అమిత్ మిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమిత్ మిత్ర
పశ్చిమబెంగాల్ మంత్రి
In office
2011 - 2021
గవర్నర్కేసరి నాథ్
డిపార్ట్మెంట్
  • ఆర్థిక
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమత బెనర్జీ
అంతకు ముందు వారుతపస్ రాయ్
తరువాత వారుచంద్రనాథ్
డిపార్ట్మెంట్సమాచార శాఖ మంత్రి
పశ్చిమ బెంగాల్ శాసనసభ్యుడు
In office
2011–2021
అంతకు ముందు వారుఆసీం గుప్తా
తరువాత వారుకాజల్
నియోజకవర్గంKhardaha
వ్యక్తిగత వివరాలు
జననం1947 డిసెంబర్ 20
కలకత్తా, పశ్చిమ బెంగాల్ , భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
జీవిత భాగస్వామిమీరా బాలకృష్ణన్
సంతానం1 కూతురు
వృత్తిఆర్థికవేత్తరాజకీయ వేత్త

డా. అమిత్ మిత్రా ఒక భారతీయ ఆర్థికవేత్త రాజకీయవేత్త పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి ప్రస్తుత ప్రత్యేక సలహాదారు. గతంలో అమిత్ మిత్ర పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి ఆర్థిక వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అమిత్ మిత్ర ఖర్దాహా శాసనసభ నియోజకవర్గం నుండి ప్రస్తుతం ఎమ్మెల్యే .గా ఉన్నాడు. 2011 పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలోఅమిత్ మిత్ర పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖమంత్రి అసిమ్ దాస్‌గుప్తాను ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరు పొందాడు..[1][2][3]

రాజకీయ జీవితం[మార్చు]

అమిత్ మిత్రా మమతా బెనర్జీ [4] ఆహ్వానం మేరకు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు 2011 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఖర్దాహా శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అమిత్ మిత్రా ఆ ఎన్నికలలో పశ్చిమబెంగాల్ రాష్ట్ర ఆర్థిక మంత్రి అసిమ్ దాస్‌గుప్తాను 26,154 ఓట్ల తేడాతో ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరు పొందాడు.[5] అసిమ్ దాస్‌గుప్తా 1987, 1991, 1996, 2001 2006లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఖర్దాహా నియోజకవర్గం నుండి వరుసగా ఐదుసార్లు పశ్చిమబెంగాల్ శాసనసభకు ఎన్నికయ్యారు.

అమిత్ మిత్రా 2011 మే 20న పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రిగా నియమించబడ్డాడు.[6][7]

వ్యక్తిగత జీవితం[మార్చు]

అమిత్ మిత్ర తండ్రి హరిదాస్ మిత్ర, స్వాతంత్ర్య సమరయోధుడు పశ్చిమ బెంగాల్ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అమిత్ మిత్రకు బాబాయ్ అవుతాడు.

ములాలు[మార్చు]

  1. "Khardaha". Assembly Elections May 2011 Results. Election Commission of India. Archived from the original on 16 May 2011. Retrieved 2011-05-13.
  2. "134 – Khardah Assembly Constituency". Partywise Comparison Since 1977. Election Commission of India. Retrieved 2011-05-11.
  3. "Statistical Reports of Assembly Elections". General Election Results and Statistics. Election Commission of India. Archived from the original on 5 October 2010. Retrieved 2010-10-15.
  4. "FICCI's Amit Mitra joins Trinamool Congress". News One. Archived from the original on 23 June 2011. Retrieved 20 May 2011.
  5. "FICCI leader Amit Mitra, Kolkata mayor win". News One. Archived from the original on 17 May 2011. Retrieved 2011-05-19.
  6. "Mitra given Finance, Partha commerce/industries". IBN Live. Archived from the original on 22 May 2011. Retrieved 20 May 2011.
  7. "The Ministry". Calcutta, India: The Telegraph, 21 May 2011. Archived from the original on 26 October 2012. Retrieved 2011-05-21.