హాత్‌రస్ జిల్లా
హాత్‌రస్ జిల్లా
महामायानगर ज़िला مہامایا نگر ضلع | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | అలీగఢ్ |
ముఖ్య పట్టణం | హాత్‌రస్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | హాత్‌రస్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,840 కి.మీ2 (710 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 15,65,678 |
• జనసాంద్రత | 850/కి.మీ2 (2,200/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 73.1 per cent |
• లింగ నిష్పత్తి | 870 |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో హాత్‌రస్ జిల్లా ఒకటి. మొదట దీనికి బుద్ధుని తల్లి మాయాదేవి పేరిట మాయాదేవి జిల్లా అని అన్నారు.[1] హాత్‌రస్ పట్టణం ఈ జిల్లా కేంద్రం. జిల్లావైశాల్యం 1800 చ.కి.మీ. 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 1,565,678.
చరిత్ర
[మార్చు]1997 మే 3 న అలీగఢ్, మథుర, లఖింపూర్ ఖేరి, ఆగ్రా జిల్లాల్లోని కొంత భాగాన్ని విడదీసి ఈ జిల్లాను ఏర్పాటు చేసారు. గౌతమబుద్ధుని తల్లి పేరు మాయాదేవి మీదుగా జిల్లా పేరును నిర్ణయించారు.[2] 2012లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తరువాత జిల్లాకు ప్రస్తుతమున్న పేరు పెట్టారు.
విభాగాలు
[మార్చు]- జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి:
- జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి: హాత్‌రస్, సదాబాద్, సికంద్రా రావ్, సంసి.
- జిల్లాలో 7 మండలాలు ఉన్నాయి: హాత్‌రస్, సదాబాద్, సికంద్రా రావ్, సంసి, ముర్సన్, సెహ్‌పౌ, హసయన్.
- జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు: హాత్‌రస్, సదాబాద్, సికంద్రా రావ్, సంసి
- పార్లమెంటు నియోజకవర్గం: హాత్‌రస్,
అక్బర్‌పురి
[మార్చు]జిల్లాలోని సంసి- నానౌ రోడ్డు పక్కన ఉన్న అక్బర్ పురి గ్రామం, శేఖర్ పురి గ్రామాలు వేరైనా రెవెన్యూ శాఖ రెండింటినీ ఒకటిగా భావిస్తుంది. 1991 గణాంకాల ప్రకారం ఈ గ్రామ జనసంఖ్య 2000 మంది. గ్రామంలో హినుదువులు, ముస్లిములు నివసిస్తున్నారు. హిందువులలో బ్రాహ్మణులు, జాట్, జాతవ్ (చామర్), ఖతిక్, హరిజనులు, తెలీ ప్రజలు నివసిస్తున్నారు. వీరి సాంఘిక స్థితి జాతీయసరాసరికి దగ్గరగా ఉంటుంది.
- బిహారె చందన్‌సింగ్ మందిర్ పాఠశాల. ప్రాథమిక నుండి 8 వ తరగతి వరకు
- అకాడమీ ఆఫ్ ఎజ్యుకేషన్: 9-12 తరగతులు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,565,678,[4] |
ఇది దాదాపు. | గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 318వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 815 .[4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.19%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 870 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 73.1%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
ప్రయాణ సౌకర్యాలు
[మార్చు]జిల్లాలో 4 రైల్వే స్టేషన్లు ఉన్నాయి: హాత్‌రస్ రైల్వే జంక్షన్, హాత్‌రస్ రోడ్ రైల్వే స్టేషను, హాత్‌రస్ సిటీ రైల్వే స్టేషను, హాత్‌రస్ ఖిలా రైల్వే స్టేషను ఉన్నాయి. పలు రైల్ వసతులు ఉన్నా పెరుగుతున్న అవసరాల దృష్ట్యా రైలు వసతి కొరవ సమస్య ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Important Cabinet Decisions". Information and Public Relations Department. Archived from the original on 24 అక్టోబరు 2014. Retrieved 17 January 2013.
- ↑ Bhushan, Ranjit (2 July 1997). "The Ambedkar Armada". Outlook. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 24 February 2012.
- ↑ "Villages of Sasni Sub District(MAHAMAYA NAGAR-UTTAR PRADESH )". Local Government Directory. Ministry of Panchayati Raj. Archived from the original on 17 నవంబరు 2015. Retrieved 28 August 2013.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Gabon 1,576,665