bankrupt yesterday and there are no longer any flights between Turkey and Armenia. Here is one source out of many: https://ftnnews.com/news-from-turkey/38827-atlasglobal-goes-bankrupt-ceases-operations You can check the internet for this news as well.

Yours sincerely, Sondrion (చర్చ) 17:10, 13 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు సృష్టించిన ఈ వ్యాసాలు పరిశీలించండి

వెంకటరమణ గారు నమస్కారం.ముందుగా క్షమించాలి.తెలుగు వికీపీడియాకు మీ సేవలు మరువరానివి.ఈ దిగువ వివరింపబడిన వ్యాసాలు మంచి ఆలోచనతో సృష్టించారు.కానీ వీటిలో కొన్ని చాలాకాలం నుండి ఆంగ్లభాషలోనే ఉన్నవి.కొన్ని వివిధ కారణాలతో వికీపీడియా నిర్వహణ మూసలు తగిలించబడినవి.

దయచేసి వాటిని వారం రోజులలో అనువదించి అనువదించ వలసిన పేజీలు వర్గం నుండి తప్పించగలందులకు కోరుచున్నాను. లేకపోతే అవి తొలగించబడునని తెలియజేయటానికి చింతిస్తున్నాం. బహుశా వాటిని గమనించిఉండరని అనుకుంటున్నాను.--యర్రా రామారావు (చర్చ) 02:27, 26 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారు, నాకు వికీలో పనిచేయడానికే సమయం దొరకడంలేదు. అందులోనూ ఇన్ని వ్యాసాలను ఒక వారంలోపు అనువాదం చేయమంటే ఎలా సార్. ఇప్పుడే గుర్తించారు కదా. కొంత సమయం ఇవ్వండి. అనువాదం కాని పూర్తి ఆంగ్ల వ్యాసం అయితే తొలగించండి. మొలక స్థాయి దాటిన తెలుగు అనువాదం జరిగినపుడు వాటిని ఎలా తొలగిస్తారు? వాటిలో కావాలంటే తొలగింపు మూసను ఉంచి సముదాయం నిర్ణయం మేరకు తొలగించండి.--కె.వెంకటరమణచర్చ 15:12, 26 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారూ ఎంతమాట అనేసారు.ముందు మనం చేసే వృత్తికి న్యాయం చేయాలి.తరువాత ప్రవృతికి. మీకు గడువు విధించటం నాతెలివితక్కువ పని. అది మాములుగారాసిందే!మీరు కావాల్సినంత టైం తీసుకొని నిరభ్యంతరంగా సరిదిద్దండి.తొలగించేటప్పుడు ఎవరమైనా వికీపీడియా నియమాలు పాటించవలసిందేనని మనందరకు తెలిసిన విషయమే.నాపై మీకు కలిగిన నమ్మకంతో, నన్ను నిర్వాహకత్వ భాధ్యతలకు ప్రతిపాదించారు.మీపై నాకు ఎప్పడూ గౌరవమే.నేను మీ స్పూర్తితో నిర్వహకుని భాధ్యతలు నెరెవేర్చటంలో భాగంగానే నడుచుకుంటున్నా గానీ, ఇందులో ఎవరిని ఎత్తి చూపటానికి మాత్రంకాదని సవినయంగా తెలుపు చున్నాను. పెద్ద మనసుతో అర్థం చేసుకొనగలరు. --యర్రా రామారావు (చర్చ) 16:48, 26 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ, మీ అభిమానానికి కృతజ్ఞతలు. వ్యాసాల నణ్యత పెంచడానికి, వికీపీడియా అభివృద్ధికి మీరు చేస్తున్న కృషికి అభినందనలు. మీరు చొరవ తీసుకొని ఈ వ్యాసాలను గుర్తించినందున అనువాదం జరుగుతున్నాయి. లేక పోతే ఎంతకాలమైనా వాటిలో ఎటువంటి మార్పు ఉందదు. మీరు పైన తెలియజేసిన వ్యాసాలను అనువాదం పూర్తి చేస్తున్నాను. అనువాద మూసలను తొలగిస్తున్నాను. వికీపీడియాలో వ్యాసాల నాణ్యత పెంచే దిశగా కృషిచేస్తున్న మీకు అభినందనలు. --కె.వెంకటరమణచర్చ 17:39, 27 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పై వ్యాసాలపై నా కృషి

