Jump to content

అపరాజిత సారంగి

వికీపీడియా నుండి
అపరాజిత సారంగి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019
నియోజకవర్గం భువనేశ్వర్
ముందు ప్రసన్న కుమార్ పాతసాని

వ్యక్తిగత వివరాలు

జననం (1969-10-08) 1969 అక్టోబరు 8 (age 55)
ముజఫర్‌పూర్, బీహార్, భారతదేశం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సంతోష్ కుమార్ సారంగి (ఐఏఎస్)
సంతానం అర్చిత సారంగి, శిఖర్ సారంగి
వృత్తి రాజకీయ నాయకురాలు

అపరాజిత సారంగి (జననం 8 అక్టోబర్ 1969) భారతదేశానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారిని, రాజకీయ నాయకురాలు.[1] ఆమె 1994 బ్యాచ్‌కు చెందిన మాజీ ఒడిశా కేడర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి. ఆమె భువనేశ్వర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైంది.[2][3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అపరాజిత సారంగి 8 అక్టోబర్ 1969న బీహార్‌ రాష్ట్రం, ముజఫర్‌పూర్ జిల్లాలో అజిత్ మిశ్రా, కుసుమ్ మిశ్రా దంపతులకు జన్మించింది. ఆమె బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని మౌంట్ కార్మెల్ స్కూల్ నుండి మెట్రిక్యులేషన్, భాగల్‌పూర్‌ విశ్వవిద్యాలయంలోని ఎస్.ఎం కళాశాల నుండి ఆంగ్లంలో (ఆనర్స్) పట్టభద్రురాలైంది. అపరాజిత 24 సంవత్సరాల వయస్సులో 1994లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.

ఐఏఎస్ అధికారిగా

[మార్చు]

అపరాజిత 1994 బ్యాచ్ ఒడిశా కేడర్ నుండి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరి 1996లో మూడు సబ్-డివిజన్‌లకు సబ్ కలెక్టర్‌గా, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా పని చేసింది. ఆమె 1998 నుండి 2006 వరకు ఆమె నువాపాడా, కోరాపుట్, బర్‌గర్ జిల్లాల కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్‌గా, 2006 నుండి 2009 వరకు భువనేశ్వర్ మున్సిపల్ కమిషనర్‌గా, 2009లో ఒడిశా ప్రభుత్వంలో పాఠశాల విద్య, పంచాయతీ రాజ్ & టెక్స్‌టైల్ శాఖల కార్యదర్శిగా, 2013లో భారత ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు జాయింట్ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వానికి మారి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత 2018లో సివిల్ సర్వెంట్‌గా పదవీ విరమణ చేసింది.

రాజకీయ జీవితం

[మార్చు]

అపరాజిత సారంగి రాజకీయాల పట్ల ఆసక్తితో తన ఉద్యోగానికి రాజీనామా చేసి 27 నవంబర్ 2018న భారతీయ జనతా పార్టీలో చేరి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భువనేశ్వర్ నుండి బీజేపీ నుండి పోటీ చేసి తొలిసారి 17వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై,[4] వివిధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యురాలిగా నియమితురాలైంది.[5]

ఆమె 2024లో ఎన్నికలలో భువనేశ్వర్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎంపీగా ఎన్నికైంది.[6]

మూలాలు

[మార్చు]
  1. The Economic Times (23 March 2019). "Former IAS officer Aparajita Sarangi puts in long hours as politician too". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  2. "Odisha: four women candidates win seats in Lok Sabha elections" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 6 June 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  3. "Women register impressive wins". The Times of India. 5 June 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  4. Swarajya (May 2019). "Former IAS Officer And BJP Leader Aparajita Sarangi Wins Bhubaneswar Lok Sabha Seat". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  5. ThePrint (13 October 2022). "Odisha MP Aparajita Sarangi elected Asia Pacific Group's Inter-Parliamentary Union panel member". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  6. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.