Jump to content

అనురూప రాయ్

వికీపీడియా నుండి
అనురూప రాయ్
జననం (1977-03-10) 1977 మార్చి 10 (వయసు 47)
న్యూ ఢిల్లీ, భారతదేశం
జాతీయతఇండియన్
వృత్తిలెక్చరర్, పప్పెట్ థియేటర్, కళాకారిణి
క్రియాశీల సంవత్సరాలు2004 – ప్రస్తుతం

అనురూపా రాయ్ (జననం: 1977 మార్చి 10) తోలుబొమ్మలాట భారతీయ కళాకారిణి. అలాగే ఆమె తోలుబొమ్మల రూపకర్త, పప్పెట్ థియేటర్ డైరెక్టర్ కూడా.[1][2][3]

ఆమెకు కేంద్ర సంగీత నాటక అకాడమీ 2006లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందచేసింది. ఆమె ప్రో హెల్వెటియా స్విస్ ఆర్ట్స్ కౌన్సిల్‌లో కళాకారిణిగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్‌లో విజిటింగ్ ఫ్యాకల్టీ.[4]

విద్యాభ్యాసం

[మార్చు]

పప్పెట్ థియేటర్

[మార్చు]
  • 2001లో స్వీడన్‌'లోని స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయంలో డిప్లొమా ఇన్ పప్పెట్ థియేటర్‌
  • లా స్కౌలా డెల్లా నుండి గ్వారెటెల్లెలో డిప్లొమా, ట్రడిషనల్ గ్లోవ్ పప్పెట్రీ
  • 2002లో బ్రూనో లియోన్ ఆధ్వర్యంలో ఇటలీలోని నేపుల్స్‌లో గ్వారాటెల్లె (స్కూళ్ ఆఫ్ ట్రడిషనల్ గ్లోవ్ పప్పెట్రీ)

కెరీర్

[మార్చు]

ఆమె 1998లో ప్రారంభించిన గ్రూప్ కటకథ 2006లో కటకథ పప్పెట్ ఆర్ట్స్ ట్రస్ట్ గా రిజిస్టర్ అయింది.[5] ఆమె రామాయణం, మహాభారతం నుండి షేక్స్పియర్ కామెడీ వరకు 15 షోలకు పైగా దర్శకత్వం వహించింది. వీరు ఉపయోగించే తోలుబొమ్మలు 3 అంగుళాల నుండి నలభై అడుగుల వరకు ఉంటాయి. వీరు తోలుబొమ్మలాట ప్రదర్శనలు ఐరోపా, జపాన్, దక్షిణ ఆసియా అంతటా పర్యటించారు.[6][7]

కాశ్మీర్, శ్రీలంక, మణిపూర్ వంటి సంఘర్షణ ప్రాంతాలలో జువెనైల్ రిమాండ్ హోమ్‌లకు సైకో సోషల్ జోక్యాల కోసం తోలుబొమ్మలను ఉపయోగించడం ఆమె పనిలో ప్రధాన అంశం. ఆమె ఎయిడ్స్, లింగ సమస్యల గురించి అవగాహన పెంచడానికి తోలుబొమ్మలను ఉపయోగించి దేశవ్యాప్తంగా యువత, మహిళలతో కలిసి పనిచేసింది.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Anurupa Roy | India Foundation for the Arts". Indiaifa.org. Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 19 November 2021.
  2. Khurana, Chanpreet. "An Indian puppeteer is trying to firmly knot fringe narratives to mainstream audiences". Scroll.in. Retrieved 19 November 2021.
  3. Pragati K.B. (11 June 2013). "Magic in the mundane". The Hindu.
  4. "Interview With Anurupa Roy". Mumbaitheatreguide.com. Retrieved 19 November 2021.
  5. "Untitled Document". Archived from the original on 19 January 2014. Retrieved 2015-03-10.
  6. Jamal, Aliya. "Puppetry: A Way of Life For Anurupa Roy". Thecitizen.in. Archived from the original on 28 ఏప్రిల్ 2019. Retrieved 19 November 2021.
  7. "Anurupa Roy". indiaifa.org. Archived from the original on 2023-03-16. Retrieved 2023-03-16.

బాహ్య లంకెలు

[మార్చు]