హొగెనక్కల్ జలపాతం
|
||||||||||
|
||||||||||
హొగెనక్కల్ జలపాతం (ఆంగ్లం: Hogenakkal Falls, (తమిళం: ஒகேனக்கல் அருவி, కన్నడం: ಹೊಗೆನಕಲ್ ಜಲಪಾತ) కావేరీ నది మీద ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతం. ఇది తమిళనాడు రాష్ట్రంలో ధర్మపురి జిల్లా లో ఉన్నది.[1][2][3][4][5][6][7][8][9] ఇది బెంగుళూరు నుండి 180 కిలోమీటర్లు మరియు ధర్మపురి నుండి 46 కిలోమీటర్లు దూరంలో ఉన్నది.[10] దీనినే "భారతీయ నయాగరా జలపాతం" (Niagara of India) అని పిలుస్తారు.[11] కార్బొనటైట్ (Carbonatite) రాళ్ళు దక్షిణాసియాలొను మరియు ప్రపంచంలోనే పురాతనమైనవిగా భావిస్తారు.[12]
విషయ సూచిక |
[మార్చు] వ్యుత్పత్తి
జలపాతం నీరు రాళ్ళమీద పడినప్పుడు లేచిన నీటి తుంపర్లు పొగలాగా కనిపిస్తుంది. కన్నడంలో 'హొగె' అనగా పొగ మరియు 'కల్' అనగా రాయి కలిపి 'హొగెనక్కల్' అనగా పొగలు చిమ్మే రాయి.[13]
[మార్చు] కావేరీ నది
- ప్రధాన వ్యాసం: కావేరీ నది
కావేరీ నది కర్ణాటక లోని బ్రహ్మగిరి కొండలలో తలకావేరి వద్ద జన్మించి తూర్పు దిక్కుగా పయనిస్తుంది. కొండ వాలులో ప్రవాహవేగం పెరిగి పిల్లకాలవలను కలుపుకుంటూ ముందుకు సాగుతుంది.[1] హొగెనక్కల్ చేరేసరికి కావేరీ నది చాలా విశాలంగా తయారై కొండ చరియల మీద పడుతూ చాలా జలపాతాల్ని తయారుచేస్తుంది. వీటిలో కొన్ని సుమారు 20 మీటర్లు ఎత్తుంటాయి. జలపాతం దాటిన వెంటనే నదీజలాలు దక్షిణంగా ప్రవహించి మెట్టూరు ఆనకట్ట (Mettur Dam) ద్వారా ఏర్పడిన స్టాన్లీ జలాశయం (Stanley Reservoir) లో ప్రవేశిస్తాయి. ఈ జలాశయం సుమారు 60 చ.మైళ్లు విస్తీర్ణంలో విస్తరించింది. 1934 సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఆనకట్ట ద్వారా జల విద్యుత్తు మరియు పంట పొలాలకు నీరు అందిస్తుంది.[14]
[మార్చు] వాతావరణం
ఈ జలపాతాన్ని సందర్శించడానికి వర్షాకాలం తర్వాత నదీజలాలు నిండుగా ప్రవహిస్తున్నప్పుడు సరైన సమయం. ఇక్కడి ఉష్ణోగ్రత వేసవిలో Max 34 Degree Celsius నుండి Min 23 Degree Celsius గా మరియు చలికాలంలో Max 27 Degree Celsius నుండి Min 13 Degree మధ్యలో ఉంటుంది.[15].
[మార్చు] స్నానం
ఈ జలపాతం పరిసరాలలో ప్రత్యేకంగా నిర్మించిన స్నానఘట్టాలున్నాయి. కొన్ని మైళ్ళు విస్తరించిన నదీజలాలు అడవుల గుండా ప్రయాణించి ఎన్నో ఔషధ గుణాలున్న చెట్లను తాకుతూ ప్రవహిస్తాయి. అందువలన ఈ నీటిలో స్నానం ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావిస్తారు.[16]. చుట్టూ ఉండే కొండలు అతి సుందరంగా కనిపిస్తాయి.
