Jump to content

శంకరంపేట (ఎ)

వికీపీడియా నుండి
శంకరంపేట్ రక్షక భట నిలయం

శంకరంపేట (ఎ), తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా, శంకరంపేట (ఎ) మండలానికి చెందిన జనగణన పట్టణం , రెవెన్యూ గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

రాణీ శంకరమ్మపేర ఏర్పడ్డ ఈ ఊరు కాలక్రమంలో శంకరం పేటగా మారింది.ఆ నాటి కట్టడాలైన గడి (కోట), చావిడి, దేవిడి ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి.గ్రామ విస్తరణ అనివార్యమైనందున ప్రహరీ మాయమైంది.

విశేషాలు

[మార్చు]

1930-40 దశకంలో గ్రామవాసి అయిన అనంత రామ శాస్త్రి ఇళ్లు ఒక బృహత్ గ్రంథాలయం, విద్యాలయంగా ఉండేది. చుట్టుప్రక్కల జిల్లాలనుండి వచ్చి ఆయన వద్ద సంస్కృతం, వేదం, జ్యోతిషం, సిద్ధాంతం ఉచితంగా అభ్యసించేవారట. 1958లోనే విజ్ఞాన వర్ధిని ఉన్నత పాఠశాల ప్రారంభింపబడింది. 1940వ దశకం నుండి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారి మిషన్ హాస్పిటల్ ఉన్నత ప్రమాణాలతో నిర్వహింపబడుతుంది.

శంకరంపేట చేనేత చీరలకు ప్రసిద్ధి. మగ్గాల చప్పుళ్లతో వీధులన్నీ మారుమ్రోగేవి. చేనేత సహకార సంఘం ఎంతో మంది బడుగు, బలహీన చేనేత కార్మికుల జీవితాలను బాగు చేసింది. కాలక్రమంలో ప్రభుత్వ అశ్రద్ధ, శీత దృష్టి కారణంగా చేనేత పరిశ్రమ కుంటుపడింది.

గ్రామంలో అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను ఆచరించే బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. గ్రామంలో శివ, రామ, గోపాలకృష్ణ మందిరాలు ఉన్నాయి.

స్వాతంత్ర్య సమర యోధులు, తామ్రపత్ర గ్రహీత, 1952 వ ఎన్నికల మొదటి శాసన సభ్యుడు వెంకట రాజేశ్వర జ్యోషి ఆధ్వర్యంలో ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు నిత్య చైతన్యంతో, క్రమశిక్షణతో ఉద్యమంలో పాల్గొనిన వారున్నారు.

1950లలో ప్రారంభమైన మనోరంజన్ టాకీస్ లో సినిమాహాలు ఉంది.

ప్రధానవృత్తి

[మార్చు]

రెండు పెద్ద చెరువులతో, మూడు కుంటలతో గ్రామం చుట్టూ సశ్య శ్యామలంగా ఉండే శంకరంపేటలో ప్రధానవృత్తి వ్యవసాయం. 1930 వ దశకంనుండే గురువారం సంత ద్వారా సరుకులను, పాడిపశువులను, ఎడ్లను రైతాంగానికి అందించింది.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు

[మార్చు]