అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సర్ రతన్ టాటా ట్రస్ట్ ఆర్థిక సహాయంతో రంగస్థల కళల శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయము వారు జూలై, 2012లో థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)ను ఏర్పాటుచేయడం జరిగింది.[1].ఈ సంస్థ ద్వారా రంగస్థల శాఖకి ఉన్న అన్ని రకాల వనరులను ప్రజలందరికీ అందజేయాలనీ భావిస్తోంది.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో అసిస్టెంట్ ప్రొఫెసెర్ గా పనిచేస్తున్న డా. పెద్ది రామారావు ఈ ప్రాజెక్టు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. తెలుగు నాటకరంగంలో యువతీయువకుల భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడంకోసం ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నటన, నాటకరంగం పట్ల ఆసక్తి ఉన్న యువతీయువకుల్ని ఎంపికచేసుకొని వారిని విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి, ప్రతి నెల ఉపకారవేతనం అందిస్తూ వారితో ఒక కళా బృందాన్ని ఏర్పాటుచేసి, వారందరికి గౌరవప్రధమైన స్థాయిలో ఉపకార వేతనం అందిస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ప్రత్యేక శిక్షణ ఇప్పించి, వారిచేత దేశవ్యాప్తంగా నాటక ప్రదర్శనలు ఇప్పిస్తూ, నాటకరంగం పట్ల యువతలో మక్కువ పెంచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా ప్రతి సంవత్సరం రెండు మూడు బృందాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మరిన్ని మంచి నాటకాలు తెలుగు నేలమీద పుట్టుకొస్తాయని థియేటర్ ఔట్రీచ్ యూనిట్ విశ్వాసం.

అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి

ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాంలో భాగంగా థియేటర్ ఔట్రీచ్ యూనిట్ తయారుచేసిన రెండవ నాటకం అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి, మొదటి నాటకం మిస్ మీనా. దీనిని శ్రీ రాజీవ్ వెలిచేటి (ప్రొఫెసర్, థియేటర్ ఆర్ట్స్) దర్శకత్వ పర్వవేక్షణలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రంగస్ధల కళల శాఖలో పి.హెచ్డి చేస్తున్న బషీర్ ఒక చైనా జానపద కథ ఆధారంగా ఈ నాటకాన్ని రూపొందించారు. చిన్నారుల కోసం నాటకాలు తయారు చేయడం, శిక్షణా శిబిరాలను నిర్వహించడం బషీర్ ప్రధాన వ్యాపకం. సహజంగానే చిన్నారుల్లో అద్భుతమైన ఊహాశక్తి వుంటుంది. వారి ఊహాశక్తి మరింత విస్తరించాలన్న ఆశయంతో ఈ నాటకాన్ని ఈ విధంగా తయారుచేయడం జరిగింది.

పెద్దవాళ్ల కోసం ప్రదర్శించే అనేక నాటకాల గురించి మనందరికి తెలుసు. అయితే పిల్లలకోసం పెద్దవాళ్లు నాటకాలు ప్రదర్శించడం మన దేశంలో ఇప్పుడిప్పుడే ప్రారంభమోతోంది. పిల్లలకోసం నాటకాలు ప్రదర్శించడం ఏదో చిన్న పిల్లల ఆటలే అని ‘లైట్’గా తీసుకోకుండా కళాకారులందరూ ఎంతో కష్టపడి ఈ నాటకాన్ని తయారుచేశారు. మంచి నాటక ప్రదర్శనలు, మంచి మంచి పుస్తకాలు, కళలు ఎంత అందుబాటులో వుంటే ఆ సమాజం అంత ఆరోగ్యంగా వుంటుంది.

సంక్షిప్త కథ[మార్చు]

ఇది ఒక తల్లీ బిడ్డల కథ. ఒక వికార రాక్షసుని కథ. తమ గ్రామం మీద దాడి చేసి ప్రజల వద్ద వున్న అందమైన వస్తువులన్నిటినీ బలవంతంగా దోచుకుపోయే ఒక వికార రాక్షసుడు. ఆ రాక్షసుని అకృత్యాలను మౌనంగా భరించడమే తప్ప ఎదురుతిరిగే సాహసం ఎవ్వరూ చేయలేరు. ఒక వేళ ఎవరన్నా చేస్తే వాళ్లు వికార రాక్షసునికి బలికావలసిందే. అలాంటి వికార రాక్షసుడిని ఎదిరించడానికి ఒక చిన్నారి సిద్ధపడుతుంది. అతన్ని వెతుక్కుంటూ కాకులు దూరని కారడవిలోకి ప్రయాణిస్తుంది. పాపం! ఆ చిన్నారి ప్రాణాలతో తిరిగి వస్తుందో లేదో తెలియాలంటే నాటకం చూడాల్సిందే...

నటీనటులు[మార్చు]

తెలుగు నాటకరంగంలో ఆసక్తి కలిగిన యువకులకు ఈ నాటకంలో నటించడానికి థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు) లో శిక్షణ ఇచ్చారు. వారితో ఈ నాటకాన్ని ఎన్నో ప్రాంతాల్లో ప్రదర్శించారు. దీనిలో

 • పల్లవి
 • పవన్ రమేష్,
 • ప్రవీణ్ కుమార్,
 • శ్రీనివాస్,
 • వికాస్ చైతన్య,
 • సుధాకర్,
 • సాయి కిరణ్,
 • సాయి లీల,
 • పద్మశ్రీ,
 • నిఖిల్ జాకబ్ విద్యార్థులు నటించారు.

సాంకేతిక వర్గం[మార్చు]

దర్శకత్వం, లైటింగ్ - షేక్ జాన్ బషీర్; దర్శకత్వ పర్యవేక్షణ - రాజీవ్ వెలిచేటి; రచన - చంద్రశేఖర్ ఇండ్ల; సంగీతం - ఎజిల్ మతి; నృత్యం - గిరీష్ చంద్ర; కాస్ట్యూమ్స, ప్రాపర్టీస్ - ఈసునాద్ రాథోడ్.

ఇతరులు[మార్చు]

ప్రదర్శన నిర్వాహణ బాధ్యతను ఎస్.ఎం. బాషా (ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్) స్వీకరించగా, ప్రణయ్‌రాజ్ వంగరి (ప్రాజెక్ట్ అసిస్టెంట్) సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య అనంతకృష్ణన్ (డీన్, యస్.యన్. స్కూల్), డా. ఎన్.జె. భిక్షు (హెడ్, థియేటర్ ఆర్ట్స్), నౌషాద్ (ప్రొఫెసర్, థియేటర్ ఆర్ట్స్), బిజు శ్రీథరన్, శివ ప్రసాద్, రాంమోహన్ తదితరులు ఉపాధ్యాయులుగా పాల్గొన్నారు.

ప్రింట్, విజువల్ మీడియా[మార్చు]

1. http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/brave-act/article4953622.ece

మూలాలు[మార్చు]

 1. "థియేటర్ ఔట్రీచ్ యూనిట్ అధికారిక వెబ్ సైట్". Archived from the original on 2013-04-20. Retrieved 2013-09-15.