Jump to content

అంతర్జాతీయ అహింసా దినోత్సవం

వికీపీడియా నుండి
అంతర్జాతీయ అహింసా దినోత్సవం
అంతర్జాతీయ అహింసా దినోత్సవం
జరుపుకొనేవారుఐక్య రాజ్య సమితి సభ్య దేశాలు
జరుపుకొనే రోజు2 అక్టోబరు

అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం (International Day of Non-Violence) ఐక్య రాజ్య సమితి చే గుర్తించబడిన స్మారక దినం. ఇది ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జన్మదినం అయిన అక్టోబరు 2 వ తేదీన జరుపుకుంటారు.

జనవరి 2004 లో ఇరాన్ నోబెల్ గ్రహీత షిరిన్ ఎబాడీ పారిస్లోని ఒక హిందీ ఉపాధ్యాయుడి నుండి అంతర్జాతీయ అహింసా దినోత్సవం కోసం ఒక ప్రతిపాదనను అందుకున్నాడు. అతడు దాన్ని ముంబైలో జరిగిన వరల్డ్ సోషల్ ఫోరము వద్ద ఉంచాడు. ఈ ఆలోచనపై క్రమంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసక్తి కనబరచారు. 2007 జనవరిలో న్యూ ఢిల్లీలో సత్యాగ్రహ సమావేశంలో, ఈ ఆలోచనను స్వీకరించాలని ఐక్యరాజ్యసమితికి పిలుపునిస్తూ ఒక తీర్మానం చేసారు. ఈ తీర్మానాన్ని భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు లు తీసుకువచ్చారు.[1]

15 జూన్ 2007 న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం అక్టోబర్ 2 ను అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకోడానికి ఓటు వేసింది.[2] ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానంలో అక్టోబర్ 2 ను "తగిన పద్ధతిలో జ్ఞాపకం చేసుకోవాలనీ, విద్య ద్వారా, ప్రజలలో అవగాహన తీసుకురావడం ద్వారా అహింసా సందేశాన్ని వ్యాప్తి చేయండం ద్వారా జరుపుకోవాలని" సభ్యులందరినీ కోరింది.[3]

భారత శాశ్వత రాయబారి అభ్యర్థన మేరకు, న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్యసమితి పోస్టల్ అడ్మినిస్ట్రేషన్ (యుఎన్‌పిఎ) ఈ సంఘటనను జ్ఞాపకం చేసుకోవడానికి ఒక ప్రత్యేక క్యాచెట్‌ను సిద్ధం చేసింది. అక్టోబర్ 2, 31 మధ్య యుఎన్పిఎ పంపే మెయిళ్ళన్నీ ఈ క్యాచెట్‌ను కలిగి ఉంటాయని చెప్పింది.

మూలాలు

[మార్చు]
  1. "Conference calls for declaring International day of non-violence".
  2. "UN declares 2 October, Gandhi's birthday, as International Day of Non-Violence". United Nations. 15 June 2007. Retrieved 2 October 2014.
  3. "General Assembly Adopts Texts On Day Of Non-Violence, Ethiopian Millennium; Pays Tribute To Former Secretary-General Kurt Waldheim". United Nations. 15 June 2007. Retrieved 2 October 2014.

బయటి లింకులు

[మార్చు]