యర్రా రామారావు గారూ, మీరు తెలియజేసిన అనువాద వ్యాసాలన్నింటినీ అనువాదం చేసితిని. మీ సూచనల వల్ల ఎంతకాలమైనా ఇలానే ఉండాల్సిన ఈ వ్యాసాల నాణ్యతను పెంచడానికి కృషిచేసాను. మీరందించిన ప్రేరణకు ధన్యవాదాలు.--కె.వెంకటరమణచర్చ 11:05, 20 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారూ మీరు వృత్తిపరంగా ఎంతవత్తిడి పనులున్ననూ, నా సూచనను మన్నించి, వెంటనే స్పందించి అన్ని వ్యాసాలు అనువదించి, తెవికీ నాణ్యతకు కృషి చేస్తునందుకు మీకు మరొకసారి శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కృతులు తెలుపుచున్నాను.మీరు చేసిన కార్యక్రమం అందరికి మార్గదర్శకంగా ఉండగలదని భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 11:23, 20 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మూస:Infobox airportలో మార్పుల గురించి

వెంకటరమణ గారూ పై మూసలో Owner/Operator స్థానంలో యజమాని/కార్యనిర్వాహకుడు కనిపించడానికి నేను పై మూసను సవరించడానికి విఫల ప్రయత్నం చేశాను. దయచేసి మీరు సవరించ గలరా? చూడండి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. --స్వరలాసిక (చర్చ) 07:36, 26 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

స్వరలాసిక గారూ, సంబంధిత మూసలో సరిచేసితిని.--కె.వెంకటరమణచర్చ 14:55, 26 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు--స్వరలాసిక (చర్చ) 15:24, 26 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసంగా కనువూరు విష్ణురెడ్డి

కనువూరు విష్ణురెడ్డి వ్యాసానికి ఈ వారం వ్యాసపు అర్హత ఉందని భావించి, ఆ జాబితాలో చేర్చాను. మీతో సంప్రదించడం మరచాను. పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 07:10, 4 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు ఈ వారం వ్యాసంగా పరిగణించినందుకు ధన్యవాదాలు. ముఖ్యమైన, విస్తరించిన వ్యాసాలను ఎవరైనా ఈ వారం వ్యాసంగా పరిగణించవచ్చు గదా. దీనికి సంప్రదించవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను.--కె.వెంకటరమణచర్చ 07:21, 4 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అవుననుకోండి. కానీ ఒంటిచేత్తో మొదటిపేజీ పనిని సమర్ధించుకుంటూ వస్తున్నారు, మీకు చెప్పడం ధర్మం. __చదువరి (చర్చరచనలు) 07:24, 4 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

"మరియు"ల ఏరివేత

ప్రధాన పేరుబరిలో "మరియు" లను పూర్తిగా ఏరివేసాం. ఇదొక ప్రాజెక్టు కాకపోయినా, ప్రాజెక్టు లాగానే తీసుకుని అందరం ఎవరి వంతు పని వాళ్ళం చేసాం. దాదాపు రెండేళ్ళ కిందటే నేను అనుకున్నా గానీ పెద్దగా ముందుకు కదల్లేదు. అందరం కలిసి చేసాం కాబట్టే అవగొట్టాం. ఇది మరొక సాముదాయిక కృషి. అభినందనలు, ధన్యవాదాలు సార్. __చదువరి (చర్చరచనలు) 01:13, 23 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మొక్కల వర్గీకరణ పట్టిక

