అబ్దుల్ బారీ ఫిరంగీ మహలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్దుల్ బారీ ఫిరంగీ మహలీ

అబ్దుల్ బారీ ఫిరంగీ మహలీ (1878-1926) భారతీయ ముస్లిం పండితుడు, రచయిత. [1] అతడు లక్నోలోని ఫిరంగీ మహల్ రాజభవనానికి చెందినవాడు.

చరిత్ర[మార్చు]

అబ్దుల్ బారీ పూర్వీకులు బారాబంకీ లోని సిహాలీనుండి 1692 లో ఫిరంగీ మహల్‌కు వెళ్ళింది. [1] 1915 లో అతను లక్నోలో నివసించేవాడు.

రాజకీయాలు[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అతను టర్కీ సుల్తాన్‌ను, బ్రిటన్‌కు మద్దతు ఇవ్వాలనీ లేదంటే యుద్ధానికి దూరంగా ఉండాలనీ కోరాడు. [2]

ముస్లింల పట్ల బ్రిటిషు వారి వైఖరికి వ్యతిరేకంగా బారీ, 1919 జనవరి 26 న లక్నోలో ఒక నిరసన సమావేశానికి అధ్యక్షత వహించాడు. [3] [4]

అతను ఖిలాఫత్ ఉద్యమంలో అత్యంత చురుకుగా పనిచేసాడు. [1]

ప్రత్యేకించి ఖిలాఫత్ ఆందోళన సమయంలో అతను హిందూ -ముస్లిం ఐక్యతను బోధించాడు. మహాత్మా గాంధీకి సహచరుడు. ఇతర సందర్భాల్లో, హిందువుల విశ్వాసాలను గౌరవిస్తూ, గోవులను బలి ఇవ్వవద్దని ముస్లిములను కోరాడు. [5]

సంస్థలు[మార్చు]

  • పాశ్చాత్య విద్యను వ్యతిరేకిస్తూ, అతను లక్నోలో మదర్సా-ఇ-నిజామియాను స్థాపించాడు.
  • బ్రిటిషు వారు ముస్లిం పవిత్ర స్థలాలను అపవిత్రం చేయకుండా నిరోధించడానికి అతను అంజుమన్-ఇ-ఖుద్దం-ఇ-కబ్బా (1914) ను ఏర్పాటు చేశాడు.
  • అతను దారుల్ ముస్సాన్నేఫిన్ షిబ్లి అకాడమీ వ్యవస్థాపక సభ్యుడు, (1915-1916). [6]
  • జామియా మిలియా ఇస్లామియా వ్యవస్థాపక (1920) సభ్యుడు. [7]

పుస్తకాలు[మార్చు]

అబ్దుల్ బారీ 111 పుస్తకాలను రచించాడు. [1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Cam Diary: Lucknow's Farangi Mahal". Daily Times (newspaper). Archived from the original on 22 April 2007. Retrieved 22 August 2019.
  2. Gandhi's Rise to Power: Indian Politics 1915–1922 By Judith M. Brown
  3. Jafariya News, 21 November 2004 Archived 6 ఏప్రిల్ 2010 at the Wayback Machine
  4. The historic perspective of Inhidaam-e-Jannatul Baqee & Jannatul Mualla Archived 12 ఏప్రిల్ 2010 at the Wayback Machine
  5. September 1923. Francis Robinson, Separatism Among Indian Muslims, Delhi, 1975, p. 339.
  6. Darul Musannefin Shibli Academy Archived 2019-02-22 at the Wayback Machine Retrieved 22 August 2019
  7. "Jamia Millia Islamia, A Historical Note". Archived from the original on 30 June 2007. Retrieved 22 August 2019.