వీణ వేణువైన సరిగమ విన్నావా (పాట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పాట ఇంటింటి రామాయణం చిత్రం లోనిది. రంగనాథ్, ప్రభ అభినయించారు. గాత్రం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి. సాహిత్యం: వేటూరి సుందరరామ్మూర్తి. సంగీతం: రాజన్-నాగేంద్ర

పాటలోని సాహిత్యం[1][మార్చు]

వీణ వేణువైన సరిగమ విన్నావా
తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల, చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలీవేళలో

ఊపిరి తగిలిన వేళ, నే ఒంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే పలికే రాగమాల
చూపులు రగిలిన వేళ, ఆ చుక్కలు వెలిగిన వేళ
నా తనువునా అణువణువునా జరిగే రాసలీల
||వీణ వేణువైన||

ఎదలో అందం ఎదుట, ఎదుటే వలచిన వనిత
నీ రాకతో నా తోటలో, వెలసే వనదేవత
కదిలే అందం కవిత, అది కౌగిలి కొస్తే యువత
నా పాటలో నీ పల్లవే నవత, నవ్య మమత
||వీణ వేణువైన||

మూలాలు[మార్చు]

  1. "veena venuvaina sarigama - Lyrics and Music by బాలు, జానకి(తెలుగు లిరిక్స్) arranged by krkvijju". Smule (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-21.

బాహ్య లంకెలు[మార్చు]