సోడియం ప్రొపియోనేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోడియం ప్రొపియోనేట్ ద్విముఖ సౌష్టవం
సోడియం ప్రొపియోనేట్ యొక్క నిర్మాణం, మిథైల్ సమూహాలు, H పరమాణువులు విస్మరించబడ్డాయి

సోడియం ప్రొపియోనేట్ అనేది సేంద్రీయ సోడియం ఉప్పు, ఇది సమాన సంఖ్యలో సోడియం, ప్రొపియోనేట్ అయాన్లను కలిగి ఉంటుంది. ఇది యాంటీ ఫంగల్ డ్రగ్‌గా, ఆహర ప్రిజర్వేటివ్‌గా పాత్రను కలిగి ఉంది. ఇందులో ప్రొపియోనేట్ ఉంటుంది.[1]సోడియం ప్రొపియోనేట్ అనేది ప్రొపియోనిక్ ఆమ్లం యొక్క సోడియం లవణ రూపం, ఒక చిన్న హైడ్రో కార్బన్ గొలుసు వున్న కొవ్వు ఆమ్లం (SCFA), ఆహార సంకలితం, సంభావ్య జీర్ణశయాంతర (GI) రక్షణ చర్య చూపిస్తుంది.సోడియం ప్రొపియోనేట్ ను నోటి ద్వారా తీసుకున్న తర్వాత, ఇది GI ట్రాక్ట్‌ను రక్షించే ప్రొపియోనిక్ యాసిడ్‌గా మారుతుంది, రేడియేషన్ థెరపీ నుండి GI విషపూరితం యొక్క సంభావ్యత, తీవ్రతను తగ్గిస్తుంది.[2]పెద్దప్రేగు యొక్క లూమినల్ విషయాలలో ప్రొపియోనేట్ ప్రధాన భాగం. ఇది శోథ నిరోధక లక్షణాలతో సంబంధం కలిగి ఉంటుంది.[3]సోడియం ప్రొపియోనేట్‌ను ట్రాన్స్‌గలాక్టో-ఒలిగోసాకరైడ్స్ (TOS) మాధ్యమంలో బైఫిడోబాక్టీరియాను వేరుచేయడానికి అనుబంధంగా ఉపయోగిస్తారు.[4]ఇది ఎలుకల కోసం తయారుచేసిన SCFA (షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్) ఆహారంలో సప్లిమెంట్‌గా ఉపయోగించబDడుతుంది.[5]సోడియం ప్రొపియోనేట్, నాట్రియంప్రోపియోనేట్ లేదా E281 అని కూడా పిలుస్తారు, ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ లవణాలు అని పిలువబడే కర్బన సమ్మేళనాల తరగతికి చెందినది.ఇవి కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క అయానిక్ ఉత్పన్నాలు. సాహిత్య సమీక్ష ఆధారంగా సోడియం ప్రొపియోనేట్‌పై గణనీయమైన సంఖ్యలో కథనాలు ప్రచురించబడ్డాయి.[6]

వివరణ[మార్చు]

సోడియం ప్రొపియోనేట్ అనేది ప్రొపియోనిక్ ఆమ్లం యొక్క ఉప్పు రూపం, ఇది సేంద్రీయ ఆమ్లం, ఇది చక్కెర రసాయన క్షీణత/క్షయికరణ సమయంలో ఉత్పత్తి అవుతుంది.ఇది కొన్ని కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు జీవక్రియ చేయబడినప్పుడు శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే సమ్మేళనం."ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ విటమిన్ అండ్ న్యూట్రిషన్ రీసెర్చ్"లోని 1996 కథనం ప్రకారం, విటమిన్ B-12 ఉనికిపై ఆధారపడిన ఎంజైమాటిక్ ప్రతిచర్యల శ్రేణి ద్వారా ప్రొపియోనిక్ ఆమ్లం జీవక్రియ చేయబడుతుంది.సోడియం ప్రొపియోనేట్ అనేక రకాల పారిశ్రామిక అవసరాల కోసం రసాయనికంగా కూడా తయారు చేయబడుతుంది.[7]

భౌతిక ధర్మాలు[మార్చు]

సోడియం ప్రొపియోనేట్ (C3H5NaO2, CAS సంఖ్య. 137-40-6) అనేది ప్రొపియోనిక్ ఆమ్లం యొక్క సోడియం ఉప్పు. ఇది రంగులేని, పారదర్శక స్ఫటికాలు లేదా కణిక స్ఫటికాకార పొడి వలె సంభవిస్తుంది. ఇది వాసన లేనిది, లేదా మందమైన ఎసిటిక్-బ్యూట్రిక్ యాసిడ్ వాసనను కలిగి ఉంటుంది, ఇది సువాసనగా ఉంటుంది. ఇది సోడియం హైడ్రాక్సైడ్‌తో ప్రొపియోనిక్ ఆమ్లాన్ని తటస్థీకరించడం ద్వారా తయారు చేయబడుతుంది.[8]ఆర్ధ్రాకర్షక గుణమున్న పదార్థం.

