అఫ్రోజ్ అహమ్మద్ షేక్

వికీపీడియా నుండి
(అఫ్రోజ్‌ అహమ్మద్‌ షేక్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అఫ్రోజ్‌ అహమ్మద్‌ షేక్‌, వీరి కవితలు, పాటలు, వ్యాసాలు వివిధా పత్రికలలో ప్రచురితం. అనువాదాలు మాత్రమే కాకుండ పలు స్వతంత్ర రచనలు చేశారు. మంచి వక్త,, గాయకుడు.

బాల్యము[మార్చు]

అఫ్రోజ్‌ అహమ్మద్‌ షేక్‌ కృష్ణా జిల్లా విజయవాడలో 1980లో జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ మహబూబాషా, షేక్‌ మొహర్‌ జబీన్‌. చదువు: బి.సి.ఎ., ఫాజిలే ఇస్లామియా. వ్యాపకం: భాషా అనువాదాం.

రచనా వ్యాసంగము[మార్చు]

1999లో 'సృష్టి నిదర్శనం' తొలి రచన వెలువడింది. దీనితో ఇతని రచనా వ్యాసంగము ప్రారంబమైనది. వీరి కవితలు, పాటలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితం. అనువాదాలు మాత్రమే కాకుండ పలు స్వతంత్ర రచనలు చేశారు. వీరు మంచి వక్త,, గాయకుడు. ఇస్లామీయ సాహిత్యంతో కూడిన దాదాపు 60 పుస్తకాలను ఉర్దూ, అరబ్బీ, ఆంగ్ల భాషల నుంచి తెలుగులోకి అనువదించారు. ఆయన గ్రంథాలలో 'వేదాల్లో ముహమ్మద్‌ (స) ' టైటిల్‌తో 2007లో వెలువరించిన గ్రంథం గుర్తింపు తెచ్చింది. వీరి లక్ష్యం : అత్యుత్తమ సాహిత్య విలువలతో, పాత్రికేయ విలువలతో, ఉన్నత ప్రమాణాలతో, ఇస్లాం సందేశాన్ని ప్రజా బాహుళ్యానికి అందజేయడం.

మూలాలు[మార్చు]

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010

ప్రచురణకర్త—ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌

చిరునామా వినుకొండ - 522647. పుట 39