[మార్చు] బోట్ షికారు
జలపాతం అందాలు చూడడానికి ఇక్కడ సుమారు 400 తెప్పలున్నాయి. నీటి ప్రవాహం తక్కువగా ఉండే వేసవి కాలంలో మాత్రమే వీటిని అనుమతిస్తారు. ఇవి తమిళనాడు మరియు కర్ణాటక కు చెందిన రెండు వైపులా కూడా కనిపిస్తాయి.[17] ఒక్కొక్క తెప్ప సుమారు రెండున్నర మీటర్లు వ్యాసం కలిగి ఎనిమిది మందిని తీసుకొని పోగలదు.[18] ఇవి వెదురుతో తయారుచేసి తడిసిపొకుండా జంతుచర్మం లేదా ప్లాస్టిక్ తో కప్పుతారు.[19] ఈ తెప్పల్ని ఒకే తెడ్డుతో సులువుగా నడుపుతారు.[20]
అప్పుడే పట్టిన చేపలతో నోరూరించే ఆహార పదార్ధాలు అక్కడే నీటి ఒడ్డున అమ్ముతూ చాలామంది కనిపిస్తారు.
[మార్చు] హొగెనక్కల్ నీటి సరఫరఅ పధకం
హొగెనక్కల్ జలపాతం వద్ద తమిళనాడు ప్రభుత్వం త్రాగునీటి పధకాన్ని ప్రారంభించింది.[21] దీని ముఖ్య ఉద్దేశం ధర్మపురి మరియు కృష్ణగిరి జిల్లాలకు త్రాగునీరు సరఫరా చేయడం.[22] దీనికి జపాన్ బ్యాంకు ఆర్ధిక సహాయం అందిస్తుంది.[23]
[మార్చు] మూలాలు
- ↑ 1.0 1.1 ARTICLE 262 AND INTER-STATE DISPUTES RELATING TO WATER Ministry of Law, Government of India
- ↑ Taluk Information. Tnmaps.tn.nic.in. తీసుకొన్న తేదీ: 2008-11-07.
- ↑ Karnataka State Tourism development Corporation
- ↑ http://www.tnpolice.gov.in/station_details.php?code=2958730&desc=HOGENAKKAL
- ↑ National Portal of India : Know India : State and UTs. India.gov.in. తీసుకొన్న తేదీ: 2008-11-07.
- ↑ http://64.233.183.104/search?q=cache:BYaG44LACWcJ:www.mrcindia.org/annual-rep/2005/IDVC%2520Highlights.pdf+hogenekkal+flood&hl=ru&ct=clnk&cd=10&gl=ru&client=firefox-a
- ↑ http://64.233.183.104/search?q=cache:blrX9fGYcYMJ:www.tnenvis.nic.in/DtProfiles/dharmapuri.pdf+hogenekkal+flood&hl=ru&ct=clnk&cd=11&gl=ru&client=firefox-a
- ↑ http://64.233.183.104/search?q=cache:lR_VOC7ASD4J:www.tn.gov.in/spc/annualplan/ap2004-05/ch11_4.pdf+hogenekkal+flood&hl=ru&ct=clnk&cd=14&gl=ru&client=firefox-a
- ↑ Dharmapuri district Tamil Nadu Tourism development corporation
- ↑ location well cited ...
- ↑ Hogenakkal row: Time to show restraint - National News – News – MSN India - News. News.in.msn.com. తీసుకొన్న తేదీ: 2008-11-07.
- ↑ 2.0 Ga old pyroxenite-carbonatite complex of Hogenakal, Tamil Nadu, South India. Cat.inist.fr. తీసుకొన్న తేదీ: 2008-11-07.
- ↑ Dharmapuri district - places of interest. tamilnadutorism.org. తీసుకొన్న తేదీ: 2006-11-11.
- ↑ Cauvery River in Southern India. cauvery.com. తీసుకొన్న తేదీ: 2006-11-11.
- ↑ http://www.hogenakkal.com/services.html
- ↑ http://www.hogenakkal.com/
- ↑ Boats of South Asia- by Sean McGrail el al.,
- ↑ The Hindu - Row, row, row your boat
- ↑ Hide boats at Hogenakal on the river Kaveri, Tamil Nadu- by C Palmer et al.
- ↑ Hogenakkal falls
- ↑ The Hindu - The 1998 story of Hogenakkal
- ↑ Times of India - Hogenakkal project: Water of hope
- ↑ Business Line - Japan Bank agrees to fund Hogenakkal water project