సహజన్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సహజన్య, దేవలోకానికి రాజు అయిన ఇంద్రుని ఆస్థానాన్ని అలంకరించే 31 మంది నృత్యంలో ఎక్కువ ప్రతిభ కలిగిన ఊర్వశి,రంభ,తిలోత్తమ,ఘృతాచి మొదలగువారిలో సహజన్య ఒకరు.వీరిని దేవలోకానికి చెందిన అప్సరసలు అంటారు.హిందూ పురాణం ప్రకారం అప్సరసలు అందమైన స్వర్గపు వనదేవతలు.[1]

సూర్యరథంలో సహజన్య[మార్చు]

ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథంలో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు, ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు.[2] వర్షఋతువుకు చెందిన ఆషాఢ మాసంలో వశిష్ఠ, వరుణ, రంభ, వాయు, చిత్రసేన అనేవారితో పాటుగా సహజన్య సూర్యరథంలో తిరుగుతుంది. [3]

అప్సరసలు[మార్చు]

సహజన్యతో పాటుగా 31మంది ఇతర అప్సరసలు శ్రీమద్భాగవతంలో ప్రస్తావనకు వచ్చారు.[4]

మూలాలు[మార్చు]

  1. "Bring on the dancing girls?". Hindustan Times (in ఇంగ్లీష్). 2006-08-19. Retrieved 2020-08-11.
  2. "కళావసంతము:బెజ్జాల కృష్ణమోహనరావు:ఈమాట:మే2010". Archived from the original on 2014-07-06. Retrieved 2014-03-12.
  3. వసిష్ఠో వరుణో రమ్భా సహజన్యస్తథా హుహూః శుక్రశ్చిత్రస్వనశ్చైవ శుచిమాసం నయన్త్యమీ:శ్రీమద్భాగవతం
  4. చతుర్థ స్కంధము, 909వ. పద్యము

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సహజన్య&oldid=3011175" నుండి వెలికితీశారు