అభిలాష (ధారావాహిక)
అభిలాష (ధారావాహిక) | |
---|---|
జానర్ | కుటుంబ కథ |
రచయిత | సావిన్ శెట్టి మాటలు ఉదయ్ భాగవతుల (1–56) సురేష్ కులకర్ణి (57–102) నరేంద్ర కుమార్ ఎనుగంటి (103–122) |
ఛాయాగ్రహణం | సావిన్ శెట్టి |
దర్శకత్వం | దినేష్ పయినూర్ (1–10) కుమార్ ఎం (11–102) సంజీవ్ రెడ్డి లింగాల (103–122) |
క్రియేటివ్ directors | అమిత్ భార్గవ క్రియేటీవ్ హెడ్ కొండ రాంబాబు రవి కిషోర్ గురజాడ |
తారాగణం | స్పందన రోహిత్ సాహ్ని అజయ్ రాజ్ శిరీష సౌగంధ్ |
Theme music composer | మీనాక్షి భుజంగ్ |
Opening theme | "ఆ తూర్పు సింధూరంలా" హేమచంద్ర (గానం) సాగర్ (పాటల) |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 122 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | శశి మిట్టల్ సుమీత్ మిట్టల్ జితేంద్ర సింఘాల రాజీవ్ పోర్వాల్ |
ఛాయాగ్రహణం | సుదేష్ కోటైన్ ఎం. కుమార్ కెమెరామెన్ ఉమేష్ |
ఎడిటర్లు | రామకృష్ణ కాంచి సతీష్ కులకర్ణి అనగొండ |
కెమేరా సెట్అప్ | మల్టిపుల్ కెమెరా |
నిడివి | 20–22 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | శశి సుమీత్ ప్రొడక్షన్స్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జెమినీ టీవీ |
చిత్రం ఫార్మాట్ | 576ఐ ఎస్.డి., 1080ఐ హెచ్.డి. |
వాస్తవ విడుదల | 26 ఆగస్టు 2019 – 18 జనవరి 2020 |
కాలక్రమం | |
Preceded by | రోజా |
Followed by | మధుమాసం |
అభిలాష జెమినీ టీవీలో ప్రసారమైన ధారావాహిక. 2019, ఆగస్టు 26 నుండి 2020, జనవరి 18 వరకు సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి గం. 7.30 నిముషాలకు ప్రసారం చేయబడింది.[1][2] శశి సుమీత్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం. కుమార్ దర్శకత్వం వహించిన ఈ ధారావాహికలో స్పందన, రోహిత్ సహ్ని ప్రధాన పాత్రల్లో... అజయ్ రాజ్, శిరీష సౌగంధ్[3] ముఖ్యపాత్రల్లో నటించారు. ఉదయ టివిలో ప్రసారంకాబడిన నాను నన్న కనసు అనే కన్నడ ధారావాహికకు రిమేక్ ఇది.
కథా సారాంశం
[మార్చు]తన తండ్రి కోరికమేరకు గొప్ప డాక్టర్‌గా పేరు సంపాదించాలని కోరుకునే చిన్న అమ్మాయి జానకి కథ ఇది. చుదువులో చురుగ్గా ఉండే జానకి తన తండ్రిలాగే డాక్టర్ కావాలని కోరుకుంటుంది. వ్యాపారవేత్త విష్ణువర్ధన్ (సాయికిరణ్) ఇంట్లో జాననకి తండ్రి శంకర్ (రవి కిరణ్) వంటవాడిగా పనిచేస్తుంటాడు. అతను తన కలను నెరవేర్చడానికి డాక్టర్ అని తన కుమార్తెతో అబద్దం చెప్తాడు. శంకర్, అతని కుటుంబానికి తన భర్త సహాయం చేయడం చూసి విష్ణువర్ధన్ భార్య భువనేశ్వరి (శిరీష సౌగంధ్) అసూయ పడుతుంది. మరోవైపు, భువనేశ్వరి కొడుకు పాఠశాలలో జానకితో గొడవ పడుతుంటాడు. తన భర్తను శంకర్ నుండి వేరుచేసి వారికి సహాయం చేయకుండా చూడాలని భువనేశ్వరి ప్రయత్నిస్తుంది. జానకికి ఒకరోజు తన తండ్రి వృత్తి గురించి నిజం తెలుస్తుంది. తన తండ్రి కల నెరవేర్చడానికి డాక్టర్ కావాలని నిర్ణయించుకుంటుంది. అంతలోనే తండ్రి ప్రమాదంలో మరణించడంతో జానకి జీవితం మారిపోతుంది. ఈ మనోహర్‌తో తనకు ఉన్న రహస్య సంబంధం గురించి తన భర్తకు తెలియకుండా ఉండడంకోసం భువనేశ్వరి శంకర్‌ను చంపించేస్తుంది.
