అమరసింహుడు (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమరసింహుడు
కృతికర్త: బేతపూడి వెంకట శివరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: జీవితచరిత్ర
ప్రచురణ:
విడుదల: 1952

రాజస్థాన్‌లోని మేవాడ్ రాజ్యానికి చెందిన రాజపుత్ర రాజు, శౌర్యవంతుడు ఐన అమరసింహుడు జీవితాన్ని ఈ గ్రంథంలో చిత్రీకరించారు. అమర్‌సింహ్ సుప్రసిద్ధ రాజపుత్ర రాజైన రాణా ప్రతాప్ సింగ్ కుమారుడు. ఈ గ్రంథాన్ని బేతపూడి వెంకట శివరావు రచించారు.

రచన నేపథ్యం[మార్చు]

అమరసింహుడు అనే ఈ గ్రంథాన్ని ఓరియంట్ పబ్లిషింగ్ కంపెనీ 1952లో ప్రచురించింది. ఈ పుస్తకాన్ని ఆనాటి ఉన్నత పాఠశాల విద్యార్థుల ఉపయోగార్థం రచించానని రచయిత పేర్కొన్నారు. రచయిత బేతపూడి వెంకట శివరావు ఆ కాలంలో తెనాలి పట్టణంలోని తాలూకా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు.[1]

ఇతివృత్తం[మార్చు]

అమర్‌సింగ్ రాథోర్ రాజస్థాన్ ప్రాంతపు ప్రభువు, మార్వార్ మహారాజు, మొఘల్ సామ్రాజ్య దర్బారులో ఒకరు. ఆయన ప్రతిష్టాకరమైన సాహసం, ధైర్యం, యుద్ధ కుశలతల వల్ల సామ్రాజ్య ప్రభుత్వంలో అత్యున్నత స్థాయికి చేరారు. ఆ కారణంగానే సుబేదారుగా అయ్యారు. తనను జరిమానా అడిగి అవమానించిన మరో ప్రభువు సలాబత్ ఖాన్‌ను చక్రవర్తి సముఖంలోనే చంపిన పౌరుషశీలి. రాజస్థానీ పౌరుష ప్రతాపాలకు ప్రఖ్యాతి వహించిన మేవాడ్ రాజ్యానికి చెందిన రాజు రాణా అమరసింహ్ జీవితగాథను, ఆయన కాలంలోని స్థితిగతులను ఈ పుస్తకంలో వివరించారు. తన పూర్వీకుడైన రాణా ప్రతాప్‌సింగ్ వలెనే బలవత్తరమైన మొఘల్ సామ్రాజ్యాధినేత అక్బర్‌ను ఎదిరించి తన సార్వభౌమాధికారం నిలుపుకునేందుకు పోరాడిన రాజు వీరగాథ ఇది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో నాటి ఉన్నత పాఠశాల విద్యలో భాగంగా బోధించేందుకు ఈ పుస్తకాన్ని రాసిన రచయిత స్వాతంత్ర్య సముపార్జన సాధించిన జాతికి పూర్వుల్లోని వీరులు, నిస్వార్థుల గాథలు చదివి ఆదర్శంగా స్వీకరించాలని పేర్కొన్నారు.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. అమరసింహుడు:బేతపూడి వెంకట శివరావు:1952:పేజీ 1