నమస్కారం సార్! మొక్కల వర్గీకరణ పట్టిక తయారు చేయగలరా? -నాయుడు గారి జయన్న (చర్చ) 15:17, 29 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నాయుడు గారి జయన్న గారూ, మొక్కల వర్గీకరణకు సంబంధించిన ఏదైనా లింకును పంపగలరు. --కె.వెంకటరమణచర్చ 15:17, 2 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం సార్! సమగ్రమైన, ప్రమాణయుత వర్గీకరణ అంతా ఒక దగ్గర దొరకటం లేదు సార్. మీ స్పందనకు ధన్యవాదాలు.-నాయుడు గారి జయన్న (చర్చ) 09:09, 3 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకట రమణ గారికి, నా డేటా మీరు తొలగించారా. అది సరైన చోట లేనట్లయితే, దయచేసి అది ఎక్కడ ఉండాలో అక్కడకు ట్రాన్సఫర్ చేయగలరు - బొల్లోజు బాబా

బొల్లోజు బాబా గారూ, మీరు "బల్లోజు బాబా" వ్యాసాన్ని "వర్గం:తెలుగు కవులు" లో చేరుస్తున్నందున తొలగించాను. దానిని సరైన పుటలోకి బదిలీ చేస్తాను.--కె.వెంకటరమణచర్చ 13:00, 10 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు వర్గం:తెలుగు కవులు లో చేర్చిన అంశాలను, బొల్లోజు బాబా వ్యాసంలోకి బదిలీ చేసాను. మీ వ్యాసం మీరు రాసుకోరాదు. అందుకని ఏవైనా విషయాలు చేర్చాలంటే మూలాలతో సహా మాకు పంపించండి నేను ఆ వ్యాసంలో చేరుస్తాను. మీ చిత్రాన్ని, మీరు ప్రముఖులతొ ఉన్న చిత్రాలను, పురస్కార చిత్రాలను కూడా చేర్చండి.--కె.వెంకటరమణచర్చ 14:21, 10 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
థాంక్యూ వెంకటరమణ గారు.15:16, 10 April 2020Bollojubaba talk contribs block

1508 వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను. The proposed deletion notice added to the article should explain why.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. రహ్మానుద్దీన్ (చర్చ) 13:45, 11 ఏప్రిల్ 2020 (UTC) రహ్మానుద్దీన్ (చర్చ) 13:45, 11 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతం విషయం లేనందున తొలగించాను. కె.వెంకటరమణ (చర్చ) 12:35, 25 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

స్వయం ప్రకాశకాలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను. The proposed deletion notice added to the article should explain why.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. రహ్మానుద్దీన్ (చర్చ) 13:45, 11 ఏప్రిల్ 2020 (UTC) రహ్మానుద్దీన్ (చర్చ) 13:45, 11 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతం విషయం లేనందున తొలగించాను. కె.వెంకటరమణ (చర్చ) 12:35, 25 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చెంగల్వ పూదండ (నాటిక) వ్యాసంకి మూలాలు చేర్చాను

వెంకటరమణ గారు చెంగల్వ పూదండ (నాటిక) వ్యాసానికి అంతర్జాలంలో లభించిన 5 మూలాలను చేర్చాను. ఇంకా ఏవన్నా మూలాలు దొరికితే ఎప్పటికప్పుడు చేరుస్తుంటాను. ఒకసారి పరిశీలించగలరు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 11:00, 25 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలు చేర్చినందున {{మూలాలు లేవు}} మూసను తొలగించితిని. కె.వెంకటరమణ (చర్చ) 12:36, 25 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Hello Sir, It has been proposed to delete this Article TupperWear from Telugu Wikipedia. I dont understand the reason behind this, though the Article exceeds 2KB in size. I request you not to delete article, which are over 2 KB size, instead, you can ask the writers to improve the article. if you start deleting such articles, All our years of time and hard work will go into vain. Hope you understand.

