అనగనగా కథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనగనగా కథల సూచిక చిత్రం

అనగనగా అనేది పిల్లలకోసం ప్రత్యేకంగా తయారవుతున్న ఆడియో కథల మొబైల్ అప్లికేషన్. పేదరాశి పెద్దమ్మ కథ, తెనాలిరామకృష్ణ కథ, చందమామ కథ, కాశీమజిలీ కథ, బేతాళ కథ, తాతమ్మ కథ, లాంటి బహుళ ప్రచారంలో వున్న కథలను ప్రత్యేకంగా పిల్లలను ఉద్దేశించి ఆడియో పద్ధతిలో అందించే ప్రక్రియలోని అంతర్జాల అప్లికేషన్ ఇది. వర్గాల వారీగా వున్న కథలను వాటికి సంబంధించిన వివరణను ముందస్తుగా ఇచ్చి ఆ వర్గంలోని కథలను సంగీతాన్ని శబ్దాలను జోడించి దీనిద్వారా అందిస్తారు.

ఉద్ధేశ్యం[మార్చు]

అనగనగా అధికారిక లోగో

ఆధునిక సాంకేతికత పెరిగిన నేపథ్యంలో పిల్లలు కథలకు దూరం కాకూడదని, సాంస్కృతిక వారసత్వంగా వారికి అందుతున్న అంశాలను కోల్పోకూడదనే ఉద్దేశంతో దీనిని రూపొందించినట్లు పేర్కొన్నారు. అంటే పిల్లలను గాడ్జెట్స్ అనే అరణ్యంలో ఎక్కడైతే పొగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ వారి వెతుకులాట ప్రారంభించాలి అనే నినాదాన్ని పేర్కొన్నారు. దృశ్యరూప కథనం కంటే శ్రవణ రూప కథనంలో పిల్లల ఊహాశక్తి మెరుగుపడుతుంది. వారికి మరింతగా ఊహించే అవకాశం కలుగుతుంది.నేటి న్యూక్లియర్ కుటుంబ వ్యవస్థలో పిల్లలకు కథలు చెప్పేంత తీరిక ఎవరికీ ఉండడం లేదు. పిల్లలకోసం కేటాయించే సమయం కూడా లెక్క ప్రకారం, టైం టేబుల్ ప్రకారం జరుగుతున్న ఈ తరంలో తల్లిదండ్రులతో పిల్లలకు అనుబంధాన్ని పెంచేందుకు కూడా ఇవి తోడ్పడతాయి తల్లిదండ్రులు ముందుగా ఈ కథలను విని వాటిని తామే చెప్పగలిగితే పిల్లలతో కూడా మరింత అనుభందం పెరుగుతుంది అనే ఉద్ధేశ్యాన్ని కూడా పేర్కొన్నారు. అంటే పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా ఒక సోర్సుగా ఈ కథల గుచ్ఛం అందుబాటులో వుంటుంది.

తెలుగు కథ[మార్చు]

