అనిల్ మాధవ్ దవే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనిల్ మాధవ్ దవే
అనిల్ మాధవ్ దవే


కేంద్ర పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
2016 జులై 5 – 2017 మే 18
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు ప్రకాష్ జవదేకర్
తరువాత హర్షవర్థన్

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
2009 ఆగస్టు – 2017 మే 18
నియోజకవర్గం మధ్యప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-07-06)1956 జూలై 6
బాద్నగర్, మధ్యప్రదేశ్, భారతదేశం
మరణం 2017 మే 18(2017-05-18) (వయసు 60)
న్యూఢిల్లీ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
పూర్వ విద్యార్థి గుజరాతీ కాలేజీ, ఇండోర్
వృత్తి పర్యావరణవేత్త, రాజకీయ నాయకుడు

అనిల్ మాధవ్ దవే (1956 జూలై 6 - 2017 మే 18) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో 2016 జులై 5 నుండి 2017 మే 18 వరకు కేంద్ర పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అనిల్ మాధవ్ దవే 1956 జూలై 6న మధ్యప్రదేశ్‌లోని బాద్‌నగర్‌లో జన్మించాడు. ఆయన గుజరాతీ కళాశాల నుండి ఎం.కామ్‌ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

అనిల్‌ మాధవ్‌ దవే ఆర్ఎస్ఎస్ లో చేరి ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన 2009లో మధ్యప్రదేశ్‌ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై నీటి వనరుల కమిటీ, సమాచార, ప్రసారాల శాఖ కమిటీ, వాతావరణ మార్పులపై అధ్యయన కమిటీ సహా పలు కమిటీల్లో సభ్యుడిగా పని చేశాడు. అనిల్‌ దవే 2016లో జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో 2016 జులై 5న పర్యావరణ, అటవీ శాఖ బాధ్యతలను చేపట్టాడు.

మరణం

[మార్చు]

అనిల్ మాధవ్ దవే అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2017 మే 18న మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Full list: PM Modi's new-look Cabinet". The Times of India. 5 July 2016. Archived from the original on 5 July 2016. Retrieved 5 July 2016.
  2. Sakshi (18 May 2017). "కేంద్రమంత్రి అనిల్‌ మాధవ్‌ దవే హఠాన్మరణం". Archived from the original on 2 September 2022. Retrieved 2 September 2022.
  3. The News Minute (18 May 2017). "Environment Minister Anil Madhav Dave passes away, he was 60" (in ఇంగ్లీష్). Retrieved 4 September 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)