Apologies for typing in English, as your Talk page is not allowing me to type in Telugu, using Chrome Browser. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:18, 29 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారూ, వ్యాసాన్ని విస్తరించినందున తొలగింపు మూసను తొలగించాను. కె.వెంకటరమణ (చర్చ) 12:12, 29 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

టాస్క్ బార్ తయారు గురించి

వెంకటరమణ గారూ నాపేరుతో టాస్కబార్ ఒకటి తయారుచేసి ఇవ్వగలరా?ఇది మీదానినిబట్టి చేసాం, కానీ మాకు కుదరలేదు ఇది మీ పేరుకు దారి మార్పు అవుతుంది.--యర్రా రామారావు (చర్చ) 17:52, 29 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
తరువాత చేసి ఇస్తానండీ. కె.వెంకటరమణ (చర్చ) 18:09, 29 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేలెండి.మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడే తయారు చెయ్యండి.ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 18:15, 29 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రామారావు గారూ, మీరు తయారుచేసిన taskbar ను కొన్ని మార్పులు చేసి, సరిచేసాను. వాడుకరి:యర్రా రామారావు/TASKBAR చూడండి. అందులో ఏవైనా కొత్త ఐకన్లు చేర్చాలంటే తెలియజేయండి. లేదా చేర్చండి. కె.వెంకటరమణ (చర్చ) 08:49, 30 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారూ అవసరముంటే సంప్రదించగలను. ధన్యవాదాలు--యర్రా రామారావు (చర్చ) 09:43, 30 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వెబ్ సర్వీస్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

Hello Sir, I dont know why you are running behind the articles to delete, which exceeds 2KB of size. You know how difficult it is to create a new article, rather deleting it. it will take seconds to delete an article, but it will take days to develop the same. I see you are targetting some articles above 2 KB. as you are admin, take whatever decision you want.

వెబ్ సర్వీస్ Article is expanded with additional information. if you feel that it is eligible to retain, keep it else delete it. Thanks, --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:43, 30 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారూ, వికీలో అనేక సంవత్సరాల తరబడి మూలాలు లేకుండా, మొలకలుగా, ఏక వాక్యాలుగా, మూస మాత్రమే ఉండి సమాచారం లేని, అర్థంకాని గూగుల్ అనువాద వ్యాసాలను వికీనియమాల ప్రకారం తొలగించాల్సిఉంది. వాటిలో కొన్నింటిని ప్రాజెక్టు లో భాగంగా విస్తరించాము. కొన్నింటిలో తొలగింపు మూసలుంచాము. 20 కె.బి కన్నా తక్కువ ఉండి, మూలాలు లేని వ్యాసాలను తొలగింపునకు ప్రతిపాదిస్తున్నాను. వాటిని విస్తరిస్తే తొలగించవలసిన పనిలేదు. మీరు విస్తరించారు కనుక తొలగింపు మూసను కూడా తొలగిస్తాను. 20 కె.బి కన్నా ఎక్కువ ఉన్నా సరే సరైన మూలాలు, అంతర్గత లింకులు ఉండాలి కదా. కె.వెంకటరమణ (చర్చ) 07:07, 1 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు విస్తరించిన దేవులపల్లి వెంకటేశ్వరరావు పేజీలో లోక్ సభ నియోజకవర్గం నుండి తెచ్చిన బొమ్మను చేర్చాను. ఇతడు పార్లమెంటు సభ్యుడైనట్లు వ్యాసంలో లేదు. వీరు ఒకరేనా కాదా; నిర్ధారించండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 14:31, 8 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

