అబ్దుల్ జలీల్ షేక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్దుల్‌ జలీల్‌ షేక్‌, ఉర్దూ, అరబిక్‌ భాషలలోని ధార్మిక గ్రంథాలను తెలుగులోకి అనువదించి ప్రచురిస్తున్నారు.

బాల్యము

[మార్చు]

అబ్దుల్‌ జలీల్‌ షేక్‌: కృష్ణా జిల్లా, విజయవాడలో 1953 మే 15న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ అమీనాబీ, షేక్‌ అబ్దుల్‌ గపూర్‌. వీరు పదవ తరగతి వరకు చదువు కున్నారు. వృత్తి: వ్యాపారం., ధార్మిక సేవ. ప్రస్తుతం గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన నులకపేట గ్రామంలోని 'నూరాని జామియా మస్జిద్‌' ఇమాంగా పనిచేస్తున్నారు. వీరు 2005 నుండి రచన వ్యాసంగం ఆరంభించి ఉర్దూ-అరబిక్‌ భాషలలోని ధార్మిక గ్రంథాలను తెలుగులోకి అనువదించి ప్రచురిస్తున్నారు.

రచనలు

[మార్చు]
  1. 'దానమహిమలు' (2005),
  2. 'పవిత్ర ఖుర్‌ఆన్‌ (తాత్పర్యము, 2009),
  3. ఖుర్‌ఆన్‌-హదీస్‌, అహ్‌లే హదీస్‌ ధర్మము (2010).

లక్ష్యం

[మార్చు]

ప్రజలలో ముఖ్యంగా ముస్లిం ప్రజానీకంలో చిట్లం కట్టుకు పోయిన ధార్మిక అలసత్యం, ఉదాసీనతను పోగొట్టాలన్నది వీరు ప్రధాన లక్ష్యము.

మూలాలు

[మార్చు]