బ్రౌన్ నిఘంటువు ప్రకారం కథ అనగా ఇంచుక సత్యమైన కల్పిత ప్రబంధము తెలుగు కథ (Telugu Story) తెలుగులో ఒక చక్కటి ఆస్వాదించదగిన సాహితీ ప్రక్రియ. తెలుగు అకాడమి వారి నిఘంటువు ప్రకారం కథ అనగా ‘కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్య గ్రంథం’. కథ పర్యాయపదాలు చరిత్ర, గాథ, వృత్తాంతం. కథ ప్రకృతి అయితే కత వికృతి. కథలు చెప్పేవాడిని 'కథకుడు' అంటారు. తెలుగు నేలలపై చిన్నపిల్లలకు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్నకథలు చెప్పడం బాగా అలవాటు.పిల్లలు వాటిని వింటూ ‘ఊ’ కొడుతూ తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ, అమ్మ, నాన్నల దగ్గర నిద్రపోయోవారు. పాత కాలపు కథల్లో తూర్పుదేశాల కథలు ప్రసిద్ధిపొందాయి. తెలుగులోను, ఇతర భారతీయ భాషలలో కొత్త కథ పుట్టి సుమారు నూరేళ్ళయింది. ఈ నూరేళ్ళలో సుమారు లక్షకు పైగా కథలు రచించబడినట్లుగా ఒక అంచనా. కానీ ఇప్పటి వేగవంతమైన జీవన కాల పరిస్థితులలో కథలను చెప్పే తీరిక ఎవరికీ వుండటం లేదు. నిజానికి ఈ తరం తల్లిదండ్రులకు చెప్పాలన్నా వారికసలు స్వంతంగా కథలే తెలియదు. టీవిలకో, సినిమాలో చూడటం, మొబైల్ లేదా కంప్యూటర్లలో ఆటలు ఆడటం ద్వారా పిల్లలు కథనాలు తెలుసుకుంటారులే అని ఉపేక్షించే పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ముందు కథలు చెపుతూ పిల్లలతో ఆత్మీయ బంధాన్ని ఏర్పరచుకోవాలనుకున్న పెద్దలు సైతం నేర్చుకోవడానికి కథలు ఒక దగ్గర దొరకాలి. కథని ఊరిస్తూ, ఊహించేలా చేస్తూ ఎలా చెప్పాలో ఉదాహరణ పూర్వకంగా తెలియాలి. ఈ ఆడియో కథలలో అటువంటి విధానాన్ని అందజేయగలిగారు.

నేపథ్యం[మార్చు]

తెలుగు భాషపై ప్రేమవున్న కొందరు సాప్ట్ వేర్ నిపుణులు, వ్యక్తిత్వ వికాస బోధకులు, వివిధ రంగాలలో ఉద్యోగస్తులు ఒక జట్టుగా ఏర్పడి జమచేసుకున్న పెట్టుబడులతో ప్రారంభించిన సంస్ధ ఇది. దీనికి బడిమొదటి గంట అనే అర్ధంలో సంస్థ పేరును www.firstbel.com[permanent dead link] అని పెట్టారు.

కథన పద్దతి[మార్చు]

"కథ్" అనే ధాతువునుండి "కథ" అనే పదం పుట్టింది. దీనికి సంభాషించుట, చెప్పుట అనే అర్ధాలున్నాయి. అంటే అసలు కథని కథగా తీసుకోవాలంటే చదువుకోవడం కంటే చెప్పటం వినటమే సరైన పద్ధతి అన్నమాట. అలాగే ఈ విధంగా వినే కథలు కేవలం నీతిబోధకాలుగా వుంటే సరిపోదని పిల్లలకు కథని వినటంలో ఆనందం కలగటం, ఊహాశక్తి పెరగటం అనే అంశాలను ప్రధానంగా ఉన్నాయి. తెలుగులో సాధారణంగా వాడే జాతీయాలు నుడికారాలు, సామెతలు, మొదలైన వాటిని కథానుగుణంగా విరివిగా వాడే ప్రయత్నం చేసారు.

కథా వర్గాలు[మార్చు]

కథలను ఎంచుకుని చదువుకునేందుకు వీలుగా చాలాకాలం నుంచి ప్రముఖంగా వాడుకలో వున్న కథలను, వేర్వేరు దేశాలు, భాషలు, సంస్కృతులకు సంబంధించిన కథలను వర్గాలుగా ఏర్పరచి ఇస్తున్నారు. ఇందువల్ల ప్రతివర్గం తాలూకూ ముందుమాటలో వాటిగురించి కొంత సమాచారం అందించి ఆయా కథల గురించిన అవగాహన కూడా కల్పించగలుగుతున్నారు.