లక్షణం/గుణం మితి/విలువ
అణు సూత్రం C3H6O2.Na
అణు భారం 96.06గ్రా/మోల్[9]
సాంద్రత 1.51[20℃ వద్ద][9]
ద్రవీభవన ఉష్ణోగ్రత 285-286°C[9]
ఫ్లాష్ పాయింట్ 57.7°C[9]

నీటిలో స్వేచ్ఛగా కరుగుతుంది, ఇథనాల్‌లో కరుగుతుంది.[10] వియోగం చెందెలా వేడి చేసినప్పుడు అది డై సోడియం ఆక్సైడ్ విషపూరిత పొగలను విడుదల చేస్తుంది.[11]మండించిన మండే గుణమున్న పదార్థం [12]

ఉపయోగాలు[మార్చు]

  • ప్రాథమిక ఉపయోగాలు: యాంటీ ఫంగల్ ఏజెంట్, యాంటిసెప్టిక్ ఏజెంట్ (సమయోచిత), క్రిమిసంహారక, ఆహార సంకలితం,నేత్రచికిత్స ఏజెంట్ గా పని చెస్తుంది.ఇది ప్రాథమికంగా బేకరీ ఉత్పత్తులలో బూజు నిరోధకంగా ఉపయోగించబడుతుంది. ఇది EU, USA, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో (దీని INS సంఖ్య 281 ద్వారా జాబితా చేయబడింది) ఆహార సంకలితం వలె ఉపయోగించడానికి ఆమోదించ బడింది.[7]
  • ఇది బూజు , కొన్ని బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది, తద్వారా vaMDi ప్యాక్ చేసిన వస్తువుల షెల్ఫ్ జీవితాన్ని పొడిగిస్తుంది.[7]
  • దీనిని క్రిమినాశక,పదార్థాలను చెడిపోనివ్వని మందుగా ఉపయోగించవచ్చు.
  • ఫార్మసీలో, ఇది చర్మపు ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో సాధారణంగా కాల్షియం ప్రొపియోనేట్‌తో కలిపి ఉపయోగించబడుతుంది. [13]
  • సోడియం ప్రొపియోనేట్ 0.1–5.0% గాఢత స్టెఫిలోకాకస్ ఆరియస్, సార్సినా లూటియా, ప్రోటీయస్ వల్గారిస్, లాక్టోబాసిల్లస్ ప్లాంటారమ్, టొరులా, సాక్రోరోమైసెస్ ఎలిప్సోయిడస్‌ల పెరుగుదలను 5 రోజులు ఆలస్యం చేస్తుంది.[14]
  • జంతువులలో జీర్ణశయాంతర ప్రేగు యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.పాడి ఆవులలో, ఇది కీటోసిస్‌ను నిరోధించడానికి, ముఖ్యంగా చనుబాలివ్వడం ప్రారంభంలో, అదనపు శక్తి వనరును అందించడం ద్వారా ఉపయోగించబడుతుంది. జంతువులలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, అంటువ్యాధులు, వ్యాధులను మరింత సమర్థవంతంగా నిరోధించడంలో వాటికి సహాయం చేస్తుంది. రుమినెంట్‌లకు తక్షణమే లభించే శక్తి వనరుగా పనిచేస్తుంది, వారి జీవక్రియ అవసరాలు అలాగే ముఖ్యంగా మొత్తం ఆరోగ్యానికి అధిక శక్తి డిమాండ్ ఉన్న కాలంలో మద్దతు ఇస్తుంది. [15]

బయటి వీడియో లింకులు[మార్చు]

ఇవి కూడా చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "CHEBI:132106 - sodium propionate". ebi.ac.uk. Retrieved 2024-04-11.
  2. "Sodium Propionate". ncithesaurus.nci.nih.gov. Retrieved 2024-04-11.
  3. PEER REVIEWED PAPERS Anti-inflammatory properties of the short-chain fatty acids acetate and propionate: a study with relevance to inflammatory bowel disease.Tedelind S.World Journal of Gastroenterology, 13, 2826-2826 (2007)
  4. Identification and antibiotic susceptibility of bacterial isolates from probiotic products.Temmerman R.International Journal of Food Microbiology, 81, 1-1 (2003)
  5. "Sodium propionate". sigmaaldrich.com. Retrieved 2024-04-11.
  6. "Sodium propionate". foodb.ca. Retrieved 2024-04-11.
  7. 7.0 7.1 7.2 "Sodium propionate". chemicalbook.com. Retrieved 2024-04-11.
  8. "Sodium propionate". ecfr.gov. Retrieved 2024-04-11.
  9. 9.0 9.1 9.2 9.3 "sodium propanoate - Physico-chemical Properties". chembk.com. Retrieved 2024-04-11.
  10. "Sodium propionatefao.org". Retrieved 2024-04-11.
  11. "SODIUM PROPIONATE". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-11.
  12. Lewis, R.J., Sr (Ed.). Hawley's Condensed Chemical Dictionary. 12th ed. New York, NY: Van Nostrand Rheinhold Co., 1993, p. 1067
  13. "Sodium Propionate". drugs.com. Retrieved 2024-04-11.
  14. "Propionate Sodium". sciencedirect.com. Retrieved 2024-04-11.
  15. "SODIUM PROPIONATE". wbcil.com. Retrieved 2024-04-11.