వెనిస్
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
వెనిస్ ఇటలీ దేశంలో గల ఒక నగరం పేరు. ఇది నీటిపై తేలియాడే నగరం గా ప్రసిద్ధి గాంచింది. ఇటాలియన్ భాషలో ఈ నగరం పేరు Venezia, Venesia లేదా Venexia. ఇది ఇటలీ ఉత్తర భాగంలో ఉన్న నగరం. వెనిటో అనే విభాగానికి పాలనా కేంద్రం. 2004లో ఈ నగరం జనాభా 271,251. ( పాడువా పట్టణంతో కలిపి). వెనిస్ నగరానికి "La Dominante", "Serenissima", "Queen of the Adriatic", "City of Water", "City of Bridges", మరియు "The City of Light" అని వివిధ వర్ణనాత్మక నామాలున్నాయి. ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరాలలో ఒకటగా వెనిస్ పేరు పొందింది. [1] వెనిస్ నగరం ఏడ్రియాటిక్ సముద్రంలో 118 చిన్న దీవుల, మరియు వెనీషియన్ లాగూన్ యొక్క సముదాయం. ఈ లాగూన్ దక్షిణాన పో మరియు ఉత్తరాన పియావె అనే నదుల మధ్య విస్తరించి ఉంది.
ఐరోపా చరిత్ర మధ్యయుగంలోను, రినసాన్స్ కాలంలోను, క్రూసేడులు కాలంలోను "వెనీషియన్ రిపబ్లిక్ చాలా ముఖ్యమైన నౌకాబలం కలిగిన దేశం. అప్పటిలో సిల్కు, ధాన్యం, సుగంధ ద్రవ్యాలు వర్తకానికి ఈ నగరం కేంద్రంగా ఉండేది. 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం చివరి వరకు ఇది కళలకు కేంద్రంగా వర్ధిల్లింది.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
వెనిస్ ను క్రీ.శ 421 ప్రాంతంలో నిర్మించారు. ఇది మొదట్లో ఉప్పు తయారీ కేంద్రం. తర్వాతి రోజుల్లో పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. పద్నాలుగో శతాబ్దంలో అక్కడ రెండు లక్షల మంది నివాసం ఉండేవారు. కానీ 2100 మేరకు దీని ఉనికే ప్రశ్నార్థకం అవుతుందంటున్నారు పర్యావరణ వేత్తలు. 1966 లో వచ్చిన వరద తాకిడికి వెనిస్ లో నీటిమట్టం మీటరు ఎత్తుకు పెరిగింది. అప్పటి నుంచీ అక్కడి జనాభా తగ్గుతూ వస్తోంది.