ఆచంట లక్ష్మీపతి
ఆచంట లక్ష్మీపతి | |
---|---|
జననం | ఆచంట లక్ష్మీపతి మార్చి 3, 1880 పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర మాధవవరం |
మరణం | 1962 ఆగస్టు 6 | (వయసు 82)
ప్రసిద్ధి | ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు , సంఘసేవకుడు |
భార్య / భర్త | ఆచంట రుక్మిణమ్మ |
ఆచంట లక్ష్మీపతి (మార్చి 3, 1880 - ఆగస్టు 6, 1962) ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. ఈయన నాటి మద్రాసు ( నేటి చెన్నయ్) లోని ఆయుర్వేద వైద్య కళాశాల ప్రధానోపాధ్యాయులుగా (1920-1928) సేవలు అందించారు.
బాల్యం-విద్యాభ్యాసం
[మార్చు]ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర మాధవవరంలో శ్రీ రామయ్య, శ్రీమతి జానకమ్మ లకు 1880, మార్చి 3 న జన్మించారు. ఈయన తాతగారు సుబ్బారాయుడు గారు సంస్కృత పండితులు. ఈయన తండ్రి అతను వైద్య పాటు వ్యవసాయం నేర్చుకోవడం కలలు కన్నారు. అటు వైద్య శాస్త్రం, ఇటు వ్యవసాయం రెండింటిలోనూ మక్కువ గల లక్ష్మీపతి మెట్రిక్యులేషన్, ఎఫ్.ఏ. పూర్తి చేసి స్థానికంగా తహశీల్దారు కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసారు. ఆపైన బి.ఎ. చేసి స్కాలర్‌షిప్పుతో యం.బి.సి.యం (ఆయుర్వేదం) కోర్సు చేసారు. ప్రముఖ వైద్యనిపుణులు పండిత దీవి గోపాలాచార్యులు వద్ద శిష్యరికం చేసారు.[1]
సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు వీరికి ఉన్నత పాఠశాల లోని గురువు. ఎఫ్.ఎ పూర్తి చేసిన పిదప ఆయన దవులూరి ఉమామహేశ్వరవావు వద్ద కొంతకాలం క్లార్క్ బాధ్యతలు నిర్వహించాడు. ఉమామహేశ్వరరావు మద్రాసుకు బదిలీఅయిన పిదప ఆయనతో పాటు వెళ్లాడు. ఆ సమయంలో మద్రాసు రాష్ట్రం బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. తరువాత ఆయన 1904 లో బి.ఎ పూర్తి చేసాడు.[1]
రచనలు
[మార్చు]దవులూరి ఉమామహేశ్వరరావు గారి సహాయము వలన ఈయనకు స్కాలర్‌షిప్ వచ్చుటచే ఈయన మెడిసన్, ఎం.బి.బి.యస్ డిగ్రీలను 1909 లో పూర్తి చేశారు. అల్లోపతీ వైద్యవిద్యను పూర్తి చేసిన తర్వాత ఆయుర్వేదం (పురాతన భారత వైద్య విధానం) ను పండిట్ గోపాలాచార్యులు దీవి వారి అధ్వర్యములో అభ్యసించారు. దీవి గోపాలాచార్యులు 1920 లో మద్రాసునందు ఆయుర్వేద మెడికల్ కాలేజీని నడిపేవారు. ఆ ఆయుర్వేద కళాశాలలో లక్ష్మీపతి ప్రిన్సిపాల్ గా ఎదిగారు.
రచనలు
[మార్చు]ఆంగ్ల భాషతో పాటు తెలుగు లోనూ తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగించిన డా. ఆచంట లక్ష్మీ పతి1922-27 కాలంలో తెలుగులో "ధన్వంతరి" పత్రికనూ ఆంగ్లంలో 'ఆంధ్రా మెడికల్ జర్నల్ ' ను ప్రచురించారు. ఈయన 63 పుస్తకాలను భారతీయ వైద్యం పై అనగా దర్శనములు, ఆయుర్వేద విజ్ఞానం, ఆయుర్వేద శిక్ష, వనౌషథ విజ్ఞానము, భారతీయ విజ్ఞానము వంటివి వ్రాశారు.ఆయుర్వేదంపై అనేక ఆంగ్ల పుస్తకాలను వ్రాశారు. చలిజ్వరము రోగ లక్షణాలు, దానికి ఆయుర్వేద వైద్యము గురించి చలిజ్వరము[2] పుస్తకాన్ని రాశారు.
జీవిత విశేషాలు
[మార్చు]అతని మొదటి భార్య సీతమ్మ యౌవనంలోనే మరణించడంతో ఆచంట లక్ష్మీపతి రుక్మిణమ్మను రెండవ పెళ్ళి చేసుకున్నాడు. ఆమె తర్వాతి కాలంలో అవిభక్త మద్రాసు రాష్ట్రానికి ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసింది. లక్ష్మీపతి ఆయుర్వేద వైద్య రంగానికి ఎంతో సేవ చేశాడు. అఖిల భారత ఆయుర్వేద వైద్య సమాజం, ఆంధ్రా ఆయుర్వేద బోర్డు వంటి సంస్థలకు అధ్యక్షునిగానూ వ్యవహరించాడు. మద్రాసులో ఆంధ్ర సాహిత్య పరిషత్తుకు కార్యదర్శిగా పనిచేశాడు.
ఆయుర్వేద వైద్య రంగానికి అతను చేసిన సేవలకు గుర్తింపుగా ఆచంట లక్ష్మీపతి యూనిట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎట్ వాలంటరీ హెల్త్ సర్వీసెస్, చెన్నై, ఆచంట లక్ష్మీపతి న్యూరోసర్జికల్ సెంటర్, వీహెచ్ఎస్, చెన్నై వంటి సంస్థలకు లక్ష్మీపతి పేరును పెట్టారు.
అస్తమయం
[మార్చు]వైద్యునిగానే కాక సంఘ సేవకునిగా, రచయితగా, జాతీయవాదిగా సేవలందించిన డా.ఆచంట లక్ష్మీ పతి 1962, ఆగస్టు 6 న పరమపదించారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఆచంట లక్ష్మీపతి చరిత్ర
- ↑ లక్ష్మీపతి, ఆచంట. చలిజ్వరము.