అనిల్ గంగూలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనిల్ గంగూలీ
జననం1933
మరణంజనవరి 16 2016
క్రియాశీల సంవత్సరాలు1970 నుంచి 1990
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బాలీవుడ్ దర్శకుడు, రచయిత
పిల్లలురూపాలీ గంగూలీ , విజయ్ గంగూలీ

అనిల్ గంగూలీ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, రచయిత. ఆయన బాలీవుడ్ చరిత్రలో 1970 నుంచి 1990 వరకు ఆయన ఎన్నో మరపురాని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక కోరాకాగజ్, తపస్య చిత్రాలకు జాతీయ అవార్డులు వరించాయి. సాహెబ్‌, త్రిష్న, కాందాన్‌, హమ్‌ కాదామ్‌, ప్యార్‌ కే కబిల్‌, బలిదాన్‌ చిత్రాలతో తనదైన ముద్రవేశారు. ఆయన మిథున్ చక్రవర్తితో అనేక సినిమాలలో కలసి పనిచేసారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన తన కెరీర్ ను సాహిత్యం నుండి బలమైన స్త్రీ పాత్రలు, వైవాహిక సమన్వయ లోపాలు గల చిత్రాలతో తన కెరీర్ ను ప్రారంభించారు. ఆయన తీసిన్ రెండవ చిత్రం "కోరా కాగజ్"ను అసుతోష్ ముఖోపాధ్యాయ వ్రాసిన "సాత్ పాకె బంధా" ఆధారంగా తీసారు. ఈ చిత్రం బెంగాలీ భాషలో అదే పేరుతో యిదివరకే విదుదలైంది. ఆయన సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన జయబాధురి ఫిలిం ఫేర్ ఉత్తమ నటీమణి పురస్కారం అందుకుంది.[1] తరువాతి చిత్రం "తపస్య" (1975)ను రాజ్‌శ్రీ ప్రొడక్షన్స్ ద్వారా "రాఖీ"తో తీసారు. ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత్రి ఆశాపూర్ణాదేవి వ్రాసిన కథ ఆధారంగా చిత్రీకరించారు. రాఖీకి కూడా ఫిలిం ఫేర్ ఉత్తమ నటీమణి పురస్కారం లభించింది.[2] ఆ తరువాత ఆయన శరత్ చంద్ర ఛటోపాధ్యాయ నవల "పరిణిత" ఆధారంగా "సంకోచ్" (1976)ను సులక్షణా పండిట్, జితేంద్ర లతో చిత్రీకరించారు.[3] 1980 లో ఆయన రాఖీతో మరల "హం కదమ్"ను సత్యజిత్ రే కథ "మహానగర్" ఆధారంగా తీసారు.[2]

తరువాత ఆయన 1985లో అనిల్ కపూర్, అమృతా సింగ్ తారాగణంగా తీసిన "సాహెబ్" చిత్రం ఆయనకు అతిపెద్ద చివరి చిత్రం. తరువాత మిధున్ చక్రవర్తితో కలసి ఏక్షన్, థ్రిల్లర్ చిత్రాలను తీయుటకు దృష్టి మళ్ళించారు. ఆయన కొన్ని బెంగాలీ సినిమాలలో కూడా పనిచేసారు. ఆయన చివరి బెంగాలీ చిత్రం "కియే పారా కియే నాజరా" (1998)ను "తపస్ పాల్", "దేబాశ్రీ రాయ్" లతో చిత్రీకరించారు.[2] ఆయన జనవరి 16 2016 న తన 82వయేట మరణించారు.[4]

చిత్రాలు

[మార్చు]

అవార్డులు

[మార్చు]
 • నేషనల్ ఫిల్మ్‌ అవార్డులు (భారతదేశం)
  • 1974 : బెస్ట్ పాపులర్ ఫిల్ం ప్రొవైడింగ్ హోల్ సేం ఎంటర్‌టైన్‌మెంట్: కోరా కాగజ్ [5]
  • 1975: బెస్ట్ పాపులర్ ఫిల్ం ప్రొవైడింగ్ హోల్ సేం ఎంటర్‌టైన్‌మెంట్: తపస్య [6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన కూతురు రూపాలీ గంగూలీ నటిగా, కుమారుడు విజయ్‌ గంగూలీ నృత్యదర్శకుడు, దర్శకుడిగా కొనసాగుతున్నారు.

మూలాలు

[మార్చు]
 1. Gulazar; Nihalani, Govind; Chatterjee, Saibal (2003). Encyclopaedia of Hindi cinema. Popular Prakashan. p. 431. ISBN 978-81-7991-066-5.
 2. 2.0 2.1 2.2 Khalid Mohammed (16 February 2013). "The forgotten director of Bengal". Deccan Chronicle. Archived from the original on 19 ఏప్రిల్ 2014. Retrieved 19 April 2014.
 3. "The different faces of Parineeta". Rediff.com movies. 8 June 2005. Retrieved 19 April 2014.
 4. http://indianexpress.com/article/entertainment/bollywood/filmmaker-anil-ganguly-no-more/
 5. "22nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 1 October 2011.
 6. "23rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011.

ఇతర లింకులు

[మార్చు]