అమృతరామమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమృతరామమ్
అమృతరామమ్ సినిమా పోస్టర్
దర్శకత్వంసురేందర్ కొంటాడ్డి
రచనసురేందర్ కొంటాడ్డి
నిర్మాతఎస్.ఎన్. రెడ్డి
తారాగణంరామ్‌ మిట్టకంటి
అమితా రంగనాథ్‌
శ్రీజిత్‌ రంగాధరన్‌
జేడీ చెరుకూరి
ఛాయాగ్రహణంసంతోష్‌ సనమోని
కూర్పుకార్తీక్ శ్రీనివాస్
సంగీతంఎన్.ఎస్ ప్రసు
నిర్మాణ
సంస్థలు
పద్మజ ఫిల్మ్స్ ఇండియా
సురేష్ ప్రొడక్షన్స్ (సమర్పణ)
పంపిణీదార్లుజీ5 (ఓటిటి)
విడుదల తేదీ
29 ఏప్రిల్ 2020 (2020-04-29)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్1.5 కోట్లు[1]

అమృతరామమ్ 2020, ఏప్రిల్ 29న విడుదలైన తెలుగు చలనచిత్రం. పద్మజ ఫిల్మ్స్ ఇండియా పతాకంపై ఎస్.ఎన్. రెడ్డి నిర్మాణ సారథ్యంలో సురేందర్ కొంటాడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌ మిట్టకంటి, అమితా రంగనాథ్‌, శ్రీజిత్‌ రంగాధరన్‌, జేడీ చెరుకూరి నటించగా, ఎన్‌.ఎస్‌. ప్రసు సంగీతం అందించాడు.[2] ఓటిటిలో విడుదలైన మొదటి తెలుగు చిత్రం ఇది.[3] ఆస్ట్రేలియాలోని ఒక ఎన్నారై జంట నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. జీ5 (ఓటిటి) లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మోస్తరు స్పందన వచ్చింది.[4]

కథా నేపథ్యం

[మార్చు]

ఆస్ట్రేలియాలో మాస్టర్స్‌ పూర్తి చేసి, తన చదువుకు సరిపడా ఉద్యోగం కోసం రామ్‌ (రామ్‌ మిట్టకంటి) ఎదురు చూస్తుంటాడు. అమృత (అమిత రంగనాథ్‌) మాస్టర్స్‌ చదివేందుకు ఆస్ట్రేలియా వస్తుంది. స్నేహితుడి సూచన మేరకు అమృతను రిసీవ్‌ చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తాడు రామ్‌. తొలి చూపులోనే అతడిని చూసి ప్రేమలో పడుతుంది అమృత. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. అలా కాలం గడుస్తున్న సమయంలో అమృత తీసుకున్న నిర్ణయం ఇరువురి మధ్య గొడవకు దారి తీస్తుంది. వారి గొడవకు కారణం ఏంటి, చివరకు ఇద్దరూ కలిశారా లేదా అన్నది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]
 • రామ్‌ మిట్టకంటి (రామ్)
 • అమితా రంగనాథ్‌ (అమృత)
 • శ్రీజిత్‌ రంగాధరన్‌
 • జేడీ చెరుకూరి

సాంకేతికవర్గం

[మార్చు]
 • రచన, దర్శకత్వం: సురేందర్ కొంటాడ్డి
 • నిర్మాత: ఎస్.ఎన్. రెడ్డి
 • సంగీతం: ఎన్.ఎస్ ప్రసు
 • సినిమాటోగ్రఫీ: సంతోష్‌ సనమోని
 • పాటలు: చైతన్య ప్రసాద్‌, మధుసూదన్‌ రామదుర్గం, కృష్ణ చైతన్య
 • నిర్మాణ సంస్థ: పద్మజ ఫిల్మ్స్ ఇండియా
 • సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్
 • పంపిణీదారు: జీ5 (ఓటిటి)

నిర్మాణం - విడుదల

[మార్చు]

ఈ చిత్రం మొత్తం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లో చిత్రీకరించబడింది.[5] ఈ చిత్రం మొదటగా 2020, మార్చి 25న థియేటర్లలో విడుదలకు షెడ్యూల్ చేయబడింది, కాని కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడి 2020, ఏప్రిల్ 29న నేరుగా జీ5 (ఓటిటి) లో విడుదలైంది.[6]

స్పందన

[మార్చు]

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ చిత్రానికి 2/5 రేటింగ్ ఇచ్చింది. "ఈ చిత్రంలో మెలోడ్రామా ఎక్కువగా ఉందని, కొత్త నటులు సరిగా ఆకట్టుకోలేదు" అని పేర్కొంది.[7] "అమృతారామమ్ కథాంశం పాతదిగా అనిపిస్తుంది" అని ది హిందూ పత్రిక రాసింది.[8] "ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కొత్తగా లేదు" అని సాక్షి పత్రిక రాసింది.[9]

మూలాలు

[మార్చు]
 1. Prakash, B. V. S. (2020-05-15). "OTT premiers best bet for small films over big ones". The Hans India. Retrieved 2020-12-02.
 2. Pecheti, Prakash. "Music composer NS Prasu confident of 'Amrutharamam'". Telangana Today. Retrieved 2020-12-02.
 3. "Amrutharamam to be released directly on OTT". The New Indian Express. Retrieved 2020-12-02.
 4. "Telugu film Amrutharamam failed to impress on Digital release". The Hans India. May 1, 2020. Retrieved 2020-12-02.{{cite web}}: CS1 maint: url-status (link)
 5. Pecheti, Prakash. "Amrutharamam: A tale of love and sacrifice". Telangana Today. Retrieved 2020-12-02.
 6. "'Amrutharamam' to have direct digital release on Zee5". The News Minute. 2020-04-27. Retrieved 2020-12-02.
 7. "Amrutharamam Review: This love story not only lacks the soul and feel but an engaging script". Times of India. Retrieved 2020-12-02.
 8. "'Amrutharamam' movie review: Frustratingly soppy romance - The Hindu". Retrieved 2020-12-02.
 9. "అమృత‌‌రామ‌మ్ సినిమా రివ్యూ". Sakshi. 2020-04-29. Retrieved 2020-12-02.

ఇతర లంకెలు

[మార్చు]