మొదలైనవి

గొంతులు[మార్చు]

కథలను కేవలం చదవటం కాకుండా కథను చెప్పేపద్ధతిని దీనిలో ప్రవేశ పెట్టారు. కథని చెప్పేందుకు ప్రత్యేకంగా తర్ఫీదు తీసుకున్న నిపుణులు ఈ కథలను చదివారు. వారితో పాటు ప్రముఖుల కంఠాలు ఈ అప్లికేషన్ లో వినిపిస్తాయి. అందువల్ల పిల్లలకు, శ్రోతలకు కథలను వినాలనే ఉత్సుకత పెరుగుతుంది. ప్రతికథకు సంబంధించిన ఉపోద్ఘాతాన్ని ప్రముఖ చలనచిత్ర నటులు తనికెళ్ళ భరణి కంఠంద్వారా వినిపించారు.

నేపద్య సంగీతం[మార్చు]

కథలు వినేప్పుడు శ్రోతలు దానిలో లీనమయ్యేందుకు వీలుగా కథనానికి అనుగుణమైన నేపథ్య సంగీతాన్ని, శబ్ధాలను దీనితో జతచేసారు. ఉదాహరణకు కథలో రాత్రికి సంబంధించిన వర్ణనల అనుభూతి అందేందుకు కీచురాళ్ళ అరుపులు, వసంతకాలం అనేందుకు కోయిల కూతలు వంటివి ఎంపిక చేసిన శబ్ధాలు ప్రధానమైన కంఠాన్ని మించిరాకుండా అవసరమైనంత మేరకు వినిపిస్తాయి.

ఎటువంటి కథలున్నాయి[మార్చు]

  • పది కథల్లోనూ పాత్రలు అవే వుంటాయి గానీ, కథలు మాత్రం దేనికదే విడికథగా వుండాలి. అంటే ప్రతికథకూ ప్రారంభమూ, ముగింపూ వుంటుంది.

ప్రతి కథా యేదో ఒక మంచి విషయాన్ని కచ్చితంగా చెప్పేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలా అని నీతి సూత్రాలు కాదు. మానవజాతి పురోగమనానికి అవసరమైన ఏ సూత్రాన్నైనా ఇక్కడ ఎత్తి పట్టేవిధంగా వుంటాయి

  • కథ సరళమైన తెలుగు భాషలో వుంటుంది. తెలుగులోని వివిధ ప్రాంతాలలో వాడే మాండలీకాల కథలను కూడా కొన్ని ప్రత్యేక విభాగాలలో చేర్చారు.
  • వినేవారికి తెలుగు భాషపై ఆసక్తిని పెంచేదిగా వుండాలనే జాగ్రత్త తీసుకున్నారు.కానీ భాషా పటాటోపంతో గందరగోళం చేయకుండా జాగ్రత్త పడ్డారు.
  • కథనం ఆహ్లాదకరంగా వుండాలని. సంక్లిష్టమైన పదాలకంటే అచ్చతెలుగు పదాలకే ప్రాధాన్యత ఇవ్వాలని దానివల్ల, తెలుగులో కనుమరుగు అవుతున్న పదాలనూ, జాతీయాలనూ, పలుకుబడులనూ నేటి బాలలకు పరిచయం చేయబూనుకున్నారు.
  • ప్రతి కథలో సంధర్భోచితంగా తెలుగు సామెతలను వుపయోగించారు.
  • కథల్లో యెక్కడా మూఢనమ్మకాలకు వత్తాసు పలకుండా వాటి చెడు ప్రభావం పిల్లలపై పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
  • దేవుడు, దయ్యాల జోలికి వెళ్ళకుండా వుండేందుకు ప్రాముఖ్యతనిచ్చారు.
  • కథ తెలుగువారి జీవనశైలినీ, తెలుగుభాష తియ్యదనాన్ని ప్రతిబింబిస్తాయి.
  • అలాగని కథలన్నీ రచయతల సొంతమై వుండనవసరంలేదు. వారు వివధ సందర్భాలలో విన్న, చదివిన మంచి కథలను అనగనగా పద్ధతికి అనువుగా వినసొంపుగా మలిచి ఇచ్చిన వాటిని ఎంపికచేసారు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]