వేదిక:ఫోటోగ్రఫి/పరిచయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫోటోగ్రఫీ పరిచయం

ఒక వస్తువుని చీకటి వెలుగుల మిశ్రమంలో కెమెరా గా పిలువబడే యంత్రంతో ఫిల్మ్ మీద ( ఇప్పుడు డిజిటల్ ఉపకరణములలో ) చిత్రీకరించే శాస్త్రాన్ని ఫోటోగ్రఫి అంటారు.ఇది ప్రపంచములో అందరికి ఉపయోగపడే శాశ్రీయమయిన కళ. చాయచిత్రీకరణకి కెమెరా,కటకాలు,ఫిల్మ్,ఎన్లార్జర్,ఫోటో పేపర్,రసాయనాలు,కాంతి లేదా వెలుతురు(సూర్య కాంతి),దీపాలు,విద్యుత్ శక్తి కావలసిన వనరులు.మానవుని జీవితాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన చక్రం,విద్యుత్శక్తి,ఫోన్,రైల్,విమానం లాగే ఫోటోగ్రఫీ కూడా అనటం అతిశయోక్తి కాదు.

అసలు ఫోటోగ్రఫి అనే పదం పురాతన గ్రీక్ పదాలయిన φως ఫోస్(light)మరియు γραφη graphê గ్రఫే ("stylus","paintbrush") లేక γραφω graphō గ్రఫో (the verb, "I write/draw"),రెండు పదాల కలయికతో వెలుతురుతో చిత్రీకరణ లేదా చిత్రీకరణ అని అప్పటి చిత్రకారులు పరిశోధకులు వాడటముతో ఫోటోగ్రఫి గా రూపాంతరం చెందింది. మొట్టమొదట ఛాయాచిత్రాన్ని(ఫోటోగ్రాప్)1826లో నేసెఫార్ నీప్సే (Nicéphore Niépce)అనే ఫ్రెంచ్ పరిశోధకుడు పెవటెర్ (pewter) అనే పల్లెరం మీద చిత్రీకరించాడు.పెట్రోలియం ఉప ఉత్పత్తి అయిన బిటుమేన్ మరియు జుడియా అని పిలువబడే రసాయనం ల మిశ్రమాన్ని పెవటెర్ అనే మెరుగు పెట్టిన పళ్లెం మీద పూసి ఈ ఘనకార్యాన్ని సాధించగాలిగాడు. డబ్బా కెమెరా (Box camera) తో రసాయనపూత పూసిన గాజు (glass) చాయచిత్ర సంగ్రకాల(photoplate) నుండి ఫిల్మ్ తో, ఇప్పుడు అత్యంత ఆధునిక డిజిటల్ కామేరాలతో కంటికి కనిపించని అత్యంత సూక్ష్మ కణాలని,కనిపించే అన్నిరకాలయిన వాటిని కంటికి కనిపించని కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోని గ్రహాలని కూడా చక్కగా సహజమయిన రంగులలో చిత్రీకరించే వరకు ఫోటోగ్రఫీ అభివృద్ది చెందింది. (మొత్తం వ్యాసం చూడండి)