Jump to content

సుబ్రహ్మణ్యస్వామి ఆలయం

వికీపీడియా నుండి

సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, దేవతలకు సేనాధిపత్యం వహించిన వాడు సుబ్రహ్మణ్యస్వామి. ఈ స్వామివారి క్షేత్రాలు దేశ వ్యాప్తంగా ఉన్నాయి.

అత్తిలిలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం

భక్తులు

[మార్చు]

స్వామివారి పరమ భక్తులు తమిళనాడులో ఎక్కువ. ఇక్కడ ఆలయాలు కూడా ఎక్కువే. తమిళనాడుకు ఆనుకుని వున్న చిత్తూరు జిల్లాలో కూడా ఈ స్వామి వారి భక్తులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా వీర భక్తులు. భక్తి పారవశ్యంలో ఆవేశానికి లోనౌతారు. వీపుకు శూలాలు/ కొక్కేలు గుచ్చుకొని ఆడడం, రెండు దవడలలో ఇనుప చువ్వలను గుచ్చుకొని ఆడడం, అలాగే బయటకు చాపిన నాలుక మధ్యలో సన్నని శూలం గుచ్చుకొని నాట్యం చేయడం, మొదలగు కార్యక్రమాలు వారి భక్తి పారవశ్యానికి మచ్చు తునకలు.

వీరు అదే విధంగా కావిళ్ల పండగ అని చేస్తారు. ఆ రోజున ఆడమగ, చిన్న పెద్ద తేడా లేకుండా అందరు దీక్ష వహిస్తారు. అది ఇప్పటి అయ్యప్ప దీక్ష వంటిది. ఆరోజు అందరు పసుపు బట్టలు ధరించి., నుదుటన వీభూతి ధరించి మధ్యలో గందం బొట్టు పెట్టి కావిడిని భుజాన వేసుకొని హరో హర అంటూ సుబ్రమణ్య స్వామి ఆలయానికి వెళతారు. ఎక్కువగా కాలి నడకన వెళతారు. కావిడి అంటే ఒక కర్రకు రెండు కొసలందు దారాలతో చిన్నని వెదురు బుట్టలను కట్టీ బుట్టలో పూజా ద్రవ్యాలు, నిమ్మకాయలు, వేస్తారు.. దీని కంతటికి పసుపు పూసి వుంటుంది. దాన్ని భుజాన వేసుకొని ఆవేశంగా "హరో హర మురుగా" అంటూ అరుస్తు వెళుతుంటారు. దీన్నే కావిళ్ల పండగ అని క్లుప్తంగా అంటారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఈ భక్తుల హడావుడి చాల ఎక్కువగా వుండేది. ఆ రోజుల్లో అయ్యప్ప భక్తులు తక్కువ. ఇప్పుడు అయ్యప్ప భక్తులు ఎక్కువయ్యారు. వీరి సంఖ్య తగ్గింది. తమిళ నాట మాత్రం ఇంకా మంచి ఊపులోనే ఉంది.

క్షేత్రాలు

[మార్చు]

తమిళనాట ఆరు సుబ్రమణ్య స్వామి క్షేత్రాలను చాల పవిత్రమైనవిగా బావిస్తారు. వీటిని షట్ సుబ్రమణ్యం క్షేత్రాలుగా పిలుస్తారు; అవి వరుసగా:

  • 1. తిరుప్పర కుండ్రం: ఈ క్షేత్రం మధురైకి సుమారు పది కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మిగతా ఐదు క్షేత్రాలకు భిన్నంగా సుబ్రమణ్యం స్వామి దేవేరి దేవసేన ఒక వైపు నారధ ముని ఒక వైపు వుంటారు.
  • 2. తిరుచెందూర్: సాధారణంగా సుబ్రమణ్యం క్షేత్రాలు కొండల పైన వుంటాయి. వాటికి భిన్నంగా ఇక్కడి ఆలయం సముద్రతీరాన ఉంది.
  • 3. పళణి: ఇది మూడో క్షేత్రం. ఇక్కడి మూల విరాట్ నవ పాషాణాలతో తయారు చేసిన అరుదైన విగ్రహం. ఇక్కడి స్వామి పదేళ్ల బాలునిగా కనిపిస్తాడు. ఒంటి మీద ఒక అంగ వస్త్రం మాత్రమే వుంటుంది. ఈ స్వామిని దండాయుద పాణిగా, బాల సుబ్రమణ్యంగా కొలుస్తారు భక్తులు. పళణిలో అరుదైన మరకత లింగం ఉంది. ఇక్కడ స్వామివారికి నివేదించిన పంచాంమృతాన్ని ప్రసాదంగా ఇస్తారు.
  • 4. స్వామిమలై: కుంబకోణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో వున్న క్షేత్రం ఇది. కార్తికేయుడు తన తండ్రి అయిన శివునికి "ఓంకార" ప్రాముఖ్యాన్ని భొదించాడని భక్తుల నమ్మకం. అలా మహా శివుడికే గురువుగా బోధనలు చేసిన షణ్ముకుణ్ణి ఇక్కడ స్వామినాదర్ గా కొలుస్తారు.
  • 5. తిరుత్తణి
  • 6. పళముదిర్ చోళై: ఈ క్షేత్రం మధురై పట్టణానికి ఉత్తరంగా సుమారు ఇరవై కిలో మీటర్ల దూరంలో ఉంది. వృషబాధ్రి అనే కొండపై అందమైన ప్రకృతి మధ్యన చిన్న ఆలయంలో కొలువై వున్నాడు స్వామి. ఈ కొండ పాద భాగంలో అళగర్ కోవెల ఉంది. ఇది విష్ణుమూర్తి కొలువైన 108 క్షేత్రాలలో ఒకటి. కొండమీద ఆలయంలో మురుగన్ స్థానక మూర్తిగ భక్తులకు దర్శనం ఇస్తుంటాడు. కొండ పైభాగాన నూపుర గంగ అనే ఒక జలపాతం ఉంది. ఈ జలపాతానికి సమీపంలో వున్న మండపంలో కూర్చునే తమిళ కవి ఇళంగోఅడిగళ్ "సిలప్పదిగారం" రచించాడని ప్రతీతి.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
  • (మూలం: ఈనాడు ఆదివారం: డిసెంబరు, 5, 2011)