సోరియాసిస్
చర్మ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి సోరియాసిస్ (ఆంగ్లం: Psoriasis). దీర్గకాలికమైన రోగనిరోధక శక్తిలో మార్పులు వలన ఇది సంభవిస్తుంది. ఈ వ్యాధిలో నొప్పి, చర్మము మందము అవడం, వాపు, దురద, చేపపొట్టులాంటి పొలుసులు ఊడడం జరుగుతుంటుంది. ఈ వ్యాది ముఖ్యముగా ముంజేతి వెనకభాగము, మోకాలు ముందుభాగము, తల, వీపు, ముఖము, చేతులు, పాదాలలో వస్తుంది. సరియైన చికిత్స లేనట్లైతే ఈ వ్యాధి జీవితాంతముంటుంది. కొన్ని వాతావరణ పరిస్తితులలో వ్యాధి పెరగడము, తగ్గడమూ సర్వసాధారణము.
బొద్దు పాఠ్యం== కారణాలు ==
- వంశపారంపర్యము,
- ఇన్ఫెక్షన్
- మానసిక వత్తిడి
- చర్మము పొడిబారినట్లుండడం
- కొన్నిరకాల మందులు వాడడం వలన
- ఆల్కహాలు
- పొగత్రాగడం - ఈ వ్యాధికి కొన్ని కారణాలు. ముఖ్యముగా 25 - 45 సంవత్సరాల వయసు వచ్చే ఈ వ్యాధి మహిళలో ఎక్కువగా ఉంటుంది. మానసిక, శారీరక వత్తుడులు వలన ఈ వ్యాధి శాతం పెరుగుతూ వస్తుంది.
[మార్చు] వ్యాధి రకాలు
- గట్టేట్ సోరియాసిస్ (Guttate Psoriasis): నీటి బుడగలవంటి పొక్కులు ఉంటాయి. ఛాతీ భాగము, ముంజేతులు, తల, వీపు భాగాలలో వస్తుంది. దీనికి తోడు వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే చీముపొక్కులుగా మారుతుంది.
- పోస్టులార్ సోరియాసిస్ (Pustular Psoriasis): ఎక్కువ వేడి ప్రదేశాలలోను, ఎండలో తిరగడం వలన, గర్భవతిగా ఉన్నపుడు, చెమట ఎక్కువగా పట్టేవారులోను, మానసిక అలజదీ, వత్తిడి ఉన్నవారిలోను, కొన్ని రకాల మందులు కెమికల్సు తో పనిచేసేవారిలోను, ఎక్కువ యాంటిబయోటిక్స్ వాడేవారిలోను ఈరకం వస్తూ ఉంటుంది.
- ఇన్వర్స్ సోరియాసిస్ (Inverse Psoriasis): పెద్ద, పొడి, సున్నితమైన, ఎర్రని పొలుసులతో ఉంటుంది. ఎక్కువగా చర్మము మడతలలో, జననేంద్రియ భాగాలలో, చంకలలో, ఎక్కువ వత్తిడి, రాపిడి ఉండే చోట్ల ఇది వస్తుంది.
- ఎరిత్రోడెర్మిక్ సోరియాసిస్ (Erythrodermic Psoriasis): ఎక్కువ చర్మభాగము ఎర్రగా మారడం, దురద, పొలుసులు రాలడం, భరింపనలవికాని నొప్పి ఉండడం దీని లక్షణం. ఎండలో తిరగడం, స్టెరాయిడ్ మందులు, యాంటిబయోటిక్స్ వాడడం వలన, కొన్ని ఎలర్జీల వలన ఇది ప్రేరేపితమవుతుంది.
- సోరియాసిస్ వల్గారిస్ (Psoriasis vulgaris): ఇది 80% - 90 % వరకూ కనిపిస్తుంది. చర్మము తెల్లని పొలుసు గా పైకి లేచినట్లు ఉంటుంది.
- గోళ్ల సోరియాసిస్ : కాళ్ల, చేతుల గోరు లో మార్పులు జరిగి రంగు మారడం, గోళ్లు వంకరగా పైకి లేవడమ్, గోళ్లపై చారలు కనిపించడమ్, గోల్ళు దలసరిగా అవడం, లొత్తలు పడడం ఈవదమ్గా అందవిహీనంగా తయారవుతాయి.
[మార్చు] వ్యాధి నివారణ
సోరియాసిన్ వ్యాధి ఉధ్రుతమైనది, దీర్ఘకాలికమైనది. కావున ఒక రోగికి , మరో రోగికి వ్యాధి తీవ్రతలో తేడా ఉంటుంది. జబ్బు తీవ్రతను బట్టి చికిస్త చేయవలసిన అవరముంటుంది. తగినంత శరీరకశ్రమ , విశ్రాంతి, సమతుల్య ఆహారము, మంచి అలవాట్లు, మెడిటేషన్, చర్మరక్షణకు సంబంధించిన జాగ్రత్తలూ, ఇతర ఇన్ఫెక్షన్ రాకుండా సుచి-శుబ్రత పాటించడం, పొడి చర్మానికి తేమకోసం ఆయిల్ పూయడం మంచిది.
[మార్చు] బయటి లింకులు
- "Questions and Answers about Psoriasis" at National Institute of Arthritis and Musculoskeletal and Skin Diseases
- Psoriasis at National Institute of Arthritis and Musculoskeletal and Skin Diseases
- Psoriasis at Mayo Clinic
- The Psoriasis Association
- National Psoriasis Foundation Homepage
- Psoriasis Cure Now Homepage
- Psoriasis Support Canada
- Psoriasis Help Homepage
- మూస:DermAtlas
- Psoriasis in Literature
- The Psoriasis and Psoriatic Arthritis Alliance (PAPAA) - UK national charity
- - International Association of Psoriasis Associations - IFPA
- From Arsenic to Biologicals: A 200 Year History of Psoriasis (Barbara S. Baker), ISBN 0-9551603-2-4.