తండ్రి కలను నిజం చేయడంలో తను అనేక అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుందని జానకికి తెలుసు. ఇన్ని అడ్డంకుల మధ్య జానకి డాక్టర్ అవ్వడంలో కథ ఎలా మలుపు తిరుగుతుందో అన్నది కథ. జాను, వ్యాపారవేత్త కుమారుడు రామ్ చిన్నప్పటి నుండే ఎంతో స్నేహాంగా ఉంటారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, వారి బంధం ప్రేమగా మారుతుంది. డాక్టర్ కావాలన్న తన ఆశయాన్ని సాధించేందుకు జానకి ఉండగా, రామ్ సవతి తల్లి భువన చెప్పుడుమాటల వల్ల వ్యాపారంలో నష్టం వస్తుంది. భువన కుట్రలకు వ్యతిరేకంగా, వారు జీవితంలో ఎలా విజయం సాధిస్తారన్ని మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- స్పందన (జానకి-జాను)
- రోహిత్ సాహ్ని (రఘురాం-విష్ణువర్ధన్ కొడుకు)
- అజయ్ రాజ్ (లక్కి-విష్ణువర్ధన్ చిన్న కొడుకు)
- శ్రీనివాస్ వర్మ (విష్ణువర్ధన్)
- శిరీష సౌగంధ్ (భువనేశ్వరి-(విష్ణువర్ధన్ భార్య)
- సుచిత్ర (గౌరీ-జాను తల్లి)
- సుధీర్ (నీలకంఠ-జాను మామయ్య)
పాత నటవర్గం
[మార్చు]- రవి కిరణ్ (శంకర్-జాను తండ్రి)
- సాయి కిరణ్ (విష్ణువర్ధన్)
- మాస్టర్ వెంకట్ శౌర్య (లక్కి చిన్నప్పుడు)
- మాస్టర్ సాత్విక్ (రఘురాం చిన్నప్పుడు)
- బేబి శరణ్య (తారా చిన్నప్పుడు)
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: దినేష్ పయినూర్ (1–10), కుమార్ ఎం (11–102), సంజీవ్ రెడ్డి లింగాల (103–122)
- సృజనాత్మక దర్శకత్వం: అమిత్ భార్గవ
- క్రియేటీవ్ హెడ్: కొండ రాంబాబు, రవి కిషోర్ గురజాడ
- రచయిత: సావిన్ శెట్టి
- మాటలు: ఉదయ్ భాగవతుల (1–56), సురేష్ కులకర్ణి (57–102), నరేంద్ర కుమార్ ఎనుగంటి (103–122)
- టైటిల్ సాంగ్ కంపోజర్: మీనాక్షి భుజంగ్
- టైటిల్ సాంగ్ రచన: సాగర్
- టైటిల్ సాంగ్ గానం: హేమచంద్ర
- నిర్మాతలు: శశి మిట్టల్, సుమీత్ మిట్టల్, జితేంద్ర సింఘాల, రాజీవ్ పోర్వాల్
- కూర్పు: రామకృష్ణ కాంచి, సతీష్ కులకర్ణి అనగొండ
- సినిమాటోగ్రఫీ: సుదేష్ కోటైన్, ఎం. కుమార్
- కెమెరామెన్: ఉమేష్
ఇతర భాషలలో
[మార్చు]భాష | పేరు | ఛానల్ | ప్రసార వివరాలు |
---|---|---|---|
కన్నడ (మాతృక) | నాను నన్న కనసు[4]
(ನಾನು ನನ್ನ ಕನಸು) |
ఉదయ టివి | 5 ఆగస్టు 2019 – 9 ఏప్రిల్ 2020 |
తెలుగు | అభిలాష | జెమిని టివి | 26 ఆగస్టు 2019 – 18 జనవరి 2020 |
అవార్డులు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | గ్రహీత | పాత్ర | ఫలితం |
---|---|---|---|---|---|
2019 | విబి ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెర అవార్డులు 2019 | ఉత్తమ నటి (ప్రేక్షకుల ఎంపిక) | శిరీష సౌగంధ్ | భువన | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ "SunNetwork – Program Detail". sunnetwork.in. Archived from the original on 2020-06-11. Retrieved 2020-06-11.
- ↑ "Abhilasha Gemini Tv Telugu Serial Star Cast And Telecast Time". Indian Television (in అమెరికన్ ఇంగ్లీష్). 1 September 2019. Archived from the original on 23 September 2019. Retrieved 2020-06-11.
- ↑ "Sirisha Sougandh". Onenov (in అమెరికన్ ఇంగ్లీష్). 28 August 2018. Archived from the original on 2 July 2019. Retrieved 2020-06-11.
- ↑ "New show 'Naanu Nanna Kanasu' to premiere on August 5". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-06-11.
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- Pages using infobox television with unknown parameters
- Pages using infobox television with non-matching title
- Pages using infobox television with incorrectly formatted values
- Pages using infobox television with nonstandard dates
- Television articles with incorrect naming style
- తెలుగు ధారావాహికలు