Jump to content

అభిజత్ జోషి

వికీపీడియా నుండి
అభిజత్ జోషి
జననం (1969-12-01) 1969 డిసెంబరు 1 (వయసు 55)
వృత్తి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
లగే రహో మున్నా భాయ్ (2006)
3 ఇడియట్స్ (2009)
పీకే (2014)
సంజు (2018)
జీవిత భాగస్వామిశోభ జోషి
పిల్లలు1
తల్లిదండ్రులుజయంత్ జోషి (తండ్రి)
నీల జోషి (తల్లి)
బంధువులుసౌమ్య జోషి (తమ్ముడు)

అభిజత్ జోషి, హిందీ సినిమా స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు, నిర్మాత, ఎడిటర్. వినోద్ చోప్రా ప్రొడక్షన్స్, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీతో కలిసి లగే రహో మున్నా భాయ్ (2006), 3 ఇడియట్స్ (2009), పీకే (2014), సంజు (2018) మొదలైన సినిమాలకు స్క్రీన్ ప్లే రచయితగా ప్రసిద్ధి చెందాడు. 2003 నుండి ఒహియోలో ఉన్న వెస్టర్‌విల్లే నగరంలోని ఒట్టర్‌బీన్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా ఉన్నాడు.[1][2]

జననం, విద్య

[మార్చు]

జోషి 1969, డిసెంబరు 1న జయంత్ జోషి - నీల జోషి దంపతులకు గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నగరంలో జన్మించాడు.[3][4] తండ్రి జయంత్ జోషి. గుజరాతీ మాధ్యమంలో ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు. శ్రీ హెచ్.కె. ఆర్ట్స్ కళాశాల, (బాగల్ తేలా సమూహంతో) గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి ఉన్నత విద్య పొందాడు. డిటింక్షన్‌తో ఎంఏ (ఇంగ్లీష్) చేశాడు.

ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలోని మిచెనర్ సెంటర్ ఫర్ రైటర్స్ నుండి తన మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌ పూర్తిచేశాడు.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సెంట్రల్ ఒహియోలో నివసిస్తున్న జోషి, అక్కడి ఒహియోలోని వెస్టర్‌విల్లేలోని ఓటర్‌బీన్ విశ్వవిద్యాలయంలో బోధిస్తున్నాడు. ఇతనికి శోభ జోషితో వివాహమైంది, ఒక కుమార్తె ఉంది.[4] ఇతని తమ్ముడు సౌమ్య జోషి ప్రముఖ నాటక రచయిత.

2016లో జోషికి ముంబైలోని హిందుజా హాస్పిటల్‌లో బ్రెయిన్ సర్జరీ చేశారు.[5][6]

సినిమాలు

[మార్చు]
  1. షికార
  2. సంజు
  3. వజీర్
  4. బ్రోకెన్ హార్సెస్
  5. పీకే
  6. నాన్బన్
  7. 3 ఇడియట్స్
  8. ఏకలవ్య: రాయల్ గార్డ్
  9. లగే రహో మున్నా భాయ్
  10. మిషన్ కాశ్మీర్
  11. కరీబ్

అవార్డులు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం సినిమా
2007 జాతీయ చలనచిత్ర అవార్డులు ఉత్తమ స్క్రీన్ ప్లే లగే రహో మున్నా భాయ్
2007 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ కథ
ఉత్తమ సంభాషణలు
2010 ఉత్తమ కథ 3 ఇడియట్స్
ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ సంభాషణలు
2015 ఉత్తమ స్క్రీన్ ప్లే పీకే
ఉత్తమ సంభాషణలు
2007 స్క్రీన్ అవార్డులు ఉత్తమ కథ లగే రహో మున్నా భాయ్
ఉత్తమ సంభాషణలు
2010 ఉత్తమ స్క్రీన్ ప్లే 3 ఇడియట్స్
ఉత్తమ సంభాషణలు
2015 పీకే
2007 ఐఫా అవార్డులు ఉత్తమ సంభాషణలు లగే రహో మున్నా భాయ్
2010 ఉత్తమ కథ 3 ఇడియట్స్
ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ సంభాషణలు
2015 ఉత్తమ సంభాషణలు పీకే
2007 జీ సినీ అవార్డులు ఉత్తమ కథ లగే రహో మున్నా భాయ్
ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ సంభాషణలు
బాలీవుడ్ మూవీ అవార్డులు ఉత్తమ కథ
ఉత్తమ సంభాషణలు
గ్లోబల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ కథ
ఉత్తమ సంభాషణలు
2015 స్టార్ గిల్డ్ అవార్డులు ఉత్తమ సంభాషణలు పీకే

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Abhijat: why should joy vanish from studies?". The Times of India. 17 January 2010. Archived from the original on 11 August 2011.
  2. Sahu, Deepika (8 March 2007). "Lage Raho Abhijat!". The Times of India.
  3. "Abhijat Joshi made 'Gandhigiri' part of India's social lexicon". The Economic Times. 17 January 2010.
  4. 4.0 4.1 "Otterbein professor writes for Indian film". The Columbus Dispatch. 16 January 2010. Archived from the original on 22 January 2013.
  5. "3 Idiots, PK scriptwriter Abhijat Joshi undergoes brain surgery". 24 April 2016.
  6. "Scriptwriter Abhijat Joshi undergoes brain surgery". Business Standard India. Press Trust of India. 23 April 2016.

బయటి లింకులు

[మార్చు]