విస్తరించినా తొలగించిన వ్యాసాలను పునరుద్ధరించండి

  • వీడియో గేమ్ - విస్తరించిన వ్యాసాన్ని తొలగించారు. మళ్ళీ సృష్టించి విస్తరించాను. మళ్ళీ తొలగించారు.
  • సూసైడ్ నోట్ - తొలగింపు మూసకు ముందే నాలుగు లైన్ల సమాచారం ఉంది, అయినా తొలగించారు, మళ్ళీ సృష్టించి విస్తరించాను, మళ్ళీ తొలగించారు.
  • సమాధి - సమాధి వ్యాసంలో తక్కువ సమాచారం ఉందని నాకు సూచన వచ్చిన రోజునే దానిని నేను విస్తరించాను. అయినా తొలగించారు.
  1. వెంకటరమణ గారూ నమస్కారం, నేను విస్తరించిన వ్యాసాలు కూడా తొలగింపుకు గురి అయినాయి, కావున వాటిని పునరిద్ధరించండి.YVSREDDY (చర్చ) 03:59, 10 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
YVSREDDY గారూ, మీ అభ్యర్థన మేరకు ఆ వ్యాసాలను పునరుద్ధరించాను. దయచేసి వ్యాసాలలో మూలాలు చేర్చి సహకరించండి. కె.వెంకటరమణ (చర్చ) 04:05, 10 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కవి గారూ! అభినందనలు

మీరు భౌతిక రసాయన శాస్త్రంలో ఉద్దండులని తెలుసు గాని, పాండిత్యంలోనూ ప్రకాండులని మీ కంద పద్యం చూశాకా తెలిసింది. 2,4 పాదాలలో యతిమైత్రి (హల్లు కన్నా అచ్చు ప్రధానం ) తప్పించి, పద్యమంతా బాగుంది. కందం రాసిన వాడే కవి అనే మాటను సార్థకం చేసుకున్న మీకు శుభాభినందనలు. --నాయుడు గారి జయన్న (చర్చ) 17:33, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నాయుడు గారి జయన్న గారూ, నేనేం కవిత్వం రాయగలనండీ. నేను భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడను. గత ఏడున్నర సంవత్సరాలుగా వికీ ప్రయాణంలో లక్ష దిద్దుబాట్లు చేసి, అనేక వ్యాసాలను సృష్టించి, అనేక దోష భూయిష్టమైన భాషానువాదాలను శుద్ధిచేసే క్రమంలో నిరంతరం కొందరు రాసిన పదాలను నిఘంటువులలో వెదుకుతున్నందున, కవుల వ్యాసాలలో సమాచారం దొరక్క వారు రాసిన గ్రంథములను ఆర్చివ్స్ లో చూసి వారు తమ కోసం రాసిన పద్యములను వికీ శైలికి మార్చే క్రమంలో కొన్ని పదములు పరిచయమైనాయి. నిరంతరం వికీ వ్యాసాలు, పదాలు, నిర్వహణ కార్యక్రమాలు మదిలో తిరుగుతుండగా తెవికీ వ్యాధి వచ్చినట్లుంది. నవగ్రహాలు ఎప్పటికో ఒకసారి ఒక సరళరేఖా మార్గంలో వచ్చినట్లు, ఈ పదాలు నిరంతరం నాలో తిరిగి ఎప్పటికో ఒకసారి ఒక పద్యంగా మారుతున్నాయంతే! కె.వెంకటరమణ (చర్చ) 01:09, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించబడిన వ్యాసాలలో మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలి

Pranayraj Vangari గారూ,కె.వెంకటరమణ గారు, నమస్కారం, ప్రస్తుతం ఏ వ్యాసంను మొలక స్థాయి దాటించి వ్రాయగలనో లేదో నాకు తెలియదు, కావున ఏదైనా వ్యాసం తొలగిస్తే మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలనేది నాకు తెలియదు కావున వివరిస్తే వికీ నియమాల ప్రకారం తొలగించిన వ్యాసాన్ని సృష్టిస్తాను. తొలగించబడిన వ్యాసాలను ఎలా ప్రారంభించాలో తెలిపే తెలుగు సమాచారం ఉన్న లింకు ఇస్తే అక్కడి నియమాల ప్రకారం మాత్రమే తొలగించబడిన వ్యాసాలను ప్రారంభిస్తాను. ఎవరికైనా వికీ నియమాలు తెలియకపోతే, ముఖ్యంగా నాకు వికీ నియమాలు తెలియనందున (నాకు నిజంగా తెలియదు) వికీ నిర్వాహకులైన మీకు వికీ నియమాలను వివరించవలసిన బాధ్యత వుంది. YVSREDDY (చర్చ)
YVSREDDY గారూ, మీకు నియమాలు తెలియక పోవడం ఏమిటి? మీరు తెలుగు వికీపీడియాలో 2011 అక్టోబరు 30 నుండి వ్యాసాలు రాయడం మొదలుపెట్టి 2314 వ్యాసాలను రాసారు. అన్ని వ్యాసాల సరాసరి పేజీ సైజు 1.32 కె.బి మాత్రమే. దీనిని బట్టి మీరు ఎన్ని వేల మొలక వ్యాసాలు సృష్టించారో తెలుస్తుంది. ఈ మొలక వ్యాసాల గూర్చి నియంత్రణ విధానం ఈ మొలక వ్యాసాలపైనే చర్చలో భాగంగా జరిగిందని మీకు తెలియదా? వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 18 , వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 17 లలో మీ వ్యాసాల గురించి విపరీతమైన చర్చ జరిగిందని మీకు తెలియదా? సీనియర్ వాడుకరులందరూ మీకు సలహాలు ఇవ్వలేదా? అన్నీ తెలిసి నియమాలు గురించి తెలియదంటున్నారు. ఏమనుకోవాలండీ. ఆ రచ్చబండ చర్చల మూలంగానే కదా ఈ మొలకల నియంత్రణ విధానం ప్రారంభమైంది. ఈ నియంత్రణ విధాన ఏర్పాటుకు మూలమైనది మీ వ్యాసాలపై చర్చ కాదా? మీకు వ్యాసాలు ఎలా రాయాలో తెలియదంటే నమ్మమంటారా? అనేక మంది నిర్వాహకులు నిర్వాహణ మూసలు ఉంచినపుడు మీరేమి స్పందించడం లేదు. తొలగింపు చర్చలలో పాల్గొనాలని తెలియదా? నిర్వాహకుల కంటే ఎక్కువ నియమాలు తెలిసినవారు మీరు. మీరు రాసిన వ్యాసాలను మొలక స్థాయి దాటించడమే కాకుండా అందులో మూలాలను చేర్చడం, వ్యాసంలోని వివిధ పదాలకు ఇతర వ్యాసాలకు లింకులు ఇవ్వడం. మీరు రాస్తున్న వ్యాసానికి ఇతర వ్యాసాలనుండి లింకు లుండాలని తెలియదా? పై రచ్చబండ లింకులలోని అంశాలను ఎవరైనా చదివితే వికీపీడియాలో మీకున్న పరిజ్ఞానం అర్థమవుతుంది. కనుక మీరు సృష్టించిన వ్యాసాల అభివృద్ధికి కృషి చేయగలరు. ఒక వ్యాసాన్ని మొలకలనియంత్రణ విధానాన్ని అడ్డు పెట్టుకొని విస్తరించడానికి సమాచారం ఉన్నా 2000 బైట్లకు చేర్చి వదిలేస్తున్నారు. వికీలో క్రియాశీలక సభ్యులు తక్కువగా ఉన్నందున మీ వ్యాసాలను ఎవరూ అభివృద్ధి చేయరు. మీరు రాసిన ఏకవాక్య మొలక వ్యాసాలు తొలగిస్తే మంచి వ్యాసాలుగా తీర్చిదిద్దడానికి ఎవరైనా ముందుకు వస్తారు. మీకు వ్యాసకర్తగా ఉండాలనే కోరిక ఎలా ఉంటుందో నూతన సభ్యులకు కూడా అలానే ఉంటుంది. కనుక మీరు అభివృద్ధి చేయనిచో ఏక వాక్యాల వ్యాసాలు తొలగించబడతాయి. మీరు తొలగించకూడదని భావిస్తే మీరు ఆ వ్యాసాల చర్చా పేజీలో చర్చించండి. కె.వెంకటరమణ (చర్చ) 07:15, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Sir please add lalitha sahasranamam from 701 to 1000

Please Prasanna.theoria (చర్చ) 09:40, 22 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]