Jump to content

అజర్‌బైజాన్‌లో హిందూమతం

వికీపీడియా నుండి

అజర్‌బైజాన్‌లో హిందూమత వ్యాప్తి సిల్క్ రోడ్‌లో సాంస్కృతిక వ్యాప్తితో ముడిపడి ఉంది. కాకసస్ లో ఒకప్పటి హిందూమత, బౌద్ధ సంస్కృతి ఆధిపత్య అవశేషాల్లో ఒకటి సురాఖని. ఇది బాకూ లోని అటాష్గా స్థలం. [1]

చరిత్ర

[మార్చు]

మధ్య యుగాలలో, హిందూ వ్యాపారులు సిల్క్ రోడ్ వ్యాపారం కోసం నేటి అజర్‌బైజాన్‌ను సందర్శించేవారు. ఎక్కువగా ముల్తాన్, సింధ్ (ప్రస్తుత పాకిస్తాన్‌లో) ల నుండి వచ్చే హిందూ వ్యాపారులు ఈ ప్రాంతం గుండా ప్రయాణించేవారు. ఈ ప్రాంతంలో ఉండగా సురాఖని లోని అటెస్గాలో ఆ వ్యాపారులు ప్రార్థనలు చేసేవారు. బ్రిటిష్ వారి రాకతో చాలా మంది వ్యాపారులు దీన్ని విడిచిపెట్టారు. ఒక పంజాబీ పండిట్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగేవి. [2] అటాష్‌గా నిర్మాణానికి ముందు కూడా స్థానికులు సురాఖని వద్ద పూజించేవారని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. వారి "ఏడు రంధ్రాలలో మండే మంట" నుండి సురఖానికి ఆ పేరు వచ్చింది. [3] 1880వ దశకంలో రష్యాకు చెందిన జార్ అలెగ్జాండర్ III, అక్కడ నిర్వహించిన చివరి హిందూ వేడుకల్లో ఒక దానిని చూసేందుకు అజర్‌బైజాన్‌ వెళ్లాడు. 1890ల తర్వాత, అజర్‌బైజాన్‌లోని హిందూ వ్యాపారులందరూ దాదాపుగా మరణించారు లేదా భారత ఉపఖండానికి వెళ్లిపోయారు. [4]

ఇస్కాన్

[మార్చు]

ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) కు చెందిన హరేకృష్ణ భక్తులు బాకులో నమోదు చేసుకున్నారు. [5] బాకు సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్‌నెస్ నుండి 1996లో స్వాధీనం చేసుకున్న 35,000 పుస్తకాలలో 20,000 పుస్తకాలను 2002 అక్టోబరులో అధికారులు వెనక్కి ఇచ్చేసారు. [6] చాలా కొద్ది మంది అజెర్రి ప్రజలు హరేకృష్ణ భక్తులనీ [7] వారు ఎక్కువగా ఇస్కాన్ సంస్థ సభ్యులనీ అజర్‌బైజాన్ డైలీ డైజెస్ట్ రాసింది. [8]

ఇస్కాన్‌కు అజర్‌బైజాన్‌లో ఒకే ఒక సంఘం ఉంది, అది బాకులో ఉంది. అజర్‌బైజాన్‌లోకి భూమి లేదా సముద్రాల ద్వారా ప్రవేశించే ప్రయాణికుల నుండి వివిధ విశ్వాసాలకు సంబంధించిన మతపరమైన పుస్తకాలను కస్టమ్స్ కమిటీ వారు స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు బాకు విమానాశ్రయంలో కూడా ఇవి జరుగుతాయి. అజర్‌బైజాన్ రాజ్యాంగం మత స్వేచ్ఛను రక్షిస్తున్నప్పటికీ, బహాయిలు, హరే కృష్ణ భక్తులు మొదలైన మతాలను అభ్యసించే వ్యక్తులపై వాస్తవానికి నిషేధం ఉంది [9]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Rare Hindu temple in Muslim Azerbaijan - Sify.com
  2. Pre – Islamic Vedic Culture in Afghanistan - NHCTUK
  3. Observations from the Ancients Farid Bakharov - Azerbaijan International
  4. My Travels Outside Bombay - Ervad Shams-Ul-Ulama Dr. Sir Jivanji Jamshedji Modi B. A., PhD C. I. E.
  5. "Azerbaijan Daily Digest". Archived from the original on 2007-07-09. Retrieved 2022-01-17.
  6. Azerbaijan
  7. Azerbaijan moves to impose tighter control Archived 16 జూలై 2007 at the Wayback Machine - Eurasian net
  8. International Religious Freedom Report 2006, Azerbaijan - U.S. State Department
  9. https://www.nhc.no/content/uploads/2018/07/Rapport2_15_Aserbajdsjan_web.pdf