అనీల సుందర్
అనీల సుందర్ | |
---|---|
జననం | ఉల్హాస్‌నగర్, థానే జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం | 1951 నవంబరు 11
వృత్తి | కథక్, ఒడిస్సీ నర్తకి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సింధీ బ్యాలెట్స్ |
అనీల సుందర్ (జననం 1951 నవంబర్ 11) సింధీ కమ్యూనిటీకి చెందిన భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి.[1] కథక్, ఒడిస్సీ నృత్యాలకు ప్రసిద్ధి చెందింది.[2]
ఆమె వివిధ ఇతివృత్తాలతో ప్రయోగాలు చేసింది. భారతీయ జానపద నృత్యంలోని కొన్ని అంశాలను జోడించి సింధీ నృత్య నాటకానికి ఆమె రూపాన్ని ఇచ్చింది.[3] ఆమె బ్యాలెట్‌లలో కొన్ని మొహెంజొదారో కోల్పోయిన సింధు నాగరికత, సిక్కా సజన్ జీ – సింధ్ ప్రేమ పురాణాలు, థీయు నా జుదా జానీ ముంఖాన్ – ప్రేమ, సంపద గురించి ప్రశ్నించడం, సింధ్ మున్హింజీ అమ్మ - భారతదేశ విభజన రోజులలో సింధీల కష్టాల కథలను వివరించింది.[4]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]అనీల సుందర్ 1951 నవంబరు 11న ఉల్హాస్‌నగర్[5]లో వైద్య నిపుణులు డాక్టర్ నాంకి, డాక్టర్ గోవింద్ మఖిజానీలకు జన్మించింది. ఆమె ముంబై యూనివర్సిటీలో క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందింది. ఆమె 11 సంవత్సరాల వయస్సులో అలహాబాద్‌లోని ప్రయాగ్ సంగీత సమితి నుండి కథక్ పరీక్షలో పట్టభద్రురాలైంది.[6] ఆమె గురువులు హజారీలాల్, దమయంతి జోషి. అలాగే ఆమె విజయ్ కుమార్ శ్రేష్ఠ వద్ద కూడా శిక్షణ పొందింది.
కెరీర్
[మార్చు]ముంబైలోని జై హింద్ కాలేజీలో లెక్చరర్‌గా కొంతకాలం విధులు నిర్వహించింది. ఇక నృత్యం విషయానికి వస్తే 1968లో యూనివర్శిటీ ఆఫ్ బాంబే నిర్వహించిన యూత్ ఫెస్టివల్‌లో ఇంటర్-కాలేజియేట్ క్లాసికల్ డ్యాన్స్ పోటీలో ఆమె అరంగేట్రం చేసింది.[7] 1971లో లయన్స్ క్లబ్ ఆఫ్ బాంబేచే స్పాన్సర్ చేయబడిన యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ విద్యార్థిగా ఆమె జపాన్ సందర్శించింది.[8]
ఆ తరువాత ఆమె నట్బర్ మహారాణా, శంకర్ బెహ్రా వంటి గురువుల వద్ద ఒడిస్సీ నేర్చుకుంది. ఆమె 1999లో ఓర్లాండోలోని ఆరవ అంతర్జాతీయ సింధీ సమ్మేళన్ (కన్వెన్షన్)లో, న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ సింధీ అసోసియేషన్‌తో కలిసి ప్రదర్శన ఇచ్చింది. ఆమె 1998, 2000లలో సింధు దర్శన్ మహోత్సవ్‌లో లేహ్‌లో ప్రదర్శన ఇచ్చింది. ఆమె దేశంలోనే కాక అమెరికా, జపాన్, పశ్చిమ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్కాండినేవియన్ దేశాలు, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి వివిధ దేశాలలో ప్రదర్శన ఇచ్చింది.
దాతృత్వం
[మార్చు]అనీల సుందర్ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా ఉంటుంది. 1975లో ఆమె నైజీరియాలో నేషనల్ ఉమెన్ సొసైటీ ఆఫ్ నైజీరియా కోసం లాగోస్‌లోని ఇండియన్ ఉమెన్ రెసిడెంట్స్ నిర్వహించిన ఫండ్ రైజర్ ప్రదర్శన ఇచ్చింది.[9] దేశంలో ఆమె 2001లో జబల్‌పూర్‌లోని క్యాన్సర్ ఆసుపత్రి కోసం,[10] ముంబైలోని పేద బాలికల కన్యాదాన్ కోసం నిధుల సేకరణకై కూడా ప్రదర్శనలు ఇచ్చింది.[11]
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Meet Anila Sunder a Danseuse of grace and charm". Bharat Ratna. July 1985.
- ↑ "Kathak dancer Anila Sunder to perform at a cultural event organised by Suhini Sindhi Sanstha in Mumbai - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-19.
- ↑ Das, Ujjayini (November 2003). "Bridge Across Forever". The Indian Express.
- ↑ Srivastava, Abha (February 2002). "Cuff Parade's Dancing Queen". Downtown Plus.
- ↑ "सिंधी लोकनृत्य में पगी एक कत्थक शैली". Navbharat Times. August 2002.
- ↑ "Anila Sunder | Sindhi Sangat". www.sindhisangat.com. Retrieved 2021-09-19.
- ↑ "Sindhi Artist, Sindhi Kalakar Anila Sunder Details". sindhyat.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-19.
- ↑ Jotswani, Motilal (March 1986). "Anila Sunder - a gifted Kathak Dancer". The Evening News.
- ↑ "N 2000 Collected". Independent Nigeria.
- ↑ "Dancer Anila Sunder to perform for Cancer Hospital". The Hitavada.
- ↑ "Bombay Sindhi Dance Ballet". Femina (India).