సెంచురీలు కొట్టే వయస్సు మాది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పాటని ఆదిత్య 369 చిత్రం కోసం వేటూరి సుందరరామమూర్తి రచించారు. సంగీతం ఇళయరాజా. పాడినది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

<poem>

సెంచరీలు కొట్టే వయస్సు మాది బౌండరీలు దాటే మనస్సు మాది చాకిరీలనైనామజా మజావళీలు చేసి పాడు సోలో ఇక ఆడియోలో వీడియోలో చెలి జోడియోలో ||

మేఘమాలనంటుకున్న ఆంటెనాలతో మెరుపు తీగ మీటి చూడు తందనాలతో సందె పొద్దు వెన్నెలంటు చందనాలతో వలపు వేణువూది చూడు వందనాలతో చక్రవాక వర్ష గీతి వసంత వేళ పాడు తుళ్ళిపడ్డ ఈడు జోడు తుఫానులో కన్నె పిల్ల వాలుచూపు కరెంటు షాకు తిన్న కుర్ర వాళ్ళ ఈల పాట హుషారులో లైఫ్ వింత డాన్స్ లిఖించు కొత్త ట్యూన్స్ వున్నదొక్క ఛాన్స్ సుఖించమంది సైన్స్ వాయులీన హాయి గాన రాగ మాలలల్లుకున్న వేళ ||

వెచ్చనైన ఈడుకున్న వేవ్ లెంత్లో

రెచ్చి రాసుకున్న పాటకెన్ని పంక్తులో 

విచ్చుకున్న పొద్దు పువ్వు ముద్దు తోటలో కోకిలమ్మ పాటకెన్ని కొత్త గొంతులో ఫాక్స్ కార్డు బీట్ మీద పదాలు వేసి చూడు హార్ట్ బీట్ పంచుకున్న లిరిక్ లో నిన్న మొన్న కన్నా నిజా నిజాలకన్న గతాగాతాలకన్న ఇవాళ నీది కన్నా పాటలన్నీ పూవులైన తోటలాంటి లేత యవ్వనాన ||