వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెద్ద గారి సలహా[మార్చు]

ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము తెలుగు సినిమాలు అన్నింటికీ పేజీలు తయారు చేయడము. 1931లో విడుదలయిన మొట్టమొదటి తెలుగు సినిమా భక్తప్రహ్లాద నుండి ఇటీవల విడుదలవుతున్న సినిమాల దాకా అన్ని సినిమాల గురించి సమాచారాన్ని సేకరించి వికీపీడియాలో నిక్షిప్తం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.నాకు నచ్ఛిన సినిమాలు భూమి కోసం, అంకురం , మిస్సమ్మ, మాయాబజారు, గుండమ్మకధ, దేవదాసు, కన్యాశుల్కం , ముత్యాలముగ్గు, సాగరసంగమం , లిటిల్ సోల్జర్స్, ఆకాశమంత ఎన్ని సార్లు చూసినా చూడాలని పిస్తాయి.--Pedda (చర్చ) 17:03, 13 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సినిమా వేదిక[మార్చు]

నేను యూత్ లో ఉన్నప్పుడు కేవలం సినిమా వ్యాసాలు మాత్రమే వ్రాసేవాడిని. అప్పట్లో నా హీరోయిజం ఉపయోగించి వేదిక:తెలుగు సినిమా చేశాను. తర్వాత జాబ్ పై కనీసం కొద్దిగా అన్నా కాంసంట్రేట్ చేద్దామనుకోవటం, నేను భూటాన్ ఆన్-సయిట్ వెళ్ళిపోవటం వలన దానిని అప్-డేట్ చెయ్యలేకపోవటం జరిగిపోయాయి. ఈ మధ్య కామెడీగా మళ్ళీ అప్-డేట్ చేస్తున్నానుకొండి. ఇవ్వాళ మరల తెలుగు సినిమా గురించి నాకు ఆహ్వానం వచ్చినందున ఇలా వ్రాస్తున్నాను. నేను ఇతర వ్యాసాలు కూడా వ్రాస్తున్నాను. సో, ఒక్కోసారి, వేదికని అప్-డేట్ చెయ్యలేకపోతున్నాను. కాబట్టి సైడ్-క్యారెక్టర్ లు ఎవరయినా నా వేదికకొచ్చి, నా నట్టింటికొచ్చి, కత్తులు కటార్లతో కాకుండా అప్-డేట్లతో చంపగలిగితే బావుంటుందని నా థాట్. ఏమంటారు?శశి (చర్చ) 23:48, 12 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పేర్ల విషయంలో స్పష్టత కోసం[మార్చు]

కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.

తెలుగు సినిమాలు ప్రాజెక్టు కింద కొన్ని వేల పేజీలు తయారయ్యాయి, అవుతున్నాయి. వీటి పేర్ల ఆకృతి విషయంలో కొన్ని సందిగ్ధతలు ఉన్నాయి. వాటిని కింద వివరిస్తాను

  1. ప్రాజెక్టు పేరు : ఈ ప్రాజెక్టు పేరు "తెలుగు సినిమాలు" అని ఉంది. ఈ పేరు కేవలం సినిమాల గురించి మాత్రమే సూచిస్తున్నట్టుగా ఉంది. తెలుగు సినిమా గురించిన ఇతర విషయాలైన చరిత్ర, సాంకేతిక అభివృద్ధి, నటీనటులు, దర్శకుల వంటి వక్తులు, సంగీతం వంటి అనేక ఇతర విషయాలను "తెలుగు సినిమా" అనే పేరు ప్రతిబింబించినంతగా "తెలుగు సినిమాలు" అనే పేరు చూపడం లేదు.
  2. అలాగే వర్గం:తెలుగు సినిమాలు, వర్గం:తెలుగు సినిమా అనే రెండు వర్గాలను పై విశ్లేషణ ప్రకారం పరిశీలించాలి.
  3. "సినిమా" కు ఉన్న పేర్లు: సినిమాను సినిమా అని, చిత్రం అని, చలన చిత్రం అనీ మూడు పేర్లతో పిలుస్తూ మూడు రకాలైన పేజీలను సృష్టిస్తూ ఉన్నాం ఉదాహరణకు:
    1. భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా, తెలుగు సినిమా చరిత్ర, తెలుగు బాలల చిత్రాలు
    2. వర్గం:సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రాలు, వర్గం:వంశీ దర్శకత్వం వహించిన సినిమాలు‎‎, వర్గం:భారతీయ చలనచిత్రాలు
  4. వర్గం:తనికెళ్ళ భరణి చిత్రాలు‎ వంటి వర్గాలున్నాయి - అవి నటించిన చిత్రాలా, రచించిన చిత్రాలా, మాటలు రాసిన చిత్రాలా, దర్శకత్వం చేసిన చిత్రాలా, లేక అన్నీ కలిసినవా అనే విషయం తెలీడం లేదు.
  5. వర్గం:తెలుగు డబ్బింగ్ సినిమాలు‎ తెలుగు లోకి డబ్బింగు చేసినవా, తెలుగు నుండి డబ్బింగు చేసినవా అనే వివరం ఈ పేరు ద్వారా తెలీడం లేదు.

ఇలాంటివి ఇంకా ఉండి ఉండవచ్చు. వాడుకరులు ఈ విషయాన్ని చర్చించి, ఇంకా చేర్చవలసిన ఇలాంటి సమస్యలుంటే చేర్చి, తగు నిర్ణయం తీసుకునేందుకు దోహద పడాలని కోరుతున్నాను. __ చదువరి (చర్చరచనలు) 15:36, 22 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]