Jump to content

అప్సరసలు (జాబితా)

వికీపీడియా నుండి

స్వర్గంలో దేవతలను నాట్యగానాలతో అలరించేందుకు నియనించబడీనవారు అప్సరసలు.[1] అందంగా ఉన్నవారిని గురించి పొగడాలనుకుంటే ఎవరైనా అప్సరసలాగా ఉన్నావని అంటారు.పురాణాల ప్రకారం రాసిన గ్రంథాల ద్వారా అస్సరసలు అనే వారు దేవలోకంలో ఉన్నారని లేదా ఉండేవారని తెలుసుకుంటున్నాం.అసలు అప్సరసలు ఎంతమందో చాలామందికి తెలియకపోవచ్చు.అప్సరసలు  అనగానే గుర్తుకి వచ్చేది కేవలం ఒక నలుగురు పేర్లు మాత్రమే చెబుతారు.చాలామందికి తెలిసిన అప్సరసలు నాలుగు, ఐదు మాత్రమే.బ్రహ్మ పురాణం ప్రకారం 31 మంది అప్సరసలు ఉన్నారు. వీరిని  ఏకత్రింశతి అప్సరసలు అని అంటారు.[2] అప్సరసశబ్దమునకున్న అనేక వ్యుత్పత్తులలో 'అద్భ్యః సరంతీతి అప్సరసః'-జలమునందు పుట్టినవారు అనునదొకటి.ఇది వారి పుట్టుకకు సంబంధించినది.జలముకాక మరి 13 జన్మస్థానములు బాణుని కాదంబరి లో అప్సరసల జన్మవృత్తాంతమును చెప్పబడెను. ఇది 1915లో వావిళ్ళ వారు అచ్చువేసిన కాదంబరి ప్రతిను అచ్చువెసినారు.పాండురంగ మహత్యమున తెనాలి రామకృష్ణుడు అప్సరసల జన్మస్థానములనిట్లు వివరించినాడు.

స్మర శశి-తటి దజ పవమా
న రవి సుధా సలిల మునిజన క్ష్మా రిష్టా
సుర మృత్యు జ్వలన జలగు
సురవేశ్యలు...

రామకృష్ణుని కంటే ముందు శ్రీనాధుడు అప్సరసల జన్మస్థానములనిట్లు చెప్పియున్నాడు.

జలజగర్భుని మానసంబు వేదంబులు
దక్షప్రజాపతి దర్పకుండు
సౌదామినీ వల్లి చంద్రికాలోలంబు
సంతజిహ్వ జ్వాల సస్తకంబు
రవి మయూఖములు నీరవని దుగ్దాంభోది
మృత్యుదేవత నోరి మొరుగుబండ్లు
ముని కరిష్టాదేవికిని సంభవించిన
దివ్య గంధర్వ జాతి ద్వయంబు
గారణంబులుగా బుట్టినారు పదియు
నాల్గుకోట్లప్సరసలు... శివరాత్రి మహత్యము

శ్రీనాధుడు ఈఅప్సరసల జన్మస్థానములను చెప్పుటలో కాదంబరిని పూర్తిగా అనుసరించలేదు.కాదంబరిలో చెప్పబడిన పవనమును శ్రీనాధుడు చెప్పలేదు.దాని స్థానమున దక్షప్రజాపతిని పేర్కొనినాడు.కాదంబరి పేర్కొనిన మృత్యువును శ్రీనాధుడు మృత్యుదేవత నోరి మెరుగుబండ్లుగా చిత్రించినాడు. అమృతమునకు బదులుగా శ్రీనాధుడు అమృతమునకు పుట్టినిల్లైన దుగ్దాంభోది అని చెప్పినాడు.

అప్సరసలు పేర్లు జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సాంబశివరావు, శ్రీ ఊలపల్లి. "అప్సరసలు - 31 మంది : అనుయుక్తాలు : వివరణలు : పోతన తెలుగు భాగవతము". telugubhagavatam.org. Retrieved 2020-08-06.
  2. "అప్సరసలు ఎంతమంది?". telugudaily24.com. Retrieved 2020-08-06.[